ఉసిరి తేనెలో నానబెట్టి తింటే ఇన్ని ప్రయోజనాలా ?

ఆధ్యాత్మిక పరంగా ఉసిరి కాయలను నానబెట్టిన నీటిలో స్నానమాచరించడం, గంగానదిలో మునిగిన పుణ్యఫలితాన్ని ఇస్తుందట. ఉసిరి ఆయుర్దాయాన్నిపెంచుతుంది, చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. జుట్టును మెత్తగా పట్టులా మారుస్తుంది. ఉసిరికాయ చెట్టు ఇంట్లో వుండటం ద్వారా మనచుట్టూ సానుకూల ప్రభావాన్ని ఏర్పరిచేలా చేస్తుంది. అంతేగాకుండా ఉసిరి చెట్టు మహావిష్ణువు అరచేతిలో నివసిస్తుంది. అలాంటి పుణ్య ప్రదమైన ఉసిరి చెట్టును ఇంట్లో పెంచడం, దానిని పూజించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.

Health Benefits Of Amlaఆధ్యాత్మిక పరంగానే కాదు ‘శ్రీ ఫలం’ అని పిలువబడే ఉసిరికాయ ఎన్నో ఔషధ విలువలు కలిగింది ఉంటుంది. విటమిన్ ‘సి’ పుష్కలంగా ఉన్న ఫలం ఈ ఉసిరి మన ఆయుర్వేద వైద్యంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. తల వెంట్రుకల మొదలు కాలి గోల్లు వరకు ఉసిరి మానవ శరీరానికి అద్భుతంగా ఉపయోగపడే సర్వరోగ నివారిణి. అయితే ఉసిరి కాయను నేరుగా తినడం వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తేనే తో కలిపి తీసుకోవడం వలన అంతకన్నా ఎక్కువ ఉపయోగాలు ఉన్నాయి.

Health Benefits Of Amlaఉసిరి కాయల్లో, తేనెలో ఎలాంటి పోషకాలు ఉంటాయో అందరికీ తెలిసిందే. యాంటీ బాక్టీరియల్‌, యాంటీ ఫంగల్ వంటి గుణాలతోపాటు శరీర వ్యాధినిరోధక వ్యవస్థను పటిష్టం చేసే ఎన్నో గుణాలు ఈ రెండింటిలోనూ ఉన్నాయి. అయితే వీటిని కలిపి మిశ్రమంగా తీసుకుంటే మనకు కలిగే పలు అనారోగ్య సమస్యలను సులభంగా దూరం చేసుకోవచ్చు.

Health Benefits Of Amlaఒక జార్ తీసుకుని అందులో సగం వరకు తేనెతో నింపాలి. దాంట్లో బాగా కడిగి నీడలో ఆరబెట్టిన ఉసిరికాయలను వేయాలి. అనంతరం మూత బిగించి పక్కకు పెట్టాలి. కొద్ది రోజులకు ఉసిరికాయలు పండ్ల జామ్‌లా మారుతాయి. అనంతరం వాటిని తీసి రోజుకొకటి చొప్పున అదే జార్‌లోని తేనెతో కలిపి ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి. ఇలా చేస్తే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.తేనె, ఉసిరికాయ మిశ్రమాన్ని తయారు చేసి తీసుకోవడం వల్ల లివర్ సమస్యలన్నీ దూరమవుతాయి. లివర్ ఆరోగ్యం మెరుగు పడుతుంది. జాండిస్ వంటి వ్యాధులు ఉంటే అవి త్వరగా నయం అవుతాయి. శరీరంలో మరియు కాలేయంలో చేరిన బైల్ పిగ్మెంట్ మరియు టాక్సిన్స్‌ను తొలగిస్తుంది. దాంతో కాలేయం మరింత చురుకుగా పనిచేస్తుంది.

Health Benefits Of Amlaతేనె, ఉసిరి మిశ్రమాన్ని తీసుకుంటే దాంతో ఆస్తమా నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎందుకంటే తేనె, ఉసిరి మిశ్రమంలో ఉండే సహజ సిద్ధమైన పోషకాలు ఆస్తమాను దూరం చేస్తాయి. శ్వాస కోశ సమస్యలు రాకుండా చూస్తాయి. ఉసిరి జ్యూస్‌, తేనె మిశ్రమం వల్ల ఊపిరితిత్తుల్లో ఉండే బాక్టీరియా పోతుంది. జలుబు, దగ్గు, ఫ్లూ జ్వరం త్వరగా తగ్గుతుంది. వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. తేనెలో ఊరించిన ఉసిరికాయ అజీర్తి మరియు ఎసిడిటి సమస్యలకు మంచి విరుగుడు.

Health Benefits Of Amlaఅంతే కాదు ఇది ఆకలిని పెంచుతుంది మరియు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. తేనెలో ఊరిన ఉసిరికాయ ద్రవాన్ని త్రాగడం వల్ల మలబద్దకం నుండి మరియు పైల్స్ నుండి తక్షణ ఉపశమనం కలుగుతుంది. తేనెలో సహజ సిద్ధమైన యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు, ఉసిరిలో యాంటీ బయోటిక్ గుణాలు ఉన్నాయి. దీంతో ఈ మిశ్రమం వైరస్‌లు, బాక్టీరియాలపై సమర్థవంతంగా పోరాటం చేస్తుంది. ఈ క్రమంలో చలికాలంలో మనకు కలిగే దగ్గు, జలుబు, గొంతు ఇన్‌ఫెక్షన్ వంటి వ్యాధులు నయమవుతాయి.

Health Benefits Of Amlaతేనె, ఉసిరి మిశ్రమాన్ని క్రమం తప్పకుండా సేవిస్తుంటే శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలు బయటికి వెళ్లిపోతాయి. రక్తం శుద్ధి అవుతుంది. తేనె, ఉసిరి మిశ్రమం వల్ల శరీరంలో ఉన్న కొవ్వు అంతా కరిగిపోతుంది. దీని వల్ల అధికంగా ఉన్న బరువు తగ్గుతారు. దీంతో గుండె జబ్బులు కూడా రాకుండా ఉంటాయి. ఇది స్థూలకాయం ఉన్న వారికి ఎంతగానో మేలు చేస్తుంది. తేనె, ఉసిరి మిశ్రమాన్ని తీసుకుంటే స్త్రీలలో రుతు సంబంధ సమస్యలు తగ్గుతాయి. దీని వల్ల రుతుక్రమం సరిగ్గా అవుతుంది. పిల్లలు కలిగేందుకు అవకాశాలు పెరుగుతాయి. అదే మగవారిలో అయితే వీర్య నాణ్యత పెరుగుతుంది. లైంగిక పటుత్వం కలుగుతుంది.

Health Benefits Of Amlaతేనె, ఉసిరి మిశ్రమాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటుంటే చర్మంపై ముడతలు తగ్గిపోతాయి. దీని వల్ల చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. కాంతివంతంగా కూడా మారుతుంది. అలాగే తేనె, ఉసిరి మిశ్రమాన్ని సేవిస్తే వెంట్రుకలు కూడా సంరక్షింపబడతాయి. జుట్టు ఒత్తుగా, దృఢంగా పెరుగుతుంది. ప్రకాశవంతంగా కూడా మారుతుంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,460,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR