భారత సనాతన సాంప్రదాయం నుంచి వచ్చిన అత్యంత అమూల్యమైన శాస్త్రం జ్యోతిషశాస్త్రం. దీని ద్వారా వ్యక్తుల జీవితాలకు సంబంధించి అనేక విషయాలను అధ్యయనం చేయవచ్చు. అంతేకాకుండా జ్యోతిషశాస్త్రంలో మనిషికి సంబంధించి ప్రతి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కొన్నిసార్లు విధి, విధానలతో పూజాపాటవాలను నిర్వహిస్తే, మరికొన్ని శ్రద్ధాసక్తులతో మంత్రాలను జపిస్తే సమస్యలను ఎప్పటికీ దూరం చేసుకోవచ్చు. అయితే ఉచ్ఛరించాల్సిన మంత్రాలు, శ్లోకాలు సరిగ్గా ఉచ్ఛరించాలి. లేకుంటే ఫలితముండదు.
- సాధారణంగా ప్రతి ఒక్కరు ఎన్నో రకాల జబ్బులతో బాధ పడటం సర్వసాధారణం. ఇలా జబ్బులతో బాధ పడేటప్పుడు ముందుగానే ఆ జబ్బుకు తగ్గ చికిత్స తీసుకోవడం చేస్తుంటారు.
- ఇలా వివిధ రకాల వ్యాధులతో బాధపడే వారు మంచి వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకున్నప్పటికీ కొందరికి మాత్రం ఆ వ్యాధుల నుంచి ఉపశమనం కలుగదు. ఇలా దీర్ఘకాలికంగా పలు రకాల వ్యాధులతో బాధపడుతూ ఎంతో సతమతమవుతుంటారు.
- ఇలా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు మందులు మాత్రలు తీసుకున్నప్పటికీ నయం కాకపోయినా ప్రతిరోజు ధన్వంతరి మంత్రాన్ని పాటించడంతో దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి. ఇలా పురాణాల ప్రకారం దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ప్రతిరోజు ఈ ధన్వంతరి మంత్రాన్ని పాటించడం ఎంతో మంచిదని ఈ మంత్రం పాటించడం వల్ల తొందరగా ఈ వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు.
- ఓం నమో భగవతే మహా సుదర్శన వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశ హస్తాయ సర్వ భయ వినాశాయ త్రైలోక్యపతయే త్రైలోక్య విధాత్ర్తే శ్రీ మహా విష్ణు స్వరూప శ్రీ ధన్వంత్రి స్వరూప శ్రీశ్రీ ఔషధ చక్ర నారాయణ స్వాహా ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశ హస్తాయ సర్వ భయ వినాశాయ త్రైలోక్య నాథాయ శ్రీ మహా విష్ణవే నమః
అనే మంత్రాన్ని ప్రతిరోజూ చదవటం వల్ల ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి అయినా ఉపశమనం పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి.