సాధారణంగా పూజలు కానీ, తీర్థయాత్రలకు వెళ్లాల్సి ఉన్నప్పుడు గాని పీరియడ్స్ ఆలస్యంగా రావడానికి మాత్రలు వేసుకుంటూ ఉంటారు. అలాగే కొన్ని సార్లు ఈ మాత్రల వల్ల కానీ మరే ఇతర కారణాలతోనే పీరియడ్స్ ఆలస్యం అవడం కూడా చూస్తూ ఉంటాం. పీరియడ్ టైం ప్రకారం 45 నుండి 50 రోజుల వరకు రాకపోతే పెద్ద సమస్య కాదు కానీ అంతకు మించి ఎక్కువ సమయం పడితే నిర్లక్ష్యం చేయకూడదు.
అలాంటప్పుడు పీరియడ్స్ ముందుగా అనుకున్న సమయానికే రావాలంటే ఈ ఇంటి చిట్కాలు ప్రయత్నిస్తే సరిపోతుంది. మరి ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా పీరియడ్స్ రావడానికి బొప్పాయి బాగా పనిచేస్తుంది. పచ్చిగా ఉండే బొప్పాయిని రోజుకి రెండు సార్లు భోజనం అయ్యిన తర్వాత తీసుకోండి. కావాలంటే బొప్పాయి రసం కూడా తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల పీరియడ్స్ ముందుగా వస్తాయి.
పసుపు లో ఎన్నో మెడికల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. దీనిని వివిధ రకాలుగా తీసుకోవచ్చు. గోరు వెచ్చని పాలలో చిటికెడు పసుపు వేసి తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఐదు నుంచి పది రోజుల ముందే పీరియడ్స్ వచ్చేస్తాయి.
ఖర్జూరం కూడా ఒంట్లో వేడిని పెంచుతాయి. పీరియడ్స్ వేగంగా రావడానికి ఎక్కువగా ఖర్జూరం తీసుకోండి.
విటమిన్ సి తీసుకోవడం వల్ల పీరియడ్స్ పై ప్రభావం చూపుతుంది. ఇది ఈస్ట్రోజన్ లెవెల్స్ ను పెంచుతుంది మరియు ప్రొజెస్టిరాన్ లెవల్స్ ను తగ్గిస్తుంది. ఈ కారణంగా యూట్రస్ లైనింగ్ బ్రేక్ అయ్యి పీరియడ్స్ రావడానికి వీలవుతుంది. కనుక ఎక్కువగా విటమిన్ సి ఉండే ఆహార పదార్థాలను తీసుకోండి.
అల్లం టీ తీసుకోవడం వల్ల కూడా ఇది మంచి ప్రభావం చూపుతుంది. అల్లం ఒంట్లో వేడి ఇచ్చి పీరియడ్స్ త్వరగా రప్పిస్తుంది. అలా అని అధికంగా అల్లాన్ని తీసుకోకండి. అధికంగా తీసుకున్నట్లయితే ఎసిడిటికి కారణం అవుతుంది.