Home Life Style Few Logicless & Guddi Nammakalu We Indians Follow For No Reason

Few Logicless & Guddi Nammakalu We Indians Follow For No Reason

0

మనం భారతీయులం .. మామూలుగానే సెంటిమెంట్స్ ఎక్కువ మనకి. ఎవరు ఏం చెప్పినా నమ్మేస్తాం, గుడ్డిగా ఫాలో అయిపోతాం. ఒక రకంగా చెప్పాలంటే ఏ కల్మషం లేని స్వచ్ఛమైన మనసులు మనవి. పక్కవాళ్లు చెప్పారు అనో.. ముందు నుండి ఇలాగే చేస్తున్నారు అనో.. మనం కూడా అదే దారిలో వెళ్లిపోయే ఇన్నోసెంట్ హృదయాలు మనవి. రేలంగి మావయ్య చెప్పినట్లు నిజంగానే మనం మంచోళ్లం.. అసలు మనిషి అంటేనే మంచోడురా.. ఏంటి..? సెల్ఫ్ డబ్బా కొడుతున్నా అనుకుంటున్నారా..? చెప్పుకోవాలండీ బాబు.. మన గురించి మనమే బల్ల గుద్ది మరీ చెప్పుకోవాల్సిందే. ఎందుకు అంటారా..? చెప్తా.. చెప్తా..

మీరు చిన్నప్పటి నుండి విచిత్రంగా అనిపించే.. సరిగ్గా చెప్పాలంటే సిల్లీగా అనిపించే ఎన్నో రూల్స్ మీకు తెలియకుండానే ఫాలో అవుతున్నారు. మొదట్లో చెప్పినట్లు దీనికి అసలైన కారణం తెలియకపోయినా ఇలా చేయాలి కాబట్టి .. ఇంతకు ముందు చేశారు కాబట్టి మనం కూడా అదే చేయాలని ఒకలాంటి లైఫ్ స్టైల్ లో ఉండిపోయాం. ఇప్పుడు ఈ టెక్నాలజీ, సోషల్ మీడియా అవేర్‌నెస్, బేసిక్ నాలెడ్జ్ లాంటి వాటిలో మనం డెవలప్ అయ్యాం కానీ ఒకప్పుడు సీన్ వేరేలా ఉండేది. ఏది ఏమైనా.. అవి ఇప్పుడు తలుచుకుంటే కొంచెం సిల్లీగా, కొంచెం ఇంట్రెస్టింగ్ గా కూడా అనిపిస్తాయి. మనం మాట్లాడుకోబోతున్న ఈ విషయాలన్నీ ఎక్కువగా మనం చిన్నప్పుడు తెలిసీ తెలియని వయసులో చేసినవే. సో .. అందులో మీరు ఎన్ని చేశారో, మీకు ఏవేవి గుర్తు ఉన్నాయో ఒక్కసారి మళ్లీ రివైండ్ చేసుకోండి.

1. పుస్తకాల్లో నెమలి ఈకలు

Few Logiclessఇది మనలో దాదాపు అందరం చేసిందే. బుడిబుడి అడుగులు వేసుకుంటూ స్కూల్ కి వెళ్లే రోజుల్లో మనం చేసిన అతి ముఖ్యమైన పని ఇది. పుస్తకాల్లో నెమలి ఈకలు పెడితే అది పిల్లల్ని పెడుతుందని, చదువు బాగా వస్తుందని అనుకునేవాళ్లం. లాజిక్స్ తెలియవు గానీ అప్పుడు ఇది మాత్రం గట్టిగా నమ్మేవాళ్లం.

2. కాకి అరిస్తే చుట్టాలు

మన ఇంటి పైకప్పు మీద వాలి ఏ కాకి అయినా అరిస్తే చాలు.. ఎవరో చుట్టాలు వస్తున్నట్లే. అలా అరిచినపుడు అమ్మ అనేది.. ‘ఈ రోజు కొంచెం ఎక్కువ వంట చేయాల్సింది. ఎవరో వస్తున్నారు మన ఇంటికి’ అని. మరి మా ఇంటికి మాత్రం అలా కాకి అరిచిన రోజు ఎవరూ రాలేదు. పాపం అది దాహం వేసి అరిచి ఉంటుందేమో బహుశా..!

3. తుమ్మితే ఆగాల్సిందే

ఏదైనా ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నప్పుడు ఎవరూ తుమ్మకూడదు. తుమ్మితే మహా పాపమండీ బాబు. అయినా వాళ్ల ముక్కు, వాళ్ల తుమ్ము, వాళ్ల ఇష్టం. మనం మాత్రం వెళ్లే పని ఆపుకుని మరీ కూర్చుని కాసేపయ్యాక వెళ్లేవాళ్లం. అది అంత ముఖ్యమైన పని కాకపోయినా ఆగేవాళ్లం అనుకోండి.. అది వేరే విషయం. ఏది ఏమైనా తుమ్మితే ఆగడం మాత్రం కామన్.

4. పన్ను దాస్తే బంగారం

పెరుగుతున్న వయస్సుతో పాటు పళ్లు ఊడిపోయి కొత్తవి వస్తాయనేది తెలిసిందే. చిన్నప్పుడు పన్ను ఊడితే దాన్ని ఎంత అపూరూపంగా చూసుకునేవాళ్లమో. ఇక దాన్ని ఏదైనా బండరాయి కింద దాస్తే కొన్ని రోజుల్లో అది బంగారం అయిపోతుందని నమ్మేవాళ్లం. మీరు ఎప్పుడైనా అలా చేశారా..? బంగారం అయిందా..? నేను మాత్రం అలా వచ్చినవి మా బీరువా నిండా దాచుకున్నా. హిహ్హిహ్హి.. ఉత్తినే అన్నాలెండి..

5. మంచి రోజు.. చెడు రోజు

ఇది మాత్రం చాలా ముఖ్యమైన విషయం. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా చాలా మంది ఫాలో అవుతుంటారు. ఒక మంచి పని చేయాలంటే దానికి ఒక మంచి రోజు అంటూ ఉండాలిగా మరి. అలా చూసుకుని పనులు మొదలుపెడితే మనకు లాభాలు వచ్చి మనం హ్యాపీగా ఉంటామని. ఇప్పటికీ మా అమ్మ చెప్తుంది.. ఏదైనా చేయాలి, ఇలా చేద్దాం అనుకుంటున్నా అంటే.. రేపు మంచి రోజు, ఈ రోజు శనివారం.. అమావాస్య అని ఏదో కారణం చెప్పి అంత మంచిది కాదని. ఇలాంటివి వినడానికి సిల్లీగా ఉన్నాయి అనుకుంటాం గానీ మన మంచి కోసమే కదండీ. అది వాళ్లకు మన మీద ఉండే పిచ్చి ప్రేమ వల్ల అంతే.

6. తెల్లవారు జాము కలలు

అందరికీ కలలు వస్తాయి. కొన్ని మంచివి, కొన్ని భయపెట్టేవి. ఇలా ఎవరి ఆలోచనల బట్టి వారికి కలలు వస్తాయని అనుకుంటాం. కానీ తెల్లవారు జామున కలలు వస్తే అవి పక్కా నిజం అవుతాయని అంటుంటారు. అని మనం నమ్ముతాం కూడా. అలా మీకు కలలు వచ్చాయా..? నిజం అయ్యాయా మరి..?

7. పిల్లి ఎదురొస్తే

అది అప్పటివరకు ఏ సందులో ఉంటుందో తెలియదు కానీ, మనం ఇంటి నుండి బయలుదేరగానే మనం కావాలనే పిలిచినట్లుగా మనకు ఎదురుగా వచ్చేస్తుంది. దేని గురించని అంటున్నారా ..? పిల్లి అండీ బాబు.. మరీ ముఖ్యంగా నల్ల పిల్లి ఎదురొస్తే అస్సలు మంచిది కాదు. హా.. అలా అని మన పిచ్చి నమ్మకం లెండి. అదేం చేసిందండీ అయినా. అది కూడా మనలాగే ఈ అనంత భూమండలంలో ఉండే ఎన్నో కోట్ల జీవరాశుల్లో ఓ చిన్న ప్రాణి కదా పాపం..!

8. కన్ను అదిరితే

‘ఎడమ కన్ను తెగ అదురుతుంది పొద్దున నుండి. నాకు ఏదో బ్యాడ్ జరగబోతుంది. అంతా ఓకే కదా..?’ ఇదిగో ఇలా ఆలోచిస్తూ ఆ క్షణం నుండి మనం మరింత జాగ్రత్తగా ఉండడానికి ట్రై చేస్తాం. ఏ వైపు నుండి ఎలాంటి ఉపద్రవం వచ్చి పడుతుందో అని భయపడుతూ మనసులో లేనిపోని భయాలు పెట్టేసుకుంటాం. కీడెంచి మేలు ఎంచమన్నారు పెద్దలు. అలా ఆలోచించడం తప్పు అని చెప్పలేం కానీ, అనవసరంగా భయపడి బుర్ర పాడు చేసుకుంటాం. ఏం జరగదు.. బీ కూల్ అండ్ రిలాక్స్.

