రాగులలో ఆరోగ్యానికి మేలుచేసే ఎన్నో అద్భుతగుణాలు

0
532

తక్కువ ధరలో, అందరికీ సులభంగా లభించే ఈ రాగులలో ఎన్నో అద్భుతగుణాలు దాగి ఉన్నాయి. ఒకప్పుడు రాగి పిండిని నూకలు కలపి వంట చేసేవారు. దీనిని రాగి సంగటి అనేవారు. ముందు రోజు చేసిన ఆ వంటకమును మరుసటిరోజు ఉదయం మజ్జిగలో లేదా నీటిలో కలుపుకుని (అంబలి) తాగేవారు. దీనిలోని కాల్షియం పిల్లల సక్రమ ఎదుగుదలకు తోడ్పడుతుంది. పిల్లలకే కాదు, పెద్దలు, వృద్దులు, మహిళలకు అమితపుష్టిని కలిగిస్తుంది. రొట్టె , జావా, సంకటి.. ఇలా రాగిని ఏ రూపంలో తీసుకున్నా మంచిదే.

Finger milletరాగులలో క్యాల్షియం, ఐరన్, ప్రోటీన్, ఫైబర్ మరియు మినరల్స్, అయోడిన్ పుష్కలంగా లభిస్తుంది. రాగుల్లో పుష్కలంగా లభించే పీచు కారణంగా రోజూ రాగి జావను మజ్జిగ లేక పాలతో తీసుకునే వారికి జీర్ణ వ్యవస్థ పని తీరు మెరుగుపడి మలబద్ధకం వంటి సమస్యలు దూరమవుతాయి. మధుమేహ వ్యాధికి రాగులతో చేసిన ఆహార పదార్థాలు, రాగుల గంజి, పాలల్లో కలిపిన రాగుల పానీయం చక్కని ఔషధంగా పనిచేస్తుంది. రోజూ రాగి జావను తీసుకుంటే కడుపులో మంట తగ్గటంతో పాటు ఒంటికి చలువ చేస్తుంది. వేసవిలో అయ్యే విపరీతమైన దాహార్తిని రాగి జావ తగ్గిస్తుంది.

Finger milletరాగుల్లో అమినోయాసిడ్స్ అనే ఆమ్లం కలిగి ఉండటం వల్ల ఆకలి తగ్గిస్తుంది. బరువును నియంత్రణలో ఉంచుతుంది. పాలుపడని బాలింతలు రాగి జావ తాగితే క్రమంగా పాల ఉత్పత్తి మెరుగుపడుతుంది. రోజూ రాగి జావ తాగితే మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడే అవకాశాలు తగ్గుతాయి. రాగులను ఆహారంలో భాగంగా తినేవారికి హృదయ సంబంధిత వ్యాధులు, రక్తపోటు, మధుమేహం , ఆస్థమా వంటి సమస్యలు రావు.

Finger milletరాగుల్లో క్యాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు బలంగా ఉండేందుకు సహాయపడుతుంది. రాగులకు రోగనిరోధక శక్తిని పెంచే గుణం ఉంది. రాగుల్లోని అయోడిన్… థైరాయిడ్ సమస్యలకు చెక్ పెడుతుంది. రాగుల్లో నేచురల్ ఐరన్ పుష్కలంగా ఉండడం వల్ల అనిమియాను నివారించడానికి సహాయపడుతుంది. ఎదిగే పిల్లలకు అవసరమైన ఐరన్ రాగుల్లో పుష్కలంగా లభిస్తుంది.

Finger milletనల్లని, ఒత్తైన కురులు కోరుకునే వారు రాగులను తప్పక ఆహారంలో భాగంగా చేసుకోవాలి. ఇది కాలేయవ్యాధులు, గుండె బలహీనత, ఉబ్బసం తగ్గిస్తుంది. వృద్దాప్యంలో వున్న వారు రాగులతో తయారు చేసిన ఆహార పదార్థాలను తినడం వల్ల శరీరానికి బలం, శక్తి చేకూరుతాయి. రాగులను క్రమంతప్పకుండా వినియోగించడం వల్ల వృద్ధాప్యంను దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది. రాగి జావ తీసుకోవటం వల్ల కంటి సంబంధమైన సమస్యలు కూడా తగ్గిపోతాయి. కంటిచూపు కూడా మెరుగుపడుతుంది. ఏముకల దృఢత్వాన్ని పెంచటంలో రాగులు ఎంతగానో ఉపయోగపడతాయి. మోకాళ్ల నొప్పులను నివారిస్తుంది.

  • 100 గ్రాముల రాగులలో
  • ప్రోటీన్ 7.6g
  • ఫ్యాట్ 1.5g
  • కార్బోహైడ్రేట్ 88g
  • కాల్షియమ్ 370mg
  • విటమిన్ – A: 0.48mg
  • విటమిన్ (B1): 0.33mg
  • విటమిన్ (B2): 0.11mg
  • నియాసిన్ : (B3) 1.2mg
  • ఫైబర్ 3 గ్రాములు ఉంటుంది.
SHARE