అమృతం దొంగిలించిన వినాయకుడు! ఎక్కడ దాచాడో తెలుసా??

గణాలకు అధిపతి గణపతి. విజ్ఞలను తొలగించేవాడు విగ్నేశ్వరుడు. మనం ఏ రూపంలో ఆరాధిస్తే ఆ రూపంలో కరుణించే కరుణామయుడు. మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఏదైనా శుభకార్యం తలపెట్టినా, ఏదైనా మంచి పనులు చేయాలని భావించిన ముందుగా వినాయకుడికి పూజలు చేస్తాం.

lord ganeshaఈ విధంగా వినాయకుడికి పూజ చేయటం వల్ల ఆ కార్యానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా దిగ్విజయంగా పూర్తవుతుందని భావిస్తారు.
ఎంతో విశిష్టత కలిగిన ఈ గణనాథుడు కూడా దొంగతనం చేశాడంటే మీరు నమ్ముతార? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా వినాయకుడు కూడా దొంగతనం చేశాడని పురాణాలు చెబుతున్నాయి.

మరి వినాయకుడు దొంగతనం చేయడానికి గల కారణం ఏమిటి? చూద్దాం…పురాణాల ప్రకారం పూర్వం దేవతలు, రాక్షసులు అమృతం కోసం సాగర మధనం చేసారు.
ఈ మహత్తర కార్యం మొదలు పెడుతున్న సమయంలో దేవతలు రాక్షసులు వినాయకుడికి పూజ చేయటం మరిచిపోయారు.

samudra mantanaదీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన గణనాధుడు సముద్రగర్భం నుంచి ఉద్భవించిన ఒక బిందెడు అమృతాన్ని దొంగలించి తమిళనాడు రాష్ట్రం, నాగపట్నం జిల్లా తిరుక్కాడియాయూర్ లో ఉన్నటువంటి కడేశ్వరస్వామి ఆలయంలో దాచారు. ఈ విధంగా వినాయకుడు దొంగలించి దాచిపెట్టిన అమృతం బిందె మహా శివలింగంగా ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి.

kadeshwara swami templeఈ విధంగా ఈ ఆలయంలోని స్వామి వారు అమృతం నుంచి ఉద్భవించాడు కాబట్టి ఈ ఆలయంలో వెలసిన స్వామివారిని అమృత కడేశ్వరుడిగా భక్తులు పూజ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సముద్రగర్భం నుంచి అమృతాన్ని దొంగలించినందుకుగాను వినాయకుడికి కళ్ళల్ వినయగర్ అనే పేరు వచ్చింది.ఇక్కడ కళ్ళల్ అంటే దొంగ అని అర్ధం.

kadeshwara swami templeఅదేవిధంగా యమధర్మరాజు నుంచి మార్కండేయుడిని కాపాడటం కోసం పరమశివుడు ఏకంగా యమధర్మరాజును సంహరించడం వల్ల ఈ ఆలయంలో వెలసిన స్వామివారిని కాల సంహారకుడు అని పిలుస్తారు. ప్రతి ఏడు ఈ ఆలయంలో స్వామి వారికి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.
ముఖ్యంగా కార్తీకమాసం, దసరా, శివరాత్రి వంటి పర్వదినాలలో ఈ ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు చేరుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,670,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR