బ్రెడ్ వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా ?

విదేశాల్లోనే కాదు మనదేశంలోని వివిధ ప్రాంతాల్లో నివాసం ఉండే ప్ర‌జ‌లు త‌మ ఆహారపు అల‌వాట్ల‌కు అనుగుణంగా ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌, ఇత‌ర స‌మ‌యాల్లో భోజ‌నాలు చేస్తుంటారు. అయితే చాలా మంది కామ‌న్‌గా చేసే బ్రేక్‌ఫాస్ట్‌ల‌లో ఒక‌టి బ్రెడ్‌. రెండు బ్రెడ్ ముక్క‌ల‌ను కాల్చి టోస్ట్‌గా చేసుకుని దానిపై జామ్ లేదా వెన్న లాంటిది వేసుకుని కొంద‌రు తింటారు.మరికొందరు బ్రెడ్ పై జామ్ రాసుకుని లాగిస్తారు. కొంద‌రు బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుని తింటారు. ముఖ్యంగా ఉద్యోగ‌స్తులు బ్రేక్ ఫాస్ట్ చేసుకునే స‌మ‌యం, తీరిక‌ లేక బ్రెడ్‌తో క‌డుపు నింపుకుంటుంటారు. అంతేకాదు బ్రెడ్‌తో ఎన్నో ర‌కాల వంట‌లు చేస్తుంటారు. ఎలా చేసినా బ్రెడ్ రెసిపీలు సూప‌ర్ ఫాస్ట్‌గా అయిపోతుంటాయి. అయితే బ్రెడ్ తిన‌డానికే కాదు చ‌ర్మ సౌంద‌ర్యానికి కూడా చక్కగా స‌హాయ‌ప‌డుతుంది.

Health Benefits of Breadఅవును బ్రెడ్ ముక్కలు తినడానికే కాదు.. అందానికి కూడా చాలా ఉపయోగపడుతాయి. ముఖ్యంగా ముఖాన్ని మృదువుగా, నిగారింపుగా మార్చ‌డంలో బ్రెడ్ అద్భుతంగా పనిచేస్తాయి. ఈ బ్రెడ్ ముక్కలను పేస్ట్‌లా తయారుచేసుకుని ఇందులో కొద్దిగా మీగడ కలుపుకుని ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే ముఖం మృదువుగా మారుతుంది.

Health Benefits of Breadఇక ముఖంపై ముడతలు తగ్గడానికి బ్రెడ్ ముక్క‌ల‌ను మిక్సీ జార్‌లో వేసి మెత్త‌గా పొడి చేసుకోవాలి. ఆ బ్రెడ్ పొడిలో పచ్చి పాలు వేసి ఒక రాత్రంత నానబెట్టాలి. పాలు పూర్తిగా ఇంకిపోయిన తరువాత కాస్త పాల మీగ‌డ కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. పావు గంట త‌ర్వాత వేళ్ల‌తో మెల్ల‌గా మెల్ల‌గా రుద్దుకుంటూ గోరు వెచ్చ‌ని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.ఇలా రెండు రోజుల‌కు ఒక సారి చేస్తూ ముడ‌త‌లు, స‌న్న‌ని గీత‌లు పోయి ముఖం మృదువుగా మారుతుంది. ఒక గిన్నెలో బ్రెడ్ పొడి, ఓట్స్ పొడి మ‌రియు తేనె వేసి బాగా క‌లుపుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసుకుని.కాస్త ఆరిన త‌ర్వాత మెల్ల మెల్ల‌గా స్క్ర‌బ్ చేసుకుంటూ ఫేస్ క్లీన్ చేసుకోవాలి. వారంలో రెండు, మూడు సార్లు ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖం సున్నితంగా, అందంగా త‌యార‌వుతుంది.

Health Benefits of Breadఅలాగే ప్ర‌స్తుత వ‌ర్షాకాలంలో ముఖం నిర్జీవంగా మారుతుంటుంది. అలాంట‌ప్పుడు బ్రెడ్ పొడిలో కొద్దిగా ముల్తానీ మ‌ట్టి మ‌రియు రోజ్ వాటర్ వేసుకుని క‌లుపుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి పూసి బాగా డ్రై అయిన త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల చ‌ర్మ ఛాయ పెర‌గ‌డంతో పాటు కోమ‌లంగా, నిగారింపుగా కూడా మారుతుంది.

Health Benefits of Breadఅలాగే ఉద‌యాన్నే బ్రేక్‌ఫాస్ట్‌లో బ్రెడ్ తినే అలవాటు ఉంటే మానుకోవాలని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఉదయాన్నే బ్రేడ్ తిన‌డం వ‌ల్ల అందులో ఉండే గ్లూటెన్ అనే ప‌దార్థం మ‌న‌కు అసిడిటీ స‌మ‌స్య‌ను తెచ్చి పెడుతుంద‌ట‌. అలాగే ఉద‌యాన్నే బ్రెడ్ తిన‌డం వల్ల మెద‌డు ప‌నితీరు త‌గ్గి, డిప్రెష‌న్ వంటి మాన‌సిక స‌మ‌స్య‌లు కూడా వ‌స్తాయ‌ని సైంటిస్టులు త‌మ ప‌రిశోధ‌న‌ల్లో తేల్చారు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR