ఇలా చేస్తే ఒంటిపైన ఒక్క చెమట కాయ కూడా రాదు

ఎండాకాలం లో ఎదురయ్యే ప్రధానమైన సమస్యలలో చెమట పొక్కుల సమస్య ఒకటి . సాధారణంగా వేసవికాలంలో శరీరానికి చెమటపడుతుంది. ఆ క్రమంలో కొన్నిసార్లు చెమట గ్రంథులు మూసుకుపోతాయి. అప్పుడే చెమటకాయలు వస్తాయి. చర్మం ఎర్రగా కందిపోయి, చిన్నచిన్న నీటిపొక్కుల్లా మొదలవుతాయి. దాంతో విపరీతమైన మంటా, దురద మొదలవుతుంది. ఇవి శరీరంలో ఏ భాగంలోనైనా రావొచ్చు. అయితే వీటిబారి నుంచి తప్పించుకోడానికి కొన్నిచిట్కాలు పాటిస్తే సరి.

Get Rid Of Sweat Blisters With These Tips.కాటన్ బట్టలు :

Get Rid Of Sweat Blisters With These Tips.శరీరం చల్లగా, గాలి తగిలేలా ఉండడం ముఖ్యం. కుదిరితే చెమట కాయలు ఉన్న చోట కాసేపు బట్ట తొలగించి డైరెక్ట్‌గా గాలి తగిలేలా చూడండి. చిన్న పిల్లలకి అవసరం అనుకున్న సమయంలోనే వేయండి. పెద్దవాళ్ళు కూడా వదులుగా ఉండే కాటన్ బట్టలు వేసుకోండి. సింథటిక్ బట్టలు వేసుకోకండి. సమ్మర్ లో తేలిక పాటి రంగుల్లో వదులుగా ఉండే కాటన్ బట్టలు వేసుకోండి. సింథటిక్ బట్టల్లో గాలి ఆడదు. కాటన్ బట్టలు శరీరానికి గాలి తగిలేటట్లు చూస్తాయి. స్కిన్ పొడిగా ఉంచుకోండి. ఈ వేడి లో స్కిన్ ని ఎప్పుడూ పొడిగా ఉంచుకోండి. స్నానం అయిన తరవాత వెంటనే టవల్ తో పొడిగా అద్దుకోండి. గట్టిగా తుడవకండి. వెంటనే పౌడర్ చల్లుకుంటే చల్లగా ఉంటుంది.

హెల్దీ ఫుడ్ :

Get Rid Of Sweat Blisters With These Tips.వేపుళ్ళూ, స్వీట్సూ తగ్గించి సాలడ్స్, ఫ్రూట్స్ తీసుకోండి. ఒంట్లో వేడిని పెంచే ఆహారం తీసుకోకండి. బయటి ఫుడ్ తీసుకోవద్దు. తాజా కూరగాయలు, ఇంట్లో వండిన వంటనే తీసుకోండి. పండ్లు ఎక్కువగా తీసుకోండి.

కొబ్బరి నీళ్ళు :

Get Rid Of Sweat Blisters With These Tips.బయట ఉన్న వేడికి లోపల నీళ్ళు ఆవిరైపోతాయి కాబట్టి ఎప్పుడూ హైడ్రేటెడ్ గా ఉండేలా చూసుకోవడం అవసరం. కొబ్బరి నీళ్ళు, నిమ్మకాయ నీళ్ళు, లస్సీ, మజ్జిగ వంటివి తాగుతూ ఉండండి. ఆల్కహాల్‌కీ, ఏరేటెడ్ డ్రింక్స్‌కీ నో చెప్పండి. ఫ్లేవర్డ్ వాటర్ కూడా మీ డైట్ లో చేర్చుకోవచ్చు.

పెరుగు :

Get Rid Of Sweat Blisters With These Tips.పెరుగు ఎప్పుడూ చల్లగా ఉంటుంది. చల్లని పెరుగుని చెమట కాయల మీద అప్లై చేసి పదిహేను నిమిషాల పాటూ వదిలెయ్యండి. తరవాత చల్లని నీటితో కడిగేసి మెత్తటి బట్టతో అద్దండి. గట్టిగా తుడవకండి. పెరుగులో ఉన్న యాంటీ-బాక్టీరియల్ యాంటీ-ఫంగల్ ప్రాపర్టీస్ ఈ సమస్యకి త్వరగా చెక్ పెడతాయి.

రోజ్ వాటర్ :

Get Rid Of Sweat Blisters With These Tips.200 ఎం ఎల్ రోజ్ వాటర్, 200 ఎం ఎల్ ప్యూర్ వాటర్, 4 టేబుల్ స్పూన్ల తేనె కలపండి. ఈ మిశ్రమాన్ని ఐస్ ట్రేలో వేసి ఫ్రీజ్ చెయ్యండి. ఇవి నాలుగైదు తీసుకుని మెత్తటి బట్టలో చుట్టండి. దీన్ని చెమట కాయల మీద నెమ్మదిగా అప్లై చెయ్యండి. అదే విధంగా వాటిని రాయడం, గోకడం వంటివి చేయకండి.

గంధం :

Get Rid Of Sweat Blisters With These Tips.వేసవికాలం గంధం పూసుకోడం అన్నది మనకి చిన్నపట్నించి తెలిసిన విషయమే. ఈ గంధాన్ని చల్లటి పాలతో కలిపి పాక్ లా వేసుకోండి. ఆరిన తరవాత చల్లని నీటితో కడిగెయ్యండి. దీని వల్ల సన్ టాన్ కూడా పోతుంది. కాబట్టి రెగ్యులర్‌గా గంధం రాసుకోండి.

ముల్తానీ మట్టి :

Get Rid Of Sweat Blisters With These Tips.రెండు టీ స్పూన్స్ పుదీనా పేస్ట్, మూడు టేబుల్ స్పూన్స్ ముల్తానీ మట్టి, తగినన్ని చల్లని పాలు కలిపి పేస్ట్ చెయ్యండి. చెమటకాయల మీద దీన్ని అప్లై చేసి ఆరనివ్వండి. ఇవన్నీ చేస్తున్నప్పుడు కుదిరితే ఫాన్ కింద కూర్చోండి. ఆ తరవాత మెత్తటి టవల్ తో అద్దండి

ఐస్:

Get Rid Of Sweat Blisters With These Tips.ఐస్ వేడి, ఆర్ద్ర వాతావరణం వల్ల సంభవించే ప్రిక్లీ హీట్ ని తగ్గించే మరో గొప్ప మార్గం. ఐస్ గడ్డలతో దద్దుర్లపై రుద్దడం వల్ల మంట, వేడి అనుభూతి తగ్గుతుంది.

మర్రిచెట్టు బెరడు :

Get Rid Of Sweat Blisters With These Tips.మర్రిచెట్టు బెరడు చికిత్స కూడా ప్రిక్లీ హీట్ పై అద్భుతంగా పనిచేస్తుంది. పొడిగా ఉన్న మర్రిచెట్టు బెరడును తీసుకోండి, పలుచని పౌడర్ అయ్యే వరకు నూరండి. ప్రభావిత ప్రాంతాలపై ఈ పౌడర్ ని పూయడం వల్ల ప్రిక్లీ హీట్ నుండి త్వరిత ఉపశమనం కలుగుతుంది.

వేప ఆకులు:

Get Rid Of Sweat Blisters With These Tips.వేప ఆకులను తీసుకుని, వాటిని నలిపి నీటితో చక్కటి పేస్ట్ తయారుచేయండి. ప్రభావిత ప్రాంతాలపై ఆ పేస్ట్ ని పూయండి, పూర్తిగా ఆరేవరకు చర్మం పై వదిలేయండి. వేప బాక్టీరియా వ్యతిరేక లక్షణాలు గలది, జెర్మ్స్ ని చంపడానికి ఉపయోగపడుతుంది, అలాగే ఇతర చర్మ వ్యాధుల నుండి తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
591,000FollowersFollow
1,320,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR