Food Hygiene & Guidelines We Need To Follow To Ensure Our Safety From Covid-19 As Released By FSSAI

Written By ‘Nagaraju Munnuru’

== ఆహారమే ఔషధం: సరైన ఆహారం తినండి, కొవిడ్‌ను ఎదుర్కోండి ==

దేశంలో రోజురోజుకు కరోనా వైరస్ వ్యాప్తి అధికం అవుతున్నది. ఇప్పటికే బీపీ, షుగర్, గుండే జబ్బులు, మూత్రపిండాల సమస్యలు, క్యాన్సర్, ఆస్తమా, ఊపిరితిత్తుల సమస్యలు వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారిలో అధికంగా కరోనా మరణాలు నమోదు అవుతుండగా శరీరంలో రోగనిరోధక శక్తి కలిగినవారు మాత్రం వైరస్ బారిన పడినప్పటికీ చికిత్స అనంతరం కోలుకుంటున్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో కరోనా మహ్మరిని ఎదుర్కోవడానికి బయటికి వెళ్ళినపుడు తప్పనిసరిగా మొహానికి మాస్కులు ధరించడం, తరచుగా చేతులను హ్యాండ్ సానిటైజర్, సబ్బు లేదా లిక్విడ్ హ్యాండ్ వాష్ లతో శుభ్ర పరుచుకోవడం వంటి స్వీయ జాగ్రత్తలతోపాటు, శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవడం కూడా ముఖ్యమే. అందుకే “సరైన ఆహారం తినండి.. కొవిడ్‌ను ఎదుర్కోండి” అనే నినాదంతో‘ భారత ఆహార పరిరక్షణ నాణ్యత ప్రమాణాల పరిరక్షణ సంస్థ (FSSAI) ఆ దిశగా మార్గదర్శకాలు విడుదల చేసింది.

విటమిన్లు, ఖనిజ లవణాలు, ఒమెగా ఫ్యాటీ యాసిడ్‌ తదితరాలను నిత్యం తీసుకుంటే కొవిడ్‌ను సమర్థంగా ఎదుర్కొనే రోగ నిరోధక వ్యవస్థ వృద్ధి చెందుతుందని స్పష్టం చేసింది. అవి ఏయే ఆహార పదార్థాల్లో ఉంటాయి? వాటి వల్ల కలిగే ప్రయోజనాలేమిటి? తదితరాలు తెలియజేస్తూ నివేదిక విడుదల చేసింది. FSSAI విడుదల చేసిన మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి.

ద్రవ పదార్థాలు

1 Corona Foodశరీరంలో తగినంత నీరు ఉంటే విషపదార్థాలను వెలుపలికి పంపించడం సులభమవుతుంది. ముక్కు, శ్వాస నాళాల్లో తడి, జిగురు పదార్థం నిలకడగా ఉండి, వైరస్‌ను లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటుంది. అందుకోసం తరచుగా మంచినీళ్లు, కొబ్బరినీళ్లు, నిమ్మరసం, గ్రీన్‌ టీ, హెర్బల్‌ టీ, సూప్‌లు, పాలు, మజ్జిగ, తీపి, ఉప్పు లేని ద్రావణాలు, పండ్లు, కూరగాయలు తీసుకోవాలి.

ప్రొటీన్లు

2 Corona Foodమనిషి ఆరోగ్యంగా ఉండేందుకు ప్రోటీన్లు దోహదం చేస్తాయి. సోయా ఉత్పత్తులు, ఉప్పు కలపని గింజలు, విత్తనాలు, బీన్స్‌, పప్పు దినుసులు, గుడ్లు, చికెన్‌, మటన్‌, చేప, పాలు, పాల ఉత్పత్తులలో ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి.

ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌

3 Corona Foodగుండె జబ్బుల నివారణకు, రోగ నిరోధక కణాల పనితీరును మెరుగుపరచడానికి ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ దోహద పడతాయి. చేపలు, వాల్‌నట్స్‌, గుమ్మడి, పుచ్చ, పొద్దుతిరుగుడు విత్తనాలు, అవిశ గింజలలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ లభిస్తాయి.

విటమిన్‌ ఎ

4 Corona Foodవిటమిన్ ఎ నోరు, జీర్ణాశయం, పేగులు, శ్వాసకోశ వ్యవస్థలోని చర్మాన్ని, కణజాలాన్ని రక్షిస్తుంది. ఇది చిలగడదుంప(స్వీట్‌ పొటాటో), క్యారట్‌, బొప్పాయి, గుడ్లు, పాలకూర, బచ్చలికూర వంటి ఆకుకూరలు, పాలు, పాల ఉత్పత్తులలో లభిస్తుంది.

విటమిన్‌ డి

5 Corona Foodవిటమిన్ డి శరీరానికి హానిచేసే అతి సూక్ష్మక్రిముల సంహారానికి, శరీరానికి మేలు చేసే సూక్ష్మక్రిముల వృద్ధికి దోహదపడుతుంది. ఇది చేపలు, గుడ్లు, మాంసంలో కాలేయం, పాలు, పాల ఉత్పత్తులలో లభిస్తుంది. అలాగే ఉదయం వేళల్లో శరీరానికి సూర్యరశ్మి తగిలేలా ఉండడం ద్వారా పొందవచ్చు.

విటమిన్‌ ఇ

6 Corona Foodవిటమిన్ ఇ యాంటీ ఆక్సిడెంటుగా పనిచేస్తుంది. ముఖ్యంగా వృద్ధుల్లో రోగ నిరోధకతను పెంపొందించడంలో దోహదం చేస్తుంది. ఇది పొద్దు తిరుగుడు, కుసుంభ, అవిసె గింజలలో మరియు బాదం, పిస్తాలలో సమృద్దిగా లభిస్తాయి.

విటమిన్‌ బి6

7 Corona Foodవిటమిన్‌ బి6 జీర్ణకోశ రోగ నిరోధకతను క్రమబద్ధీకరిస్తుంది. శరీరంలో విషపూరిత చర్యల్ని తగ్గిస్తుంది. ఇది సోయాబీన్‌, పప్పులు, జొన్నలు, సజ్జలు, మొక్కజొన్నలు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, అరటి, మునగ, మెంతి ఆకులు, కరివేపాకు, ఉప్పుడు రవ్వలలో లభిస్తుంది.

విటమిన్‌ బి12

8 Corona Foodశరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించేందుకు విటమిన్ బి12 దోహదపడుతుంది. చేపలు, మాంసం, చికెన్‌, గుడ్లు, పాలు, పాల ఉత్పత్తులలో లభిస్తుంది.

విటమిన్‌ సి

9 Corona Foodవిటమిన్ సి శరీరంలో యాంటీబాడీస్‌ను ప్రేరేపిస్తుంది. కణాల పనితీరును మెరుగుపరుస్తుంది. ఆకుపచ్చని కూరగాయలు, జామ, మామిడి, దానిమ్మ, ఉసిరి, ద్రాక్ష తదితర పుల్లని పండ్లు, బొప్పాయి, స్ట్రాబెర్రీ, క్యాప్సికమ్‌, నిమ్మ, నారింజ పండ్లలో లభిస్తుంది.

ఖనిజ లవణాలు (మినరల్స్‌)

10 Corona Foodజింకు, క్యాల్షియం, మెగ్నీషియం వంటివి వైరస్‌ ఇన్‌ఫెక్షన్లను తగ్గించడంలో ఉపయోగపడతాయి. ఇవి అన్ని రకాల గింజ ధాన్యాలు, పప్పు దినుసులు, సోయాబీన్‌, పుచ్చకాయ విత్తనాలు, గుమ్మడికాయ విత్తనాలు, చికెన్‌, గుడ్లు, వాల్‌నట్స్‌, పొద్దుతిరుగుడు విత్తనాలు, చేపలలో లభిస్తాయి.

ఆరోగ్యకరమైన జీవనశైలి, మంచి ఆహారం తీసుకోవడం ద్వారానే శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,580,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR