పీరియడ్స్ సమయంలో ఆడవాళ్ళు కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. నెలసరి సమయం కొంత మంది ఆడవారికి ఇబ్బంది పెట్టకుండా అయిపోతే ఇంకొంతమంది నరకాన్ని చవిచూస్తారు. ఒక వయసుకు వచ్చాక ఆడపిల్లలో మొదలయ్యే ఋతుచక్రం వారి మానసిక శారీరక స్థితులను తారుమారుచెయ్యగలవు. ఎందుకంటే హార్మోన్ల రిసైకిల్ జరిగేటప్పుడు శరీరంలో కలిగే మార్పే వాటికి కారణం.
ఆ సమయం లో నెప్పి వస్తే చాలా అసౌకర్యం గా ఉంటుంది. దీనికి తోడు శరీరం లో జరిగే హార్మోన్ల మార్పుల వల్ల ఆడవాళ్ళకి పిచ్చెత్తినట్లు ఉంటుంది. అయితే అలాంటి సమయంలో ఆ పరిస్థితికి తగ్గట్టు ఆహారం తీసుకోవడం అనేది ఎంతో ముఖ్యమైనది. రుతుస్రావసమయంలో భోజననాన్ని మానకుండా తీసుకోవటం చాలా ముఖ్యం. ఈ సమయంలో రక్తస్రావం అవుతూ ఉంటుంది, అందువల్ల ఆహారం ద్వారా మాత్రమే శక్తిని పొందగలుగుతారు. నెలసరి సమయంలో వచ్చే చిరాకు, అసహనం, కోపం వంటి మానసిక సమస్యలు, కడుపునొప్పి, కండరాల తిమ్మిరి, ఒళ్ళు నొప్పులు వంటి శారీరక సమస్యలు మొదలైన వాటికి తీసుకునే ఆహారం కూడా కారణం అవుతుంది.
అందుకే నెలసరిలో ఉన్నపుడు ఎలాంటి ఆహరం తీసుకోవాలి, ఏవేవి తినకూడదో తెలుసుకోవాలి. నెలసరి సమయాల్లో సేంద్రీయ ఉత్పత్తులు తీసుకోవడంలో జాగ్రత్తగా ఎంతో అవసరం. లేకపోతే పాలు, పాల ఉత్పత్తులు హార్మోన్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది. పాల ఉత్పత్తులు హార్మోన్ల ద్వారా ఎదురయ్యే సమస్యలను మరింత ఉదృతం చేసే అవకాశాలు ఉన్నాయి.
సేంద్రీయ ఉత్పత్తి కాని వాటిలో రసాయనాలు ఎక్కువ వాడి ఉంటారు కాబట్టి అవి స్త్రీ పునరుత్పత్తి వ్యవస్థపై ఎక్కువగా ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయి. పాలు, పాల ఉత్పత్తుల నుండి లభించే పోషకాలను భర్తీ చేయడానికి ఆకుకూరలైన బచ్చలికూర, క్యాబేజీ లేదా బ్రోకలీ, బీన్స్, బఠానీలు, కాయధాన్యాలు, కాయలు తీసుకోవచ్చు. వీటిలో చాలా వరకు మెగ్నీషియం వంటి అదనపు పోషకాలు కూడా పుష్కలంగా లభిస్తాయి.
అలాగే పీరియడ్స్ సమయంలో హార్మోన్ల అసమతుల్యత మానసిక స్థితిని ప్రభావితం చేస్తూ ఉంటుంది. అయితే చాలామందికి కాఫీ అనేది వ్యసనం అవుతుంది. అది నెలసరి సమయంలో హార్మోన్లను ప్రభావితం చేసి హార్మోన్ రిసైకిల్ ను డిస్టర్బ్ చేస్తుంది. తద్వారా మానసిక ఇబ్బందులు ఎక్కువగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి కెఫిన్ తో కూడిన డ్రింక్స్ మరియు ఆహారపదార్థాలు నెలసరి సమయంలో మానేయడమే మంచిది.
హార్మోన్ల రిసైకిల్ సమయంలో చక్కర కారకాలైన బియ్యం, గోధుమ పిండి, మైదా వంటి శుద్ధి చేసిన పిండి పదార్థాలు, అలాగే కేక్ మరియు బిస్కెట్లు వంటి బేక్ చేసిన పదార్థాలు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగడానికి కారణం అవుతుంది. ఇది మొదట పెరిగినట్టు అనిపించినా తరువాత ఒక్కసారిగా శరీరంలో చెక్కర స్థాయిలు తగ్గిపోవడం జరుగుతుంది.
కాబట్టి చెక్కెరల రూపం ఏదైనా నెలసరి సమయంలో వాటికి వీలైనంతవరకు దూరంగా ఉండటం మంచిది. వీటితో పాటు మాంసం, వేయించిన ఆహారాలకు కూడా దూరంగా ఉండాలి. అందులో ఒమేగా -6 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఈ కొవ్వు ఆమ్లాలు, అరాకిడోనిక్ ఆమ్లంతో సహా, ప్రోస్టాగ్లాండిన్స్ అని పిలువబడే రసాయనాల ఉత్పత్తి పెరుగుదలకు దోహదం చేస్తాయి. ఇది నెలసరి ప్రారంభంలో తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి.