ప్రెగ్నన్సీ టైంలో తినకూడని ఆహార పదార్ధాలు

0
278

గర్భం అనేది స్త్రీకి ప్రకృతి ఇచ్చిన వరం. తల్లి కావడం అంటే జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవడం లాంటిది. కడుపులో 9 నెలలు శిశువును మోసి తనతో సమానమైన మరో జీవితాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తుంది స్త్రీ. అందుకే గర్భం ధరించిన స్త్రీలు ఆహార విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ సమయంలో ఏది తినాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించి తింటారు. ఎందుకంటే గర్భవతులు తీసుకునే ఆహారం లోపల శిశువు పెరుగుదల మీద ప్రభావం చూపిస్తుంది అనే భయం వారిలో కలుగుతుంది. అందువల్ల గర్భిణీ స్త్రీలు మంచి పౌష్టికాహార తీసుకుంటారు. గర్భం పొందిన మహిళలు ఖచ్చితమైన ఆహార ప్రణాళికకు కట్టుబడి ఉండాలి మరియు గర్భధారణ కాలంలో తీసుకోకూడని నిర్దిష్ట ఆహార పదార్థాలను బాగా అర్థం చేసుకోవాలి.

Health Benfits Of gummadikayaసాధారణంగా గర్భధారణ సమయంలో మహిళలు కొన్ని ఆహారాలు తీసుకోడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ముఖ్యంగా పుల్లని, తీపి మరియు ఉప్పగా ఉండే ఆహారాన్ని ఇష్టపడతారు. కూరగాయలు మరియు పండ్లలో పుల్లగా ఉండే మామిడి తినడానికి కూడా ఇష్టపడతారు. అలాగే గర్భిణీ స్త్రీలు బొప్పాయి తినకూడదు అని చెబుతుంటారు. మరి స్త్రీలు గర్భధారణ సమయంలో గుమ్మడికాయ తినాలా వద్దా అనే అనుమానం చాలా మందిలో కలుగుతుంది.

Health Benfits Of gummadikayaనిజానికి గుమ్మడికాయ అధిక పోషకాలు కలిగిన కూరగాయ. గుమ్మడి కాయ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. గర్భధారణ సమయంలో గుమ్మడికాయ మరియు దాని విత్తనాలను తినడం వల్ల కడుపు తిమ్మిరిని తగ్గించడానికి సహాయపడుతుంది. గుమ్మడికాయ పోషకాలకు మంచి మూలం. ఇందులో ప్రోటీన్, కొవ్వు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, ఇనుము, కాల్షియం, నియాసిన్ మరియు భాస్వరం ఉన్నాయి. ఇవి శిశువు మరియు తల్లికి అవసరమైన అన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

Health Benfits Of gummadikayaగర్భం దాల్చిన స్త్రీలలో ముఖ్యంగా కనిపించే సమస్య జీర్ణక్రియ రేటు తగ్గిపోవడం, మలబద్ధకం, ఎసిడిటీ, అధిక రక్తపోటు ఇవి సాధారణంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ సమస్యలు అన్నింటిని కూడా మనం ఈ గుమ్మడికాయ గింజలతో చెక్ పెట్టొచ్చు. గుమ్మడి గింజలలో అధిక శాతం ఫైబర్, జింక్ మెగ్నీషియం, ఐరన్, విటమిన్ ఏ, బి, క్యాల్షియం, ఫ్యాటి ఆసిడ్లు మెండుగా ఉంటాయి. ఇందులో ఉన్న కాల్షియం, ఫ్యాటీ యాసిడ్లు ఎముకలను బలంగా చేకూరుస్తాయి అలాగే శిశువు పెరుగుదలకు ఉపయోగపడతాయి.

Health Benfits Of gummadikayaఅంతేకాకుండా మహిళలు గుమ్మడి కాయ తినడం వల్ల రొమ్ము క్యాన్సర్ నుంచి కాపాడుతుంది. గర్భధారణ సమయంలో అధిక రక్తపోటు, చక్కెర స్థాయిలను తగ్గించడానికి గుమ్మడికాయ ఎంతో సహాయపడుతుంది. ఇక ఇందులో ఉన్న జింక్ జుట్టు రాలకుండా జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది. అయితే గుమ్మడికాయను స్వీట్లలో కాకుండా ప్రత్యేకంగా ఉడికించి తినడం మంచిదని అంటున్నారు నిపుణులు.

Health Benfits Of gummadikayaగుమ్మడికాయ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి, కాబట్టి పెద్ద మొత్తంలో తీసుకోవడం వల్ల దుష్ప్రభావాలు వస్తాయి. పెద్ద మొత్తంలో గుమ్మడికాయను తిన్నప్పుడు తలనొప్పి, కడుపు నొప్పి, విరేచనాలు వంటి సమస్యలను కలిగించే అవకాశాలు ఉన్నాయి. గుమ్మడికాయలోని విత్తనాలు అధిక స్థాయిలో హార్మోన్లను విడుదల చేస్తాయి, ఇది గర్భిణీ స్త్రీలలో అలెర్జీని కలిగిస్తుంది. కాబట్టి అధిక మొత్తంలో కాకుండా గుమ్మడికాయను మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచింది.

SHARE