9. అరికాళ్లలో గోకితే

గోకుతుందండీ.. అరికాలు ఏంటి, బాడీలో ఏ పార్ట్ అయినా..! ఉష్.. వద్దు లెండి, అంటే మళ్లీ అన్నా అంటారు. కారణాలు తెలియవు గానీ ఎప్పుడైనా అరికాళ్లలో కొంచెం గిలిగింత పెట్టినట్లు చిన్నగా వైబ్రేట్ అవుతుంది. చాలా సార్లు నాకు కూడా అలా జరిగింది కూడా. అంత మాత్రానికే ఏదో నష్టం జరగబోతుంది అని అనుకుంటే ఎలా ..? మీరు మరీ అండీ బాబు ..

10. ఒకేసారి మాట్లాడితే..

అనుకోకుండా ఒకేసారి మీరు, మీ ఎదుటి వ్యక్తి ఒకేసారి ఒకే మాట మాట్లాడారా..? అదెనండీ.. బొమ్మరిల్లు మూవీలో జెనీలియా చెప్పినట్లు. అయితే.. మీ ఇంటికో మా ఇంటికో చుట్టాలు వస్తారు. వినడానికి బాగుంటాయి కదా ఇలాంటివి. వచ్చారా మరి..? ఏమో.. వాళ్లు నిజంగా వచ్చినా మర్యాదలూ అవీ చేసి బాగా చూసుకుంటామో లేదో తెలియదు, ఇంకా కొన్నిసార్లు అయితే వాళ్లు ఎప్పుడు వెళ్లిపోతారా అని కూడా చూస్తాం. కానీ ఇలాంటివి మాత్రం బాగా ఇంట్రెస్ట్ కదా..!

11. కుక్కలు అరిస్తే..

ఇది కొంచెం భయపెట్టే విషయం.. కంగారు పడకుండా జాగ్రత్తగా చదవండి. రాత్రి మీ ఇంట్లో మీరు ఒక్కరే పడుకుని ఉన్నప్పుడు బయట కుక్కలు అదే పనిగా అరిచాయా..? చాలా భయమేస్తుంది కదా అలాంటప్పుడు. అవి అలా అరిస్తే వాటికి ఏవో అతీత శక్తులు కనిపిస్తున్నాయని మనం నమ్ముతాం. ఇంకా చెప్పాలంటే అవి అలా అరుస్తున్నాయంటే ఎవరో బకెట్ తన్నేయడానికి రెడీగా ఉన్నారని కూడా చాలా మంది అనుకుంటారు. అంటే.. జరగబోయేది ముందే మనం బ్రహ్మంగారి కాలజ్ఞానం లాగా మనం మైండ్ లో రాసేసుకుంటాం అన్నమాట.

12. ఉన్నపళంగా పొలమారితే

కొంచెం మెల్లగా తినండి.. మీరు కష్టపడి చెమటోడ్చి వండుకున్నది తీరిగ్గా లొట్టలేస్తూ కుమ్మండి. మనకు బాగా ఇష్టమైన కూర ఏదైనా ఇంట్లో చేసినప్పుడు దాని మీద ఇష్టంతో హడావిడిగా తింటే ఖచ్చితంగా పొలమారుతుంది. అలా పొలమారితే మనల్ని ఎవరో గట్టిగా తలుచుకుంటున్నారు అని మనం నమ్ముతాం. నిజమా..? రేయ్ ఎవడ్రా.. ఏ ప్రాణ స్నేహితుడురా నన్ను తలుచుకున్నది. అయితే నేను చాలా లక్కీ అన్నమాట. మా అమ్మ వాళ్లు తలుచుకుని ఉంటారు పాపం.. మా వాడు తిన్నాడో లేదో అని..

సో.. ఫ్రెండ్స్.. ఇవి నేను చిన్నప్పటి నుండి విన్నవి.. అన్నవి.. చేసినవి కూడా. ఇక్కడ ఎవరి సెంటిమెంట్స్ వాళ్లవి. ఎవరి నమ్మకాలు వాళ్లవి. మీ మనోభావాలు దెబ్బ తీయాలనేది నా ఉద్దేశ్యం కాదు. అలా ఎవరికైనా అనిపిస్తే మాత్రం ఈ సారికి క్షమించేసేయండి ప్లీజ్.. అలాగే ఇవి కాకుండా మీరు పెరిగిన వాతావరణంలో మీరు చిన్నప్పటి నుండి నమ్మిన ఇలాంటివి కొన్ని ఖచ్చితంగా ఉండే ఉంటాయి. అవేంటో మాతో పంచుకోండి..

 

Exit mobile version