కూరల్లో ఉప్పు ఎక్కువైతే ఇలా ట్రయ్ చేసి చూడండి ?

సాధారణంగా ఇంటికి ఎవరైనా బంధువులు, అతిథులు వస్తున్నారంటే వారి కోసం రకరకాల వంటకాలతో విందు రెడీ చేయడం సహజం. అయితే కంగారుతోనో లేదా మతిమరిపుతోనో లేదా ఒక వంటను ఒకరిద్దరు చేయడం వల్ల ఒకరికి తెలియకుండా మరొక్కరు కూరల్లో ఉప్పు ఎక్కువగా వేసేస్తుంటారు.

వంటల్లో ఉప్పు ఎక్కువైందాకేవలం అతిథులు వచ్చినప్పుడే కాదు…సాధారణ రోజుల్లో కూడా మనకు తెలియకుండానే కూరల్లో ఉప్పు ఎక్కువుతుంటుంది. ఇలాంటి పొరపాటు ఏదో ఒక సమయంలో ప్రతి ఇంట్లోనూ జరిగే తంతే.

కూరలో ఉప్పు ఎక్కువ అయితే ఇక అది తినడం కష్టం. కూరలో ఉప్పు తక్కువైతే వేసుకోవచ్చు, కానీ ఎక్కువైన ఉప్పుని తగ్గించడం ఎలాగో మీకు తెలుసా? కూరల్లో ఎక్కువైనా ఉప్పును తగ్గించడానికి కొన్ని బెస్ట్ వంటింటి చిట్కాలు ఉన్నాయంటున్నారు చెఫ్స్.

వంటల్లో ఉప్పు ఎక్కువైందా1.కూరలో ఉప్పు ఎక్కువ అయితే చెక్కు తీసిన బంగాళా దుంప నాలుగు ముక్కలు కోసి ఆ కూరలో వేయండి. 5నిముషాల పాటు అందులోనే బంగాళదుంప ముక్కలను ఉంచడం వల్ల ఎక్కువైన ఉప్పుని ఇవి గ్రహించేస్తాయి.

2. ఇక గ్రేవీ కర్రస్ లో కాస్త నీళ్లు తక్కువ ఉంటే కనుక మరికొద్దిగా నీరు వేసి కూరని బాగా ఉడికించాలి. ఇంకా కూరలో ఉప్పు తగ్గడంతో పాటు రుచికరంగా కూడా మారాలనుకుంటే మాత్రం అందులో పాలు పోస్తే సరిపోతుంది.

3. గోధుమ పిండికి కొద్దిగా నీటిని జతచేసి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని, వీటిని కూరలో వేసి 3 నుండి 4నిముషాలు ఉడకనివ్వాలి. ఇవి కూరలో ఎక్కువగా ఉప్పుని గ్రహించేస్తాయి. తర్వాత వీటిని బయటకు తీసేయవచ్చు.

వంటల్లో ఉప్పు ఎక్కువైందా4. చేసే వంటకాన్ని బట్టి టమోటో ముక్కలు లేదా టమోటో పేస్ట్ ని కూడా జత చేయవచ్చు.

వంటల్లో ఉప్పు ఎక్కువైందా5. కొద్దిగా కొబ్బరి పాలు పోసినా కూడా ఎక్కువైన ఉప్పు సరిపోతుంది,

వంటల్లో ఉప్పు ఎక్కువైందా6.కొంచెం గ్రేవీ కర్రీ అయితే పెరుగు ఫ్రెష్ క్రీమ్ కూడా ట్రై చేయండి లో ఫేమ్ లో పెట్టాలి. పెరుగు వేయడం ఇష్టం లేని వారు దానికి బదులుగా కొద్దిగా మీగడని కూడా ఉపయోగించవచ్చు.

7. కొంచెం పంచదార టేస్ట్ పోకుండా వేసుకున్నా ఉప్పు తగ్గుతుంది.

8. ఇక వీటితో పాటు నిమ్మరసం కూడా ట్రై చేయవచ్చు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR