కల్యాణ చాళుక్యులు నల్లని సబ్బురాతితో నిర్మించిన మొట్ట మొదటి ఆలయం

మన దేశంలో ఉన్న అతి పురాతన ఆలయాల నిర్మాణం అనేది ఒక అద్భుతం. ఒక్కో ఆలయంలో శిల్పకళానైపుణ్యం ప్రతి ఒక్కరిని అబ్బురపరచడమే కాదు అప్పట్లో ఇలాంటి నిర్మాణం ఎలా సాధ్యం అయిందనే ఆశ్చర్యం కలుగుతుంది. అలాంటి అబ్బురపరిచే దేవాలయాలలో ఈ ఆలయం కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు. మరి ఆ ఆలయం ఎక్కడ ఉంది? ఆ ఆలయానికి సంబంధించిన విషయాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Amareswara Swamyకర్ణాటక రాష్ట్రం, హుబ్లీ దార్వాడ్ నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో శ్రీ అమరేశ్వరస్వామి ఆలయం ఉంది. ఇది చాలా పురాతనమైన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. అక్కడి ప్రకృతి అందాలు సందర్శకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. అయితే ఈ ప్రాంతాన్ని పూర్వం చాలామంది రాజులూ పరిపాలించారు. ఆ రాజులందరిలో కళ్యాణి చాళుక్యులు ఎన్నో ఆలయాలు నిర్మించారు. వారు నిర్మించిన ఆలయాలలో ఈ ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయం ఇప్పటికి చెక్కు చెదరకుండా వారి సాంస్కృతిక ఉన్నతికి, కళాసృష్టికి, శిల్పకళా వైభవానికి ప్రతీకగా ఈ ఆలయం ఒక ఉదాహరణగా ఉంది.

Amareswara Swamyఇక కల్యాణ చాళుక్యులు నిర్మించిన ఈ దేవాలయాన్ని 1050 లో ద్రావిడ వాస్తు కళా రీతుల్లో నిర్మించారు. నల్లని సబ్బురాతితో నిర్మించిన మొట్ట మొదటి ఆలయం ఇదేనని చెబుతారు. ఈ అమృతేశ్వర దేవాలయం పై కప్పు 76 స్థంబాల మీద ఆధారపడి ఉన్న విధంగా నిర్మించారు. ఈ స్థంబాల మీద మనోహరమైన నగిషీలు కనిపిస్తాయి. దేవాలయం చుట్టూ ఉన్న గోడల మీద అనేక పురాణ గాథలు మలిచారు. ఈ ఆలయాన్ని నిర్మించిన కళారీతులు అత్యద్భుతంగా ఉంటాయి.

Amareswara Swamyఇలా ఎంతో పురాతనమైన ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వాస్తు ఆ అమరేశ్వరస్వామి దర్శించి తరిస్తారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,490,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR