విటమిన్ కె ఎక్కువగా దొరికే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా ?

మ‌నం నిత్యం తీసుకునే ఆహారంలో విటమిన్ లోపం ఉంటే శ‌రీరంలో ప‌లు ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. అవేమిటంటే… విట‌మిన్ కె లోపిస్తే మ‌న చ‌ర్మం ఊరికే కందిపోయిన‌ట్లు, న‌ల్ల‌గా మారుతుంది. అలాగే చిగుళ్ల నుంచి ర‌క్తం కార‌డం, చిన్న గాయం అయినా బాగా ర‌క్త‌స్రావం అవడం, ర‌క్తం బాగా పోవ‌డం, స్త్రీల‌కు రుతు స‌మ‌యంలో తీవ్ర ర‌క్త స్రావం అవ‌డం, మూత్రం లేదా మ‌లంలో ర‌క్తం ప‌డ‌డం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి.

Vitamin Kఈ ల‌క్ష‌ణాలు ఎవ‌రిలోనైనా ఉంటే వెంట‌నే డాక్ట‌ర్‌ను సంప్ర‌దించి చికిత్స తీసుకోవాలి. వైద్య ప‌రీక్ష‌లు చేయించుకుని ఒక వేళ విట‌మిన్ కె లోప‌మ‌ని తేలితే అందుకు త‌గిన విధంగా డాక్ట‌ర్ సూచ‌న మేర‌కు మందులు వాడుకోవాలి. అలాగే కొన్ని ఆహారాల‌ను నిత్యం తీసుకోవ‌డం ద్వారా విట‌మిన్ కె లోపం రాకుండా చూసుకోవ‌చ్చు. విటమిన్ కె మనకు ఎక్కువగా దొరికే ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Vitamin Kవిట‌మిన్ కె మ‌న‌కు ఎక్కువగా పాల‌కూర‌, వాల్‌న‌ట్స్‌, బ్రొకొలి, అవ‌కాడోలు, బాదంప‌ప్పు, బ్రెజిల్ న‌ట్స్‌, ఎర్ర ప‌ప్పు, యాప్రికాట్స్.. త‌దిత‌ర ఆహార ప‌దార్థాల్లో ల‌భిస్తుంది. అలాగే మరికొన్ని పండ్లలో, ఆకు కూరల్లో కూడా విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. అవి ఇప్పుడు చూద్దాం.

కివి పండు

Vitamin Kకివి పండులో రోగనిరోధకశక్తిని పెంపొందించే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. దీంతోపాటు.. పొటాషియం, ఫోలేట్, విటమిన్-కె కూడా సమృద్ధిగా ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. అందుకే ప్రతిరోజు కివి పండ్లు తినాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఆకుకూరలు

Vitamin Kపాలకూర, తోటకూర, గోంగూర, బచ్చలి వంటి ఆకుపచ్చని రంగులో ఉండే ఆకుకూరల్లో విటమిన్ కె పుష్కలంగా లభిస్తుంది. వీటిల్లో విటమిన్ కె తో పాటూ విటమిన్ ఎ ,విటమిన్ సి లు కూడా ఉన్నాయి. కనుక వీటిని రోజూ తింటే బోలెడంత ఆరోగ్యం. ఒక కప్పు ఉడికించిన ఆకుకూరలలో 800గ్రాముల విటిమన్ కె ఉంటుంది.

బచ్చలి కూర

Vitamin Kఆకు కూర ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. బచ్చలి కూరలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. అదేవిధంగా విటమిన్ కే కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎముకల ఆరోగ్యం కోసం హృదయ సంబంధిత సమస్యలు దూరం చేసుకోవడానికి బచ్చలికూడా ఎక్కువగా తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

అవకాడో

Vitamin Kఅవకాడో లో కూడా విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. బరువు తగ్గడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుందని.. ప్రతిరోజూ తీసుకోవాలని సూచిస్తున్నారు.

పచ్చిబఠానీలు

Vitamin Kగ్రీన్ పీస్ తినే మార్గాలు బోలెడు. వీటినీ కూరల్లో వేసుకోవచ్చు లేదా వాటితో అనేక రకాలుగా స్నాక్స్ తయారుచేసుకోవచ్చు. పిల్లలకి కూడా ఇష్టమైన స్నాక్స్ ని వీటితో చేయచ్చు. వారానికి రెండు మూడు సార్లయినా పచ్చి బఠానీలను ఆహారంలో తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇందులో ఉండే విటమిన్ ఎ, సి, కెలు ఆరోగ్యాన్ని సమతూకంలో ఉంచుతాయి. బఠానీల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది.

దానిమ్మ

Vitamin Kదానిమ్మ పండులో అనేక పోషకాలు ఉంటాయి. ఈ పండు తినడం వల్ల రక్తం శాతం మెరుగుపడుతుంది. అదే విధంగా విటమిన్ కె కూడా దీనిలో సమృద్ధిగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. దీనివల్ల హృదయ సంబంధిత సమస్యలు తగ్గి ఎముకలకు బలం చేకూరుతుందని పేర్కొంటున్నారు.

క్యాబేజ్

Vitamin Kక్యాబేజ్ ను కూరగానే కాదు చైనీస్ ఫుడ్ లపై చల్లుకుని కూడా తింటారు. అలాగే పకోడీలుగా కూడా వేసుకోవచ్చు. ఏ రకంగా తిన్నా వీటిల్లో విటమిన్ కె, విటమిన్ సి , విటమిన్ బి6 శరీరానికి అందుతాయి. ఇది కొలెస్ట్రాల్ తగ్గించడానికి సహకరిస్తుంది.

మస్టర్డ్ గ్రీన్

Vitamin Kమస్టర్డ్ గ్రీన్ ఒక అద్భుతమైన న్యూట్రీషియన్ లీఫీ గ్రీన్ వెజిటేబుల్ . ఇది విటమిన్ కె, ఎ మరియు కెరోటిన్స్ అధికంగా ఉన్నాయి. మస్టర్డ్ గ్రీన్ బోన్ యొక్క ఓస్టిరియోఫోసిస్ ను ప్రోత్సహిస్తుంది.

తులసి

Vitamin Kతులసి ఆకుల్లో కూడా విటమిన్ కె అధికంగా ఉంటుంది.1/4కప్పు తులసి ఆకులో మ్యాంగనీస్, పొటాషియం, కాపర్ పుష్కలంగా ఉంటుంది.

పార్ల్సే

Vitamin Kపార్ల్సే ఆరోమాటిక్ వాసన కలిగి ఉంటుంది . ఇందులో విటమిన్ ఎ, సి మరియు కె లు పుష్కలంగా ఉన్నాయి. ఇది ఆర్థరైటిస్ కు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఇది గుండె ఆరోగ్యంగా పనిచేయడానికి సహాయపడుతుంది.

కాలే

Vitamin Kకాలే ఒక హెల్తీ ఫుడ్. ఇందులో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది . ఇది కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది, జీర్ణక్రియను శుభ్రపరుస్తుంది మరియు క్యాన్సర్ ను నివారిస్తుంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,670,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR