Home Unknown facts రుద్రాక్షను ధరించినప్పుడు తప్పక పాటించాల్సిన నియమాలు!

రుద్రాక్షను ధరించినప్పుడు తప్పక పాటించాల్సిన నియమాలు!

0

రుద్రాక్షలు పవిత్రమైనవి, శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి. కాబట్టే ఈ రుద్రాక్షలను శివుని ప్రతిరూపాలుగా కొలుస్తాం. ఇవి రుద్రునికి ఏంతో ప్రీతికరమైనవి. రుద్రాక్షలు ధరించడం వలన అనుకున్న పనులు నెరవేరుతాయి.ఎలాంటి కష్టనష్టాలు రావు. అడ్డంకులు తొలగిపోయి, సుఖసంతోషాలతో గడిపేందుకు పరమశివుడు ప్రసాదించిన దివ్యమైన కానుకే రుద్రాక్ష. తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడుతున్నవారు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు రుద్రాక్షలను ధరిస్తే వారి సమస్యలు మటుమాయమయి సకల సంపదలు చేకూరుతాయని స్కాంద పురాణం చెప్తోంది.

Rudrakshaఅంతేకాదు, ఏవైనా వ్యసనాలకు లోనైనవారు తమ అలవాటు మంచిది కాదని తెలిసి, అందులో నుంచి బయట పడలేకపోతున్నట్లయితే రుద్రాక్షమాలను ధరిస్తే మంచి ఫలితం ఉంటుంది. మెడ, చేతులు, చెవులకు, రుద్రాక్షలను ధరించినవారు ఏ అపజయాలు లేకుండా తిరుగులేనివారిగా ఎదుగుతారు.

రుద్రాక్షలను పద్ధతి ప్రకారం, ఆధ్యాత్మిక గురువులు, పంచాంగ నిపుణుల సూచనల మేరకే ధరించాలి. మహా శివరాత్రి లేదా మాస శివరాత్రి రోజున ధరించడం ఉత్తమం. సోమవారం లేదా పుష్యమి నక్షత్రం నాడు లేదా ఏదైనా శుభ సమయంలో రుద్రాక్షలను శుద్ధి చేసి శివపూజ చేయాలి. ఆ తర్వాతే రుద్రాక్షను ధరించాలి. పౌర్ణమి, త్రయోదశి, చతుర్దశి తిథుల్లో రుద్రాక్షలను ధరించడం శుభదాయకం.

నుదుట విభూతి, కంఠాన రుద్రాక్షమాల ధరించి శివనామ జపం చేస్తున్న వ్యక్తిని దర్శించుకుంటే త్రివేణీ సంగమ స్నానం చేసినంత పుణ్యం కలుగుతుంది. రుద్రాక్షలను ధరించిన వారికి అపజయాలుండవు. అయితే రుద్రాక్ష ధరించినప్పుడు కొన్ని నియమాలు తప్పక పాటించాల్సి ఉంటుంది అవేంటో తెలుసుకుందాం.

1. రుద్రాక్షమాలను ధరించి మైలపడిన వారిని తాకకూడదు.

2. రుద్రాక్ష మాలను ధరించి శ్మశానానికి వెళ్లకూడదు.

3. కుటుంబ సభ్యులు అయినప్పటికీ ఒకరి రుద్రాక్షమాలను మరొకరు ధరించకూడదు.

4. రుద్రాక్షమాలను ఉంగరంలో ధరించకూడదు

5. రుద్రాక్షమాలను ధరించి నిద్రపోకూడదు

6. రుద్రాక్షమాలను ధరించి శృంగారంలో పాల్గొనకూడదు.

7. స్త్రీలు రుతుసమయంలో రుద్రాక్షమాలను ధరించకూడదు.

 

Exit mobile version