శరీర దుర్వాసన తగ్గాలంటే ఈ చిట్కాలను పాటించండి

కొంత మంది చూడటానికి చాలా అందంగా ఉంటారు.. కాని వారి శరీరం నుండి దుర్వాసన వస్తూ ఉంటుంది. కొంతమంది చేయి పైకి ఎత్తితే చాలు తట్టుకోలేని వాసన వస్తుంది. దీంతో అలాంటి వారు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. నలుగురిలో ఉండలేరు.

Follow these tips to reduce body odorఈ సమస్య మూడు కాలాల్లో ఉంటుంది, కానీ వేసవి కాలంలో ఇంకా చెమట అధికంగా పడుతూ వాసన దారుణంగా వస్తుంది. చెమట కారణంగా వచ్చే దుర్వాసన పక్కన వారిని కూడా ఇబ్బంది పెడుతుంది. అయితే శరీర దుర్వాసన తగ్గడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. మరి అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం.

Follow these tips to reduce body odorశరీర దుర్వాసన తగ్గాలంటే ముఖ్యంగా అధిక చెమట సమస్య ఉంటే మసాలా కూరలు, ఫ్రైలు జంక్ ఫుడ్ డ్రింకులు మానెయ్యండి, గ్యాస్ ఐటెమ్స్ అసలు తినవద్దు. కుదిరితే చెమటని ఎప్పటికప్పుడు టిష్యూ పేపర్ తో తుడుచుకోండి.

Follow these tips to reduce body odorఅలాగే స్నానం చేసే సమయంలో నిమ్మకాయ రసం ఆ వాటర్ లో పిండండి. స్నానానికి యాంటీబ్యాక్టీరియల్ సోపుని వాడుతూ ఉండాలి. బాగా వాసన వచ్చే పౌడర్ మాయిశ్చరైజర్ వంటి వాడకాన్ని మానెయ్యండి, వీటి వల్ల మరింత చెమట పడుతుంది..

Follow these tips to reduce body odorగ్రీన్ టీ కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.. స్నానం చేసే నీటిలో గ్రీన్ టీ వేసుకుని స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇక ఫేస్ ఫౌడర్ లాంటివి చెమట పట్టే గజ్జలు శంకల్లో రాయకండి, వీటి వల్ల రాషెస్ చెమట అధికంగా ఉంటుంది. ఇవి పాటిస్తే చెమట దుర్వాసన తగ్గే అవకాశం ఉంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,590,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR