చాణక్యుడు గురించి కొన్ని ఆశక్తికర నిజాలు

0
3481

చాణక్యుడు తంత్ర జ్ఞుడైన బ్రాహ్మణుడు. అర్థశాస్త్రాన్ని రచించినవాడు. చాణక్య కుటిల నీతి అనేది ఇతడి నుంచే వాడుకలోకి వచ్చింది. భారతదేశంలో చాణక్యుడు గొప్ప దౌత్యవేత్తగా, రాజనీతికోవిదుడిగా, ఆర్థికవేత్తగానూ మన్ననలు అందుకున్నాడు. చాణక్యుడు సామాజిక నిర్మాణం, ప్రపంచ ఆర్థికవ్యవస్థ, విధానాలు, సూత్రాల మొదలైన వాటి గురించి పేర్కొన్నాడు. మరి చాణక్యుడు చెప్పిన ఆ నీతి కథ ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Stories About Chanakyudu

చాణక్యుడు తక్షశిల విశ్వవిద్యాలయంలో ఈవిధంగా చెప్పాడు, ఒక అడవిలో ఒక నిండు గర్భవతిగా ఉన్న లేడి భారంగా అడుగులు వేసుకుంటూ నడుస్తుండగా నొప్పులు మొదలవడంతో అనుకూలమైన ప్రదేశం కోసం చూసిన ఆ లేడి ఒక నది పక్కన ఉన్న ఒక దట్టమైన గడ్డి భూమి కనిపించడంతో అదే అనువైన ప్రదేశం అని భావించి ఆ లేడి గడ్డి భూమిలోకి వెళ్ళింది. ఆ సమయంలో దట్టమైన మబ్బులు కమ్మి, భయంకరంగా పిడుగులు పడుతుండగా, ఒక పిడుగు పడి ఆ అడవి భూమి అంటుకుంది.

Stories About Chanakyudu

ఇది గమనించిన ఒక సింహం ఒక వైపు నుండి లేడి దగ్గరికి వస్తుండగా, మరొక వైపు నుండి ఒక వేట గాడు బాణంతో ఆ లేడి వైపు వస్తు గురిపెట్టారు. దీంతో ఆ లేడికి ఒకవైపు ఏమో సింహం, మరొక వైపు ఏమో వేటగాడు, మరొక పక్క నది, ఇంకో పక్కన అంటుకున్న మంటలు ఇలా నాలుగు వైపులా నుండి మృత్యువు పిలుస్తుండగా, ఆ లేడి మాత్రం అసలు భయపడకుండా, ఇవేమి పట్టించుకోకుండా తన బిడ్డని కనడం పైనే ద్రుష్టి పెట్టింది.

Stories About Chanakyudu

ఆ సమయంలోనే వేటగాడు బాణం వేస్తున్న సమయంలో పిడుగు పడటంతో ఆ కాంతి కారణంగా వేటగాడి కళ్ళు చెమ్మగిల్లి బాణం గురి తప్పి సింహానికి తాకింది. వర్షం కారణంగా లేడి దగ్గరికి సమీపిస్తున్న మంటలు ఆరిపోయాయి. ఆ సమయంలోనే లేడి బిడ్డకి జన్మనిచ్చింది.

Stories About Chanakyudu

ఈ కథలో ఆ లేడి తన చుట్టూ ఏది జరుగుతున్న పట్టించుకోకుండా బిడ్డకి జన్మ నివ్వడం మీదనే ద్రుష్టి పెట్టింది. ఆ సమయంలో కనుక అది ప్రాణాల గురించి అలోచించి ఉంటె ఏం జరిగి ఉండేది? అలానే మన జీవితంలో కూడా అన్ని వైపులా నుండి ఎప్పుడు సమస్యలు చుట్టుముడుతూనే ఉంటాయి. మనలో ఉండే భయం తో మనం చేసే తక్షణ కర్తవ్యం గురించి మరచిపోతాము. భగవంతుడి మీద భారం వేసి మన పని మనం చేయడమే చేయవలసినదని, చాణక్యుడు ఈ నీతికథ ని బోధించాడు.