వెన్న మరియు నెయ్యి దేనిలో పోషక విలువలు ఎక్కువ ఉన్నాయో తెలుసా ?

వెన్న,నెయ్యి రెండు పాల నుండి తయారయ్యే పదార్థాలే. వెన్నను మరిగించడం ద్వారా నెయ్యిని తయారు చేస్తారు. మరి ఈ రెండిటిలో ఏది ఆరోగ్యానికి ఎక్కువ లాభం చేస్తుంది. వెన్నను మరిగించే నెయ్యి తయారు చేస్తారు కాబట్టి వెన్న, నెయ్యి రెండు ఒకటే అనుకుంటారు. కానీ.. ఆ రెండూ ఒకటి కాదు. నెయ్యి వేరు.. వెన్న వేరు. ఆ రెండింట్లో చాలా తేడాలు ఉన్నాయి.

Ghee Versus Butter: Which One is Better?అసలైతే నెయ్యి, వెన్న.. రెండూ ఆరోగ్యానికి మంచివి కావని, వాటిలో కొలెస్టరాల్ ఎక్కువగా ఉంటుందని, కాబట్టి అవి తింటే.. బరువు పెరుగుతారు అని కొందరు అంటుంటారు. చాలామందికి ఈ విషయంలో అపోహలు ఉన్నాయి. నిజానికి అవన్నీ అపోహలు మాత్రమే. పాలతో వచ్చిన ఈ రెండింటిలోనూ ఎన్నో ఔషధగుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలోనూ నెయ్యి, వెన్నకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.

Ghee Versus Butterవెన్న వంటలకు రుచిని ఇవ్వడమే కాకుండా.. రెగ్యులర్ వంటనూనెకు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. వెన్నమీద ఇప్పటివరకు ఉన్న అపోహలు నిజం కాదు. ఇది సరైన పరిమాణంలో తీసుకుంటే శరీరానికి ఎంతో మంచి చేస్తుంది. దీంట్లో ట్రాన్స్ ఫ్యాట్స్ లేవు. ఇది పాల ఉత్పత్తి కనుక ఇందులో విటమిన్ ఎ, ఇ, యాంటీఆక్సిడెంట్లు, కాల్షియంలు లభిస్తాయి. ఇది శరీరానికి వెంటనే శక్తినిస్తుంది. బరువు తగ్గడానికి కీటోడైట్ చేస్తున్నట్లైతే వెన్న మంచి ఆప్షన్.

Ghee Versus Butterఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొవ్వులు అధికంగా ఉండే వెన్నను ఊబకాయం, గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉండడానికి వాడుతారు. ఒక చెంచా వెన్నలో 100 కేలరీలు, 12 గ్రాముల కొవ్వు ఉంటుంది. వెన్నను తీసుకుంటే.. దగ్గును తగ్గిస్తుంది. అలాగే.. హెమరాయిడ్స్ అనే వ్యాధిని రాకుండా వెన్న అడ్డుకుంటుంది. జీర్ణ వ్యవస్థ కూడా బాగుంటుంది.

Ghee Versus Butterఅలాగే నెయ్యిలో కూడా ఎన్నో పోషకాలు ఉంటాయి. నెయ్యి తింటే బరువు పెరుగుతారని అపోహ ఉన్నప్పటికీ.. ఇది బరువు తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. నెయ్యిని నిత్యం తీసుకోవడం వల్ల.. శరీరంలోని చెడు కొలెస్టరాల్ కరిగి.. మంచి కొలెస్టరాల్ పెరుగుతుంది. దాని వల్ల బరువు తగ్గుతారు. శరీరంలో మెటబాలిజం రేటును పెంచుతుంది. ఇమ్యూనిటీ పవర్ ను కూడా పెంచుతుంది.

Ghee Versus Butterనెయ్యిలో ఎ, డి, కె వంటి కొవ్వులో కరిగే విటమిన్లు బాగా ఉంటాయి. కేసైన్ ఉండదు. నెయ్యి తెలివి తేటలను పెంచుతుంది. వాతం ఉన్నా పిత్త సమస్యలు ఉన్నా తగ్గిస్తుంది. పాల ఉత్పత్తులతో ఎలర్జీ ఉన్నవారికి కూడా నెయ్యి బాగా సరిపోతుంది. నెయ్యి గట్-ఫ్రెండ్లీ ఎంజైమ్‌లను కలిగి ఉంటుంది, ఇది సులభంగా జీర్ణక్రియకు తోడ్పడుతుంది.

Ghee Versus Butterపోషక విలువల విషయానికొస్తే, ఒక చెంచా నెయ్యిలో 115 కేలరీలు, 9.3 గ్రాముల సంతృప్త కొవ్వు, 0 పిండి పదార్థాలు, 38.4 గ్రాముల కొలెస్ట్రాల్ ఉన్నాయి. కాకపోతే.. వెన్న కంటే కూడా నెయ్యి చాలా రోజులు నిలువ ఉంటుంది. అలాగే.. వెన్న కంటే కూడా నెయ్యిలో ఎక్కువ ఉపయోగాలు ఉన్నాయి. అయితే.. కొందరు డైరెక్ట్ గా పాల నుంచే నెయ్యిని తీస్తుంటారు. అది మంచిది కాదు. నెయ్యిని పెరుగు ద్వారా వచ్చే వెన్న నుంచి తీసిందైతేనే ఆరోగ్యానికి మంచిది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,450,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR