మానసిక ఆరోగ్యం మీద దృష్టి పెడుతున్నారా?

మన శరీరం ఆరోగ్యంగా ఉండడానికి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. ఆహారం, సప్లిమెంట్స్‌, వ్యాయామం ద్వారా శరీర ఆరోగ్యాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తాం. కానీ మనస్సును మరచిపోతున్నాం. మన మనసు, శరీరం రెండూ వేర్వేరు కావు. అవి రెండూ ఒకటే. ఏదైతే మనసుపై ప్రభావం చూపుతుందో, శరీరంపైనా ప్రభావం చూపుతుంది. అలానే శరీరంపై ప్రభావం చూపేది, మనసుపై ప్రభావం చూపుతుంది. క్రమం తప్పకుండా శ్వాస వ్యాయామాలు చేయడం వల్ల మనసు ఆరోగ్యంగా ఉంటుంది. ఒంట్లోని మలినాలతో పాటు మనసు ఒత్తిడిని పెంచే ఆలోచనలు, భావోద్వేగాలను వదలించుకోవడం కూడా ముఖ్యమే.

అసలు అన్నిటికన్నా ముందుగా మెదడును ప్రశాంతంగా ఉంచుకోవడం ఎందుకు ముఖ్యమో అర్థం చేసుకోవాలి. భారత్‌లో వేగంగా చోటుచేసుకుంటున్న మార్పులు మానసిక సమస్యలకు దారితీస్తున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. నగరాలు విస్తరిస్తుండడం, ఆధునిక వసతులు అందుబాటులోకి వస్తుండడం, చాలామంది సొంతూళ్లు, నగరాలను వీడి కొత్త నగరాలకు మారుతుండడం వంటివన్నీ ప్రజల మానసిక స్థితిపై ప్రభావం చూపుతాయని, ఈ క్రమంలో ఎదురయ్యే అనేక ఇబ్బందులు కుంగుబాటుకు దారితీయొచ్చని చెబుతున్నారు.

  • అంతేకాదు ఇప్పటికీ సమాజంలో చాలామంది మానసిక సమస్యలకు గురవడాన్ని, దాన్నుంచి బయటపడేందుకు చికిత్స తీసుకోవడాన్ని తప్పు పనిగానే భావిస్తున్నారని, బయటకు చెప్పుకోవడం లేదనీ వైద్యులు చెబుతున్నారు. హార్మోన్ సమస్యలు, హైపర్ థైరాయిడిజమ్, డయాబెటిస్, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ సమస్య పెద్ద వాళ్లలోనే కాదు పిల్లల్లో కూడా ఉంటాయట.

  • పిల్లలపై ప్రతిభపరమైన ఒత్తిళ్లు ఉంటున్నాయని.. తల్లిదండ్రులకు తమ పిల్లలు సంగీతంలోనో, డ్యాన్సులోనో, ఆటల్లోనో అద్భుతంగా రాణించాలనే కోరిక వల్ల పిల్లలపై ఒత్తిడి పెరుగుతోందని.. అలాగే పిల్లల మధ్య కూడా సోషల్ మీడియాలో స్టేటస్ అప్‌డేట్ చేయడం వంటి విషయాల నుంచి అనేక అంశాలు ఒత్తిడి పెంచుతూ ఆశించిన గుర్తింపు రాలేదనుకుంటే డిప్రెషన్‌లోకి నెడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటి దుష్పరిణామాలు ప్రమాదకరంగా ఉంటున్నాయని, కొన్ని సందర్భాల్లో ఆత్మహత్యలకూ దారితీస్తున్నాయని చెబుతున్నారు.

  • మన ప్రతి ఆలోచన, భావోద్వేగం శరీరంలోని ప్రతి కణం మీద ఏదో విధంగా ప్రభావం చూపుతుంది. అందుచేత శరీరం, మనసూ ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. తేలికైన ప్రాణాయామం లేదా బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజ్‌ చేయడం వల్ల పాజిటివ్‌ ఆలోచనలు కలుగుతాయి. ప్రకృతిలో కొంత సమయం గడపాలి. ఎండలో కొద్దిసేపు నిల్చోవాలి. గడ్డి మీద, ఇసుకలో కొద్ది సేపు నడవాలి. ప్రశాంతమైన  సంగీతం వినాలి. రోజూ కొంత సమయం ధ్యానం చేయాలి.

  • రోజూ లో  క‌నీసం 6 నుంచి 8 గంట‌ల వ‌ర‌కు నిద్రపోయేటట్టు చూసుకోవాలి. అలా చేయడం వలన  మెదడుకు విశ్రాంతి లభించి  ఉత్సహం గా ఉంటుంది.. ఫ‌లితంగా మాన‌సిక స‌మ‌స్య‌లులేకుండా మెద‌డు చురుగ్గా పనిచేస్తుంది. మ‌నం రోజు తీసుకునే  ఆహారం కూడా మెద‌డు పనిచేసే తీరు పై  ప్ర‌భావం చూపుతుంది. క‌నుక రోజూ ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్క‌లంగా ఉండే ఆహారాల‌ను  తీసుకుంటే మెద‌డు చురుగ్గా ఉంటుంది.

  • రోజూ  ఎదో కొత్త విష‌యాల‌ను నేర్చుకోవ‌డం, ప‌ద‌వినోదం, సుడోకు ఆడ‌డం, ప‌జిల్స్ నింప‌డం, వంటివి మెద‌డుకు మేతపెట్టె లాంటి ప‌నులు చేస్తే మెద‌డు ప‌ని తీరు మెరుగై ఉత్సహం గా ఉంటుంది. దీంతో మాన‌సిక స‌మ‌స్య‌లు అనేవి రావు. మానసిక ఉల్లాసానికి ఆటలు కూడాబాగా పనిచేస్తాయి. అలా ఏ గ్రౌండ్ కో మీ ఫ్రెండ్స్ తో నో, పిల్లలతో నో, లేదా మీ కొలీగ్స్ తోనో వెళ్లి కాసేపు ఆడుకుని వస్తే, కొద్దీ రోజులకే మీలో మార్పు మీకే స్పష్టం గా కనిపిస్తుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,750,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR