ఈ ఆహార పదార్థాలను తినడం వల్ల లివర్ సమస్యలకు చెక్ పెట్టవచ్చు

కాలేయం అనేది మన శరీరంలో ముఖ్య అవయవం. ఎందుకంటే అది రెగ్యులర్‌గా తనను తాను బాగుచేసేసుకుంటుంది. లివర్‌లో కొంత భాగం కట్ చేసినా తిరిగి అది దానంతట అదే తయారైపోతుంది. పైగా లివర్ ఒకేసారి దాదాపు 700 పనులు చెయ్యగలదు. అంత మంచి లివర్‌ను కాపాడుకునే విషయంలో మనలో చాలా మంది ఫెయిలవుతున్నాం.

Healthy Food for Liverమనం చేసే అశ్రద్ధ వల్ల కాలేయ సమస్యలు చుట్టు ముడతాయి. కొన్ని సార్లు ప్రమాదకర సమస్యలు కూడా వస్తాయి. ఒకసారి లివర్ పాడైందంటే… దానర్థం బాడీలో ఇంకా చాలా పార్టులు పాడైనట్లే. కొన్ని సమస్యలను ట్రీట్‌మెంట్‌తో సరిచేసుకోవచ్చు. కానీ కొన్ని ఆహార పదార్థాలను తినడం వల్ల అసలు లివర్ సమస్యలు రాకుండా చేసుకోవచ్చు.

Healthy Food for Liverబాడీలో విష వ్యర్థాల్ని లివర్ తరిమేస్తుంది. ప్రోటీన్లను పెంచుతుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. మనం సరైన ఆహారం తినకపోతే. లివర్ పాడవుతుంది. కాబట్టి కొవ్వు ఉండే ఆహారాన్ని మనం తగ్గించుకోవాలి. నూనెలు, డాల్టాలతో చేసినవి ఎక్కువ తినకూడదు. జనరల్‌గా కాలేయం పాడవడానికి మద్యం తాగడం ఓ కారణమైతే టాటూలు, విష వాయువులు పీల్చడం, రసాయనాలను పీల్చడం, డయాబెటిస్, అధికబరువు… ఇలా చాలా కారణాలు లివర్‌కి ప్రాణాపాయంగా మారతాయి.

పసుపు:

Healthy Food for Liverఇది ఎంత మంచిదో మనకు బాగా తెలుసు. పసుపు రక్తాన్ని శుద్ధి చేస్తుంది. బాడీలో విష వ్యర్థాల్ని తరిమేస్తుంది. లివర్‌కి సమస్యలు ఉంటే, పసుపు రెగ్యులర్‌గా వంటల్లో వాడాలి. ఆటోమేటిక్‌గా లివర్ క్లీన్ అవుతుంది.

త్రిఫల:

Healthy Food for Liverత్రిఫల చూర్ణం పేరు వినే ఉంటారు. దీన్ని 1.కొండ ఉసిరి 2.కరక్కాయ 3.తానికాయ పొడితో తయారుచేస్తారు. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రోజూ నిద్రపోయే ముందు ఈ పొడిని వాడితే సరి… లివర్ హాయిగా ఉంటుంది.

కుత్కీ:

Healthy Food for Liverఇదో రుచికరమైన మూలిక. దీనితో లివర్ టానిక్ తయారుచేస్తారు. ఇది లివర్‌ను శుభ్రం చేస్తుంది. గాల్ బ్లాడర్‌ను కూడా. ఆకలి పెంచుతుంది. జాండీస్ అంతు చూస్తుంది. బైల్ సమస్యకు చెక్ పెడుతుంది. చర్మాన్ని కాపాడుతుంది. మంచి లివర్ కోసం… కుత్కీ టాబ్లెట్లు వాడితే మంచిదే అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

అలోవెరా:

Healthy Food for Liverఅలోవెరా లేదా కలబంద వద్దన్నా పెరుగుతూనే ఉంటుంది. ఇది చాలా మంచిది. కలబంద గుజ్జును ఓ టేబుల్ స్పూన్ తీసుకొని,నీటిలో కలిపి జ్యూస్‌లా తాగేస్తే మన పని మనం చేసుకోవచ్చు. దాని పని అది చేస్తుంది. బాడీ లోపలికి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఒత్తిడి తగ్గిస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. లివర్‌ను కాపాడుతుంది.

గుడుచి:

Healthy Food for Liverఆయుర్వేదంలో గుడుచి అత్యంత ముఖ్యమైన ఆకు. ఇదీ రక్తాన్ని శుద్ధి చేస్తుంది. లివర్ కోసం ఆయుర్వేదంలో తయారుచేసే మందుల్లో గుడుచి తప్పక కలుపుతారు. ఇది జాండీస్, హెపటైటిస్ సంగతి చూస్తుంది. లివర్‌కి పట్టిన కొవ్వును వదిలిస్తుంది. ఐతే గుడుచిని ఎంత వాడాలో ఆయుర్వేద డాక్టర్ సలహా తీసుకొని మాత్రమే వాడాలని మనం మర్చిపోకూడదు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,460,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR