రాత్రివేళ ఇవి తింటే ఆరోగ్యం కన్నా అనర్థమే ఎక్కువ

రాత్రికి తగినంత నిద్ర లేకపోవడం అనేది తీవ్రమైన రుగ్మత. పిల్లల నుండి వృద్ధుల వరకు దాదాపు ప్రతి ఒక్కరిలో ఈ సమస్య కనిపిస్తుంది. ప్రపంచ జనాభాలో 45 శాతం మంది నిద్ర రుగ్మతలతో బాధపడుతున్నారు. వేళకు ఇంత తిని పడుకుంటే చక్కగా నిద్ర పడుతుంది అని పెద్దలు చెబుతుంటారు. కానీ కొంతమందికి రాత్రిపూట సరిగ్గా తిన్న కానీ ఎంత గింజుకుంటున్న నిద్ర పట్టదు. దీంతో రాత్రి అంతా జాగారమే.

రాత్రి నిద్రను పాడుచేసే ఆహార పదార్థాలుఅయితే మనకు సరిగ్గా నిద్రపట్టకుండా ఉండటానికి కూడా మనం తీసుకునే ఆహారం కూడా ఒక కారణమవుతుందని అంటున్నారు నిపుణులు. అదేమిటి తింటే నిద్రపట్టాలి కదా నిద్ర పట్టకపోవడం ఏమిటి అని ఆలోచిస్తున్నారా ? ఆహరం తీసుకున్న కానీ నిద్ర ఎందుకు పట్టదంటే జీర్ణక్రియ సక్రమంగా జరగకపోతే ఈ సమస్య ఎదురవుతుంది. సాధారణంగా జీర్ణక్రియ జరుగుతున్నప్పుడు మాత్రమే మనకు నిద్రపడుతుంది.

రాత్రి నిద్రను పాడుచేసే ఆహార పదార్థాలుకొన్ని ఆహార పదార్థాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని విని తింటుంటాం. కానీ అది ఏ సమయంలో, ఏ కాలంలో తినడం వల్ల లాభం, ఎప్పుడు తింటే నష్టం జరుగుతుందని సైతం తెలుసుకోవాల్సి ఉంటుంది. అసలే కరోనా టైమ్ నడుస్తుంది. కనుక అరటి పండ్లు, యాపిల్స్, కీరదోస లాంటి పండ్లు, పదార్థాలు, మంసాహారం తమకు వీలు చిక్కిన సమయంలో ఆరగిస్తున్నారు. అయితే కొన్ని పదార్థాలు, పండ్లు రాత్రివేళ తింటే ఆరోగ్యం కన్నా అనర్థమే జరుగుతుందట. అవేమిటో తెలుసుకుందామా మరి.

రాత్రి నిద్రను పాడుచేసే ఆహార పదార్థాలుఈ రోజుల్లో పిజ్జా అంటే ఇష్టపడని వారుండరు అంటే అతిశయోక్తి కాదేమో. అయితే పిజ్జా అనేది పగటిపూట తింటే జీర్ణం అవుతుంది కానీ రాత్రి పూట అసలు తీసుకోకూడదు అంటారు. ఒకవేళ రాత్రి పూట తీస్కుంటే నిద్రించే సమయంలో శరీరంలోని భాగాలన్నీ నిదానంగా పనిచేయడంతో జీర్ణక్రియకు ఆటంకం కలుగుతుంది. దీంతో అసిడిటీ సమస్య వచ్చి నిద్ర పట్టదు. పీచు పదార్ధం ఉండే ఆహారాలను ఉదయం ,మధ్యాహ్నం మాత్రమే తినాలి కానీ రాత్రి పూట తింటే అవి జీర్ణమవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది.నిద్ర పట్టదు.

రాత్రి నిద్రను పాడుచేసే ఆహార పదార్థాలుబ్రోకలీ, కాలీఫ్లవర్ మరియు క్యాబేజీ వంటి క్రూసిఫరస్ కూరగాయలు సాధారణంగా ఆరోగ్యానికి చాలా మంచివి కాని మీరు పడుకునే ముందు వాటిని తినడం మంచిది కాదు.  ఈ కూరగాయలు మీ నిద్రకు ఆటంకం కలిగిస్తాయి. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఈ రకం ఫైబర్ నీటిలో సులభంగా కరగదు. దాంతో వీటిని తిన్నవారు అంత సులువగా ఆహారాన్ని జీర్ణం చేసుకోలేరు. శరీరం వాటిని జీర్ణించుకోవడానికి సమయం పడుతుంది. ఇది జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. కడుపు ఉబ్బరం, కడుపులో వికారం లాంటి లక్షణాలతో నిద్ర మధ్యలోనే మెళకువ వస్తుంది. నిద్రలేమి సమస్యకు దారితీస్తుంది. అందువల్ల, వాటిని పగటిపూట తినండి.

రాత్రి నిద్రను పాడుచేసే ఆహార పదార్థాలుఅధికంగా నీటి శాతాన్ని కలిగి ఉండే ఆహార పదార్ధాలు, కూరగాయలు రాత్రివేళ తీసుకోకూడదు. లేదంటే సాయంత్రం తరువాత వీలైనంత త్వరగా రాత్రి భోజనం తింటే ఏ సమస్యా ఉండదు. అయితే నీటి శాతం అధికంగా ఉండే కీరదోస, పుచ్చకాయ లాంటివి తింటే మూత్రవిసర్జనకు పదే పదే బాత్రూమ్‌కు వెళ్లాల్సి వస్తుంది. దీని వల్ల మీకు నిద్ర సమస్య వస్తుంది. మరుసటి పనులు చురుకుగా చేసుకోలేరు.

రాత్రి నిద్రను పాడుచేసే ఆహార పదార్థాలుచక్కర ఎక్కువగా ఉండే క్యాండీస్ లో షుగర్ ఎక్కువగా ఉంటుంది.ఇది బరువును పెంచడంలో దోహదపడుతుంది. దీన్ని తినడం వలన రాత్రిపూట అలసట వస్తుంది. త్వరగా జీర్ణమవ్వదు.దీంతో నిద్రకు భంగం కలుగుతుంది.

రాత్రి నిద్రను పాడుచేసే ఆహార పదార్థాలుఇక మద్యం ,టీ ,కూల్ డ్రింక్స్ పడుకునే ముందు తీసుకోకపోవడమే మంచిది. ఇవి అనారోగ్యానికి గురిచేస్తాయి. నిద్రకు ఆటంకం కలిగిస్తాయి. గ్లాసు వైన్ తీసుకున్న తరువాత మగత వస్తుంది, నిద్ర బాగా పట్టిందని అందరు అనుకుంటారు. కానీ పడుకునే ముందు మద్యం తాగడం వల్ల నిద్ర నాణ్యత దెబ్బతింటుంది. ఒక గ్లాసు వైన్ తర్వాత వేగంగా నిద్రపోవచ్చు, కాని  రేపు నిద్ర లేచేటప్పుడు చాలా అలసటగా ఉంటుంది.

రాత్రి నిద్రను పాడుచేసే ఆహార పదార్థాలుమసాలా ఫుడ్స్ ,బర్గర్లు రాత్రిపూట తినకూడదు .రాత్రిపూట కొవ్వును ఎక్కువగా చేసి గుండె జబ్బులు రావడానికి కారణమవుతాయి కాబట్టి ఇవి కూడా రాత్రి పూట తినకూడదు. రాత్రివేళ, మరీ ముఖ్యంగా నిద్రించడానికి ముందు కారం, మసాలా ఎక్కువగా ఉండే పదార్థాలు తినకూడదు. దానివల్ల గుండెలో మంట, ఇతరత్రా అనారోగ్య సమస్యలు వస్తాయి. శరీరంలో వేడి అధికమైన మీకు ఇతర అవయవాలపై ప్రభావం చూపుతుంది. నిద్రకు సైతం భంగం వాటిల్లే అవకాశాలున్నాయని పలు అధ్యయనాలలో తేలింది.

రాత్రి నిద్రను పాడుచేసే ఆహార పదార్థాలుధూమపానం హానికరం అని మనందరికీ తెలుసు. నికోటిన్ శరీరాన్ని అలసట నుంచి దూరంగా ఉంచుతుంది. అయితే ఇది నిద్రకు అంతరాయం కలిగిస్తుంది. అంతేగాక ధూమపానం గుండెపోటు మరియు కార్డియో వంటి తీవ్రమైన వ్యాధులకు కారణం.

రాత్రి నిద్రను పాడుచేసే ఆహార పదార్థాలుచిన్నారులు, యువత చాక్లెట్లు ఎక్కువగా తింటారు. చర్మ సంరక్షణలో చాక్లెట్లు ప్రభావం చూపుతాయని వీటిని తినే అమ్మాయిలు కూడా ఉంటారు. అయితే రాత్రివేళ, అది కూడా నిద్రించే ముందు డార్క్ చాక్లెట్ గుండె సంబంధిత సమస్యలకు దారి తీస్తుంది. ఇందులో కెఫైన్, అమైనో ఆమ్లాలు మిమ్మల్ని మరింత యాక్టివ్ చేస్తాయి. కనుక డార్క్ చాక్లెట్ తినే వారికి రాత్రివేళ నిద్రాభంగం జరుగుతుంది. పదే పదే మెలకువ రావడంతో నిద్రలేమి సమస్య వస్తుంది. అలాగే కెఫిన్ ఎక్కువగా ఉండే పానీయాలు పడుకునే ముందు తినకూడదని మనందరికీ తెలుసు. ఎందుకంటే అవి నిద్రలేమికి దారితీస్తాయి.

రాత్రి నిద్రను పాడుచేసే ఆహార పదార్థాలుపడుకునే ముందు ఐస్ క్రీం తినడం చాలా మందికి ఇష్టం. కాని అది తరువాత నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. ఫాటీ చీజ్ మాదిరిగా, ఐస్ క్రీం కూడా జీర్ణం కావడానికి సమయం పడుతుంది. శరీరం ఆహారాన్ని జీర్ణం చేస్తున్నప్పుడు విశ్రాంతి తీసుకోదు దానివల్ల మీ నిద్రకు భంగం కలుగుతుంది. అందుకే మిఠాయి, ఐస్ క్రీములు, కేకులు మొదలైనవి పడుకునే ముందు తినకూడదు.

రాత్రి నిద్రను పాడుచేసే ఆహార పదార్థాలుఏదైనా శారీరక శ్రమ చేయడానికి ముందు అరటి పండ్లు తినడం మంచిది. ఇందులో పొటాషియం అధికంగా లభిస్తుంది. చర్మాన్ని మెరుగు చేయడంతో పాటు మీ రోగనిరోధక శక్తిని సైతం అరటిపండ్లు మెరుగు చేస్తాయి. అయితే రాత్రివేళ అరటిపండ్లు తింటే అజీర్తి సమస్యలు వస్తాయి. ఇక రాత్రిపూట గుడ్లు తినడం మంచిది కాదు అని ఖచ్చితంగా చెప్పలేము కానీ జీర్ణశక్తి తక్కువగా వున్నవాళ్ళు రాత్రుళ్ళు తినకపోవడమే మంచిది. రెడ్ మీట్ లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. క్యూర్డ్ మీట్, జున్నులో అమైనో ఆమ్లం టైరామిన్ ఉంటుంది. ఇది ఉండటం వల్ల రాత్రిపూట తీసుకుంటే ఇవి నిద్రను భంగం చేస్తాయి.

రాత్రి నిద్రను పాడుచేసే ఆహార పదార్థాలుయాపిల్ పళ్లలో పెక్టిన్ అనే ఫైబర్ అధిక మోతాదులో ఉంటుందని వైద్య నిపుణులు గుర్తించారు. ఇది రక్తంలో చక్కెర మోతాదును, కొవ్వును నియంత్రిస్తుంది. కానీ రాత్రివేళ యాపిల్ పండ్లు తింటే ఎసిడిటీకి దారితీస్తుంది. రాత్రివేళ ఆహారం, మరీ ముఖ్యంగా డిన్నర్ అయిన వెంటనే నిద్రించేవారు ఆ సమయంలో యాపిల్ తినకపోవడం ఆరోగ్యానికి శ్రేయస్కరం.

రాత్రి నిద్రను పాడుచేసే ఆహార పదార్థాలుటమోటాల్లో టైరమైన్ అనే ఒక రకమైన అమైనో ఆమ్లం ఉండటం వల్ల పడుకునే ముందు టమోటాలు తింటే నిద్రకు భంగం కలిగిస్తుంది. సిట్రస్ పండ్లు ఆరోగ్యానికి చాలామంచివి, వీటి వల్ల ఎప్పుడు అనారోగ్యం కలగదు అని చాలామంది చెబుతారు. నిజగానే సిట్రస్ పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ వీటిల్లో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల, పడుకునే ముందు వీటిని తినడం మంచిది కాదు. ఎందుకంటే ఇది సరిగా జీర్ణం కాకపోతే ఎసిడిటీ పెరిగి గుండెల్లో మంటను కలిగిస్తుంది. ఇది నిద్ర పట్టకుండా చెయ్యడమే కాకుండా తరువాత రోజు కూడా గుండెల్లో మంటగా ఉంటుంది.

రాత్రి నిద్రను పాడుచేసే ఆహార పదార్థాలుబాదం, పిస్తా లాంటి నట్స్ తినేవారిలో రక్తపోటు సాధారణంగా ఉంటుంది. గుండె సంబంధిత సమస్యలకు బాదం, పిస్తా పరిష్కారం చూపుతాయి. కానీ వీటిలో అధిక మోతాదులో కొవ్వు, కెలోరీలు ఉంటాయి. కానీ రాత్రివేళ ఇవి తినడం వల్ల బరువు పెరిగి స్థూలకాయ సమస్య బారిన పడతారు. పగటివేళ వీటిని తినడం వల్ల ఏ సమస్య ఉండదు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR