కొంబుచా టీ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా ?

ప్రస్తుతం ఎన్నో రకాల టీ లు అందుబాటులోకి వస్తున్నాయి. టెక్నాలజీ సహాయంతో ఔషధ గుణాలున్న టీలు తయారు చేస్తున్నారు. ఇప్పటికే మనం ఉల్లి టీ, పుదీనా టీ అంటూ రకరకాల ఔషధీయ టీ ల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మరో సరికొత్త టీ గురించి తెలుసుకుందాం. కొన్ని వందల ఏళ్ల నాటి నుంచే ఈ టీని అనేక దేశాల్లోని పలు వర్గాలకు చెందిన ప్రజలు సేవిస్తున్న టీ కొంబుచా టీ.

Health Benefits of Kombucha teaఇది రష్యాలో మొదటి సారిగా తయారు చేయబడిందని చెబుతారు. కానీ దానికి సరైన ఆధారాలు లేవు. అయితే ఇప్పుడిప్పుడే పలు ఇతర దేశాలకూ ఈ టీ రుచి తెలిసింది. అందుకే ఈ టీని తాగేందుకు ఇప్పుడు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. మరి కొంబుచా టీని నిత్యం తాగడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Health Benefits of Kombucha teaకొంబుచా టీని నిత్యం తాగడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం బాగా తగ్గుతుందని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో వెల్లడైంది. ఈ టీని నిత్యం సేవిస్తే రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీంతో అధిక బరువు కూడా తగ్గుతారు.

Health Benefits of Kombucha teaకొంబుచా టీలో పాలు, పాల సంబంధ పదార్థాలలో ఉండే పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ టీలో ఉండే ప్రొ బయోటిక్స్ మన జీర్ణాశయం, పేగుల్లో ఉండే మంచి బాక్టీరియా సంఖ్యను పెంచుతాయి. దీంతో జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. జీర్ణాశయం, పేగుల్లో ఉండే సూక్ష్మ క్రిములు నశిస్తాయి.

Health Benefits of Kombucha teaక్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడే గుణాలు కొంబుచా టీలో ఉంటాయని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో వెల్లడైంది.

Health Benefits of Kombucha teaగ్రీన్ టీ లాగే కొంబుచా టీలోనూ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వ్యాధులు రాకుండా చూస్తాయి. ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడుతాయి.

Health Benefits of Kombucha teaటైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు నిత్యం కొంబుచా టీని తాగితే మంచిది. వారి రక్తంలో ఉండే షుగర్ స్థాయిలు తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,740,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR