పైల్స్ ఎక్కువయ్యేలా చేసే ఆహారాలు… వీటికి దూరంగా  ఉండండి!

ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది పైల్స్ వ్యాధితో బాధపడుతున్నారు. మల విసర్జన సమయంలో నొప్పి, మంట, రక్తం కారడం, పిలకలు బయటికి రావడం వంటివి పైల్స్ ఉనికిని తెల్పుతాయి. మల విసర్జన సాఫీగా లేకపోవడం వల్ల ఈ సమస్యకు దారితీస్తుంది. కొందరిలో మలద్వారం దగ్గర ఉండే సిరలు బలహీనంగా ఉండటం వల్ల కూడా మొలలు సమస్య ఉత్పన్నమవుతుంది. అధికబరువు  కూడా కారణమవుతుంది.
  • ఇవే కాకుండా ఆహారపు అలవాట్లు, పీచు పదార్థాలు తక్కువగా ఉన్న ఆహారంను తీసుకోవడం వల్ల పైల్స్ వచ్చే అవకాశాలుంటాయి. పైల్స్ ఉన్నప్పుడు మల విసర్జన ఇబ్బందిగా మారుతుంది. రక్తం పడుతూ ఉంటుంది. దురద ఉంటుంది. ఆడవారిలో గర్భిణీ సమయంలో పైల్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి
  • పైల్స్ అనేవి నాలుగు గ్రేడ్స్ గా పరిగణిస్తారు. మొదటి రెండు రకాలు ఆపరేషన్ లేకుండానే తగ్గుతాయి. మూడు మరియు నాలుగవ గ్రేడెలలో కచ్చితంగా ఆపరేషన్ చెయ్యాలి. మొదటి రెండు రకాలను ఆహార నియమాలు , వ్యాయామం మరియు జీవన శైలిలో మార్పులతో తగ్గించవచ్చు. పైల్స్ వున్నవారు ప్రత్యేకించి ఈ కొన్ని పదార్థాలను దూరంగా పెట్టడం మంచిది.
  • అశ్రద్ధ చేసి వాటిని తింటే పరిస్థితి వేరే చెప్పక్కర్లేదు. కూర్చోలేరు, నిలబడలేరు, ఆ పరిస్థితి తలెత్తుతుంది.
1. డీప్ ఫ్రైడ్, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు
2. కారంగా ఉండే ఆహారం
3. ఆల్కహాల్
4. పాల ఉత్పత్తులు
5. పండకుండా వున్నటువంటి పండ్లు
6. శుద్ధి చేసిన ధాన్యాలు
7. అధిక ఉప్పు పదార్థాలు
8. ఐరన్ సప్లిమెంట్స్, కొన్ని ఇతర మందులు
9. అధిక ఫైబర్
  • పైల్స్ ఉన్నవారు ఈ పదార్థాలను పూర్తిగా పక్కన పెట్టేయాలి. ఇడ్లీ మరియు దోస వంటి పులియబెట్టిన ఆహార పదార్థాలు వాత దోషాన్ని మరింత తీవ్రతరం చేస్తాయి. కాబట్టి, వాటి వాడకాన్ని నివారించడం లేదా పరిమితం చేయడం మంచిది.
  • బార్లీ, క్వినోవా, బ్రౌన్ రైస్, వోట్స్, చిక్కుళ్ళు వంటి అధిక ఫైబర్ ఉన్న వాటిని మీ ఆహారంలో తీసుకోండి. బ్రోకలీ, కాలీఫ్లవర్, కాలే, క్యాబేజీ, గుమ్మడికాయ, గుమ్మడికాయ, బెల్ పెప్పర్స్, దోసకాయ వంటి పండ్లు, కూరగాయలు తినండి. పుచ్చకాయ, పియర్, ఆపిల్, అరటి, ప్రూనే వంటి పండ్లు మిమ్మల్ని ఎల్లప్పుడూ హైడ్రేట్ గా ఉంచడటానికి సహాయపడుతాయి. హైడ్రేట్‌గా ఉంచుకునేందుకు పుష్కలంగా నీరు త్రాగాలి.
  • పైల్స్ తగ్గించుకోవడం ఎలా?.. ముల్లంగి రసాన్ని రోజుకు రెండుసార్లు తాగితే పైల్స్‌కు సాధారణ నివారణ అని చెపుతారు. 1/4 వ కప్పుతో ప్రారంభించి, క్రమంగా రోజుకు రెండుసార్లు సగం కప్పుకు పెంచుతూ తాగితే ఉపశమనం కలుగుతుంది.
  • కొబ్బరి నూనె, పసుపు కలపాలి. పసుపులో శోథ నిరోధక లక్షణాలు ఉన్నాయి. కొబ్బరినూనె, పసుపు మిశ్రమాన్ని శక్తివంతమైన కలయికగా మారుస్తుంది. ఈ మిశ్రమాన్ని కాటన్‌తో తీసుకుని పైల్స్ వున్న ప్రాంతంలో సుతిమెత్తగా అద్దాలి. అలా చేస్తే ఉపశమనం కలుగుతుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR