జుట్టు రాలే సమస్యను తగ్గించే ఆహారపదార్ధాలు ఏంటో తెలుసా ?

పెరుగుతున్న కాలుష్యంతో జుట్టు రాల‌డం అనే స‌మ‌స్య చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. ఆడ‌, మ‌గ అన్న తేడా లేకుండా చాలా మంది ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. అయితే ఎవరికైనా జుట్టు రాలిపోయేందుకు ప‌లు కార‌ణాలు ఉంటాయి. కార‌ణాలు ఏవైనా కొన్ని ఆహార ప‌దార్థాల‌ను రోజూ తీసుకోవడం వలన మన శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు అందుతాయి. అలాగే వెంట్రుక‌ల స‌మ‌స్య‌లు తగ్గిపోతాయి. జుట్టు రాల‌డం త‌గ్గుతుంది.

Hair Fall1. పాల‌కూర‌లో ఫోలేట్‌, ఐర‌న్‌, విట‌మిన్ ఎ, సిలు ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుద‌ల‌కు స‌హాయం చేస్తాయి. క‌నుక పాల‌కూర‌ను త‌ర‌చూ ఆహారంలో భాగం చేసుకుంటే జుట్టు రాల‌డం స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

పాల‌కూర‌2. కోడిగుడ్ల‌లో ప్రోటీన్లు పుష్క‌లంగా ఉంటాయి. అలాగే మ‌రొక పోష‌క ప‌దార్థ‌మైన బ‌యోటిన్ కూడా గుడ్ల‌లో స‌మృద్ధిగా ఉంటుంది. ఇవి జుట్టు పెరుగుద‌ల‌కు తోడ్ప‌డుతాయి. అందువ‌ల్ల నిత్యం కోడిగుడ్ల‌ను ఆహారంలో భాగం చేసుకుంటే జుట్టు రాల‌డం స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

కోడిగుడ్ల‌3. చేప‌ల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి వెంట్రుక‌ల స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌టప‌డేస్తాయి. జుట్టు పెరుగుద‌ల‌కు తోడ్ప‌డుతాయి. అందువ‌ల్ల వారంలో క‌నీసం 3 సార్ల‌యినా చేప‌ల‌ను తింటే వెంట్రుక‌ల స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

Fish4. అవిసె గింజ‌లు, పొద్దు తిరుగుడ విత్త‌నాల‌ను నిత్యం తింటున్న జుట్టు రాల‌డం స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. వీటిల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విట‌మిన్ ఇ, జింక్‌, సెలీనియం వెంట్రుక‌ల సంర‌క్ష‌ణ‌కు తోడ్ప‌డుతాయి. జుట్టు రాల‌డాన్ని త‌గ్గిస్తాయి.

అవిసె గింజ‌లు5. బాదం ప‌ప్పులో ఉండే బి విట‌మిన్లు, విట‌మిన్ ఎ, జింక్ వెంట్రుక‌ల పెరుగుద‌ల‌కు తోడ్ప‌డుతాయి. వీటిని నిత్యం తింటే జుట్టు రాల‌డం స‌మ‌స్య నుంచి త‌ప్పించుకోవ‌చ్చు.

బాదం ప‌ప్పు

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR