బీరకాయ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఆకుకూరలు, కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. అందులో బీరకాయ కూడా ఒకటి. బీరకాయలో పందిరి బీర, పొట్టి బీర, నెతి బీర, గుత్తి బీర అని వివిధ రకాలు ఉన్నాయి. ఈ బీరలో ఏఒక్కటి తిన్నా సరే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. సాధారణంగా ఎక్కువ శాతం మంది బీరకాయ తినడానికి ఇష్టపడరు. కానీ బీరకాయ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. సులువుగా జీర్ణమయ్యే కూరగాయల్లో బీరకాయ ఒకటి. దీనిలో పీచు పదార్థం ఎక్కువుగా ఉండడం వల్ల వారానికి రెండు సార్లు తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి.

Health benefits of Luffaబీరకాయలో విటమిన్‌ సి, ఐరన్‌ రిబోప్లేవిన్‌, మెగ్నీషియం, థయామిన్‌తో పాటు అనేక రకాల ఖనిజ లవణాలుంటాయి. సెల్యులోజ్‌, నీటిశాతం ఎక్కువ కాబట్టి మలబద్ధకం, పైల్స్‌ సమస్యతో బాధపడేవారికి బీరకాయ తినడం చక్కటి పరిష్కారం. బీటాకెరోటిన్‌ సమృద్ధిగా ఉంటుంది. కంటిచూపును మెరుగుపరుస్తుంది. ఇందులోని విటమిన్‌ బి6 అనీమియాను నివారించగలదని కూడా ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Health benefits of Luffaబీరకాయ విరేచనకారి కూడా. అందువలన పథ్యంగా బీరకాయ చాలా మంచిది. లేత బీరపొట్టు వేపుడు జ్వరంను తగ్గిస్తుంది. బీరకాయలో పీచు అధికంగా ఉంటుంది కాబట్టి దీన్ని మనం రెగ్యులర్ ఆహారంలో చేర్చుకోవాలి. బీరకాయలో కొవ్వు, కొలెస్ట్రాల్‌, కేలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి బీరని మించింది లేదని నిపుణులు అంటున్నారు. బీరకాయలో క్యాలరీలు తక్కువగా ఉండడం వల్ల కొద్దిగా తిన్నా కడుపు నిండిన భావన కలుగుతుంది. తద్వారా బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.

Health benefits of Luffaబీరకాయ రక్తంలోని ఇన్సులిన్ స్థాయిని తగ్గిస్తుంది. ఫలితంగా డయాబెటిస్ అదుపులో ఉంటుంది. బీర కూర రూపంలో అయినా, పచ్చడిలా అయినా, జ్యూస్ లాగా తాగినా షుగర్ వ్యాధికి చెక్ పెట్టేస్తుందట. కామెర్లు వచ్చిన వారు బీరకాయ జ్యూస్ తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. రోగ నిరోధక శక్తి పెంచుతుంది. అంతేకాదు బీరకాయ కళ్ళకు సంభందించిన సమస్యలను కూడా తగ్గిస్తుంది. బీరకాయ తరచు తింటే మీ చర్మం కూడా నిగనిగలాడుతుంది. ముదిరిన బీరకాయల్ని ఎండబెట్టి స్పాంజ్‌గా తయారు చేసుకుని చర్మానికి రుద్దితే మృతకణాల్ని తొలగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.

Health benefits of Luffaబీరకాయ రక్తాన్ని శుద్ధి చేస్తుంది. చర్మాన్ని మెరుగుపరుస్తుంది. మొటిమలు, యాక్నే సమస్యలు తొలిగిపోతాయి. దేహం నుంచి ఆల్కహాల్‌ కారక వ్యర్థాలను తొలిగించి కాలేయం, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అంతేకాదు చాలామంది మహిళలు రక్తహీనతతో భాధపడుతుంటారు. ఈ సమస్యకు బీరకాయ చెక్ పెడుతుంది. కడుపులో మంట తో భాధపడేవారు బీరకాయ తీసుకోవడం మంచిది. అల్సర్లూ మంటలతో బాధపడేవాళ్లకి బీరకాయ దివ్యౌషధంగా పనిచేస్తుంది. బీరకాయలోని విటమిన్‌ ఎ కంటి కండరాల బలహీనత కారణంగా తలెత్తే అంధత్వాన్ని నివారిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Health benefits of Luffaబీరకాయలోని సెల్యులోజ్ కడుపు, ఉదర సంబంధిత సమస్యలు నివారించడంలో మరియు పైల్స్ నివారించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. బీరకాయలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ కారకంగా పనిచేయడం ద్వారా కార్డియో వాస్కులర్, స్ట్రోక్, క్యాన్సర్ వంటి వ్యాధుల నుంచి పరిరక్షిస్తుంది. ఇన్‌ఫ్లమేషన్ అనేది వ్యాధిని కలిగించడంలో తొలిదశ వంటిది. బీరకాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని నిమ్మరసం పిండుకుని తింటుంటే యూరినరి బ్ల్లాడర్ ఇన్‌ఫ్లమేషన్, యూరెథైటిస్ తగ్గుతాయి. దీనిలో యాంటీ బయోటిక్ లక్షణాలు కూడా వుండి బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లను తగ్గిస్తుంది. ముఖ్యంగా యూరినరి ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది.

Health benefits of Luffaవీటిలో విటమిన్ సి కూడా ఉండి జలుబుకు దూరంగా వుంచుతుంది. బి విటమిన్‌లు మంచి మూడ్‌ను, యవ్వనాన్ని అందిస్తాయి. జింక్ రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఐరన్ రక్తహీనతను తగ్గిస్తుంది. మెగ్నీషియం ఎంజైమ్‌లను ఉత్పత్తి చేస్తుంది. క్యాల్షియం, ఫాస్పరస్‌లు ఎముకలను దృఢంగా వుంచుతాయి. ఇన్ని రకాల ప్రయోజనాల గల బీరకాయలను అన్ని సీజన్లలోనూ ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్యంగా వుంటారు. వీటితో రకరకాల వంటల్ని తయారుచేసుకుని వారానికి రెండు సార్లు తినొచ్చు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,490,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR