చెవిపోటుతో ఇబ్బంది పడుతున్నారా ఇలా చేయండి

చిన్ననాటి నుండి ఏదో ఒక సమయంలో అందరం చెవి నొప్పి బాధను అనుభవించిన వాళ్ళమే. చెవి నొప్పి లేదా చెవికి సంబంధించిన వ్యాధులు అనగానే మనకు ముందుగా చెవిపోటే గుర్తొస్తుంది. ఈ చెవిపోటు బాధ మాములుగా ఉండదు. అసలు కుదురుగా ఉండనివ్వదు. చెవిలో గుణపాలతో పొడుస్తున్నట్టుగా ఉంటుంది. చిన్న శబ్దం వినిపించిన చెవులు పగిలిపోతున్నట్టుగా అనిపిస్తుంది.

ear painపెద్దవాళ్ళైతే చెవిపోటుని తెలుసుకొని టాబ్లెట్స్ వేసుకోవడమే లేదంటే ఏవైనా ఇతర చిట్కాలు పాటిస్తూ నొప్పి నుండి ఉపశమనం పొందుతారు. అదే పిల్లల్లో వస్తే వాళ్లకి చెప్పటం రాకపోవటం వల్ల ఏదో ఒక రకమైన పేచీ పెట్టి ఏడుస్తూ కూర్చుంటారు. అస్తమాట్లు చెవిని నలుపుకుంటూ ఉంటారు. వాళ్ళని చూసి మనకి బాధ.

waxing airఅయితే చెవిపోటు అనిపించిన వెంటనే చాలామంది మొదటి పని చెవిలో పుల్లలు పెట్టి తిప్పడం, చెవిలో కొబ్బరినూనె పొయ్యడమో, గోరువెచ్చటి నీరు పోసెయ్యడమో చేస్తుంటారు. చెవిపోటు ఎందువల్ల వచ్చిందో సరిగ్గా తెలుసుకోకుండా అరకొర జ్ఞానంతో చిట్కావైద్యాలు చేసెయ్యడం ఇతర సమస్యలకు దారితీయొచ్చు లేదా సమస్యను మరింత తీవ్రతరం చేయొచ్చు.

ear painఅందుకే చెవి నొప్పి ఎందుకు వచ్చింది ముందు తెలుసుకోవాలి. నొప్పి ఒక మాదిగా ఉందా లేదా తీవ్రంగా ఉందా, మంటతో కూడిన నొప్పి గుర్తించాలి. నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు తప్పనిసరిగా డాక్టర్ ను సంప్రదించాలి. చెవినొప్పి సహజంగా వచ్చినట్లైతే కొన్ని హోం రెమెడిసీ ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. డాక్టర్ అందించే సరైన ప్రిస్ర్కిప్షన్స్ తో పాటు ఈ హోం రెమెడీస్ కూడా మంచి ఫలితాన్ని అందిస్తాయి.

సాదారణంగా పిల్లలు ఇయర్ బడ్స్ తో ఆడుకుంటూ చెవిలో పెట్టి తిప్పుకుంటూ ఉంటారు. పొరపాటున దానికి ఉన్న దూది చెవిలో ఉండిపోయినా పెద్దగా పట్టించుకోకుండా ఆడేసుకుంటారు. దాని ఫలితంగా కొన్నాళ్ళు పోయేసరికి చెవిపోటు రావటం, దాని వల్ల జ్వరం రావటం ఇలాంటివన్నీ మొదలవుతాయి. అందుకే వీలయినంత వరకు చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో అసలు ఇయర్ బడ్స్ వారికి అందుబాటులో ఉంచకుండా జాగ్రత్త పడటం మంచిది.

హైడ్రోజెన్ పెరోక్సైడ్ ఇలాంటి సమస్యలకి ఒక మంచి విరుగుడు. పిల్లల చెవిలో ఏదైనా చెత్త ఉండిపోయినా లేదా చీమలు, చిన్న పురుగులు లాంటివి ఉండిపోయినా పిలల్ని పడుకోబెట్టి చెవిలో ఐదు చుక్కల హైడ్రోజెన్ పెరోక్సైడ్ వేసి కాసేపు అలానే ఉంచాలి. దానితో చెవిలో ఏదైనా ఉంటే నురుగుతో పాటు బైటకి వచ్చేస్తుంది.

hydrogen peroxideవార్మ్ కంప్రెసర్ చెవి నొప్పి తగ్గించడానికి సహాయపడుతుంది. అంటే వేడినీటిలో డిప్ చేసిన టవల్ తో నొప్పి ఉన్న ప్రదేశంలో కాపడం. వెచ్చదనం వల్ల నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే ఏదైనా వాపు ఉన్న తగ్గుముఖం పడుతుంది. జలుబు వల్ల చెవి నొప్పి ఉంటే కూడా నొప్పి తగ్గిస్తుంది.

ear painముక్కు మూసుకుపోవడం దాంతో పాటు చెవినొప్పి ఉన్నట్లైతే, అది జలుబు వల్ల వచ్చిన నొప్పి అని గుర్తించాలి. మొదట ముక్కును క్లియర్ చేసుకుంటే, చెవునొప్పి అదంట అదే తగ్గుతుంది. అందుకు ఆవిరి పట్టడం చేయవచ్చు. నాజల్ పాస్ వేలో బ్లాక్ అయిన్ ఫ్లూయిడ్స్ క్లియర్ చేయాలంటే ఆవిరి పద్దతి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అందుకు మరిగే నీటిలో కొద్దిగా యూకలిప్టస్ ఆయిల్ వేసి బాగా మరిగించి తర్వాత ఆవిరి పట్టాలి. ఇది ఒత్తిడిని తగ్గించి శ్వాసనాళాన్ని క్లియర్ చేస్తుంది.

steamచెవిపోటు వల్ల ఇబ్బంది పడుతున్నప్పుడు గళ్ళ ఉప్పుని కాస్త కడాయిలో వేడి చేసి దానిని పల్చటి బట్టలో కట్టి ఓర్చుకునే వేడి ఉన్నప్పుడు చెవి చుట్టూ కాపడం పెడితే నొప్పి తగ్గి పిల్లలు హాయిగా నిద్ర పోతారు. వాళ్ళు నిద్రపోయేటప్పుడు తల కింద పిల్లో పెట్టకుండా పడుకోబెడితే మంచి ఫలితం కనిపిస్తుంది.
తులసి రసం కూడా చెవి నొప్పికి బాగా పనిచేస్తుంది. ఒక పది తులసి ఆకుల్ని చేతితో నలిపి రసం పిండి దానిని రెండు చుక్కల చొప్పున రోజులో కనీసం నాలుగు ఐదు సార్లు వేస్తూ ఉండాలి. దొరికితే నల్ల తులసి ఇంకా మంచిది.

basil leafచెవి నొప్పి ఉన్నప్పుడు చెవిలో షార్ప్ గా ఉన్నటువంటి ఎటువంటి వస్తువులను వుంచకూడదు. కాటన్ ఇయర్ బడ్స్ ను వేసి తిప్పకూడదు, అందువల్ల చెవిలో మరింత దుమ్ముచేరే అవకాశం ఉంది.
చెవిలో ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు, ఉల్లిపాయను ఉపయోగించవచ్చు. చెవినొప్పితో పాటు, వాపు ఉన్నప్పుడు, ఉల్లిపాయను మెత్తగా పేస్ట్ చేసి, చెవి నొప్పి ఉన్న ప్రదేశంలో బయటవైపుగా దీన్ని అప్లై చేయాలి.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR