అసురక్షితమైన ఆహరం తినడం కానీ, ఏదైనా పడని ఫుడ్ కానీ తినడం వలన ఫుడ్ పాయిజనింగ్ జరగవచ్చు. ఫుడ్ పాయిజనింగ్ వల్ల వామిటింగ్, కడుపులో నొప్పి వంటి సమస్యలు వస్తాయి. తరచూ ఫుడ్ పాయిజనింగ్ వల్ల ఇబ్బంది పడేవారు కొన్ని ఆహార పదార్ధాలను రెగ్యులర్ డైట్‌లో భాగం చేసుకుని పొట్టను సురక్షితంగా ఉంచుకోవచ్చు. ఈ పదార్థాల వల్ల పొట్ట నుంచి విషతుల్యాలు బయటికి వచ్చేస్తాయి.
తులసి వల్ల ఎన్ని ప్రయోజనాలో మనందరికి తెలిసిందే. సర్వరోగ నివారిణి అయిన తులసిని తరచూ తీసుకోవడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ సమస్యలు కూడా తగ్గుతాయి.
కొబ్బరి నీళ్లలో కేల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరెట్, సోడియం వంటి మినరల్స్ ఉంటాయి. ఇవి శరీరం హైడ్రేడ్ గా ఉండేలా చేస్తుంది. పొట్ట తేలికగా ఉంటుంది.
మెంతులు తరచూ తీసుకోవడం వల్ల ఛాతిలో మంట, కడుపులో నొప్పి, ఆకలి తగ్గడం, వంటి సమస్యలు తొలుగుతాయి. ఫుడ్ పాయిజనింగ్ సమయంలో ఈ సమస్యలు తరచూ కలుగుతుంటాయి.
పెరుగులో యాంటీబయోటిక్ తత్వాలు ఉంటాయి. ఫుడ్ పాయిజనింగ్ ఉన్న సమయంలో ఇది ప్రయోజనాలు కలిగిస్తుంది. పెరుగులో కొద్దిగా ఉప్పు, చెక్కర వేసి రెగ్యులర్‌గా తీసుకోవాలి.
వెల్లుల్లిని భారతీయుల వంటకాల్లో విరివిగా వినియోగాస్తారు. అయితే చాలా మందికి దాని ప్రయోజనం గురించి తెలియదు.
వెల్లుల్లి వల్ల కడుపునొప్పి, విరోచనాలు తగ్గుతాయి. ఫుడ్ పాయిజనింగ్ సమస్యలు కూడా తొలగుతాయి.