ఆవు పాలకంటే మేలైన మేక పాలు!

పాలు, గుడ్డు ఈ రెండిటిలో ఎన్ని పోషక విలువలో ఉంటాయో తెలియని వారుండరు. వెజిటేరియన్ అయితే గుడ్డు తినడానికి ఇష్టపడరేమో కానీ పాలను మాత్రం మన భారతీయ ఆహర నియమాల నుండి వేరు చేయలేము. శరీరం యొక్క పోషక అవసరాలను తీర్చడానికి మరియు శరీర పనితీరును చక్కగా పొందడానికి పాలు తాగడం చాలా ముఖ్యం.

Goat milkపాలలో బలమైన ఎముకలు నిర్మించడానికి అవసరమైన అన్ని రకాల పోషకాలు ఉన్నాయి. అందుకే చిన్న పిల్లలకి కచ్చితంగా పాలు తాగిస్తారు. పాలు తాగితే ఎముకలు, కండరాలు బలంగా ఉండడమే కాదు పిల్లల ఎదుగుదల కూడా బాగుంటుంది. అయితే ఏ పాలు తాగాలనేది కచ్చితంగా తెలుసుకోవాలి.

పాలు అనగానే వెంటనే ఆవు పాలు, లేదా గేదె పాలు గుర్తుకొస్తాయి. కానీ మేక పాలు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా? అవును, మేక పాలు అనేక ప్రయోజనాలను మనకు కలిగిస్తాయట. మేకపాలను ఈ రోజుల్లో మనం టెట్రా ప్యాకెట్లల్లో చూస్తుంటాం. పాల పొడి రూపంలో కూడా లభిస్తున్నాయి. కప్పు మేక పాలలో…

శక్తి: 156 కిలో కేలరీలు, ప్రోటీన్: 8 గ్రా,  కొవ్వులు: 9 గ్రా,  కార్బోహైడ్రేట్లు: 10 గ్రా
చక్కెర: 10 గ్రా,  కాల్షియం: 300 మి.గ్రా,  సోడియం: 115 మి.గ్రా, విటమిన్ సి: 2.9 మి.గ్రా
కొలెస్ట్రాల్: 24 మి.గ్రా ఉంటాయి.

మాంసకృత్తులు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు మరియు కాల్షియం అధికంగా ఉన్నందున, మేక పాలు అనేక రకాల ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి.

goat milkఆవు పాల కంటే మేకపాలు కడుపు నిండిన భావాన్ని వేగంగా కలిగిస్తాయని కొన్ని పరిశోధనల ద్వారా వెల్లడైంది. ఇవి ఆకలిని అణిచివేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి తద్వారా అదనపు కేలరీలను బాగా కరిగిస్తాయి. దీంతో బరువు తొందరగా తగ్గే అవకాశం ఉంటుంది. తిన్న ఆహారం మంచిగా జీర్ణం కావడానికి కూడా మేక పాలు ఉపయోగపడతాయి.

రుమటాయిడ్ అర్థరైటిస్ అనేది ఒక ఆటోఇమ్మ్యూన్ రుగ్మత. దీనిలో శరీరంలోని వివిధ జాయింట్లలో వాపు కూడా ఏర్పడి ఇది ఆస్టియోపోరోసిస్ ప్రమాదాన్ని కూడా కలిగిస్తుంది. అటువంటి సందర్భాలలో మేక పాలు త్రాగడం అనేది ఆస్టియోపోరోసిస్ ప్రమాదాన్ని నుంచి నివారిస్తుంది. మేకపాలలో ట్రైటోఫాన్‌ అనే ఎమినో యాసిడ్స్‌ చాలా పుష్కలంగా ఉండడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ సక్రమంగా అందుతాయని అంటున్నారు పలువురు వైద్యులు

rheumatoid arthritisఅదేవిధంగా మేకపాలలో ఉండే బయో ఆర్గానిక్‌ సోడియమ్‌ శరీరానికి ఎంతో మేలు చేస్తుందని అంటున్నారు. కణాల వృద్ధికి కూడా మేకపాలు తాగడం మంచిదని కొందరి అభిప్రాయం. డెంగ్యూ సోకినవారి రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్య పడిపోతుంది. వారికి మేకపాలు ఇస్తే ప్లేట్‌లెట్ల సంఖ్య పెరుగుతుందని కొందరు ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.

మేక పాలు కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. ఒక అధ్యాయనంలో మేక పాలు మరియు సొయా పాల యొక్క క్యాన్సర్ ప్రభావాలను పోల్చడం జరిగింది. సొయా పాలలో అధిక యాంటీఆక్సిడెంట్ చర్య ఉన్నపటికీ మేక పాలు క్యాన్సర్ ప్రక్రియను నిరోధించచడంలో సమర్థవంతంగా ఉన్నట్లు కనుగొనబడింది. మేక పాలలో అధికంగా ఉండే సెలెనియం మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. తద్వారా అనేక రకాల క్యాన్సర్ కారకాలను నిర్మూలించవచ్చు.

ఆవు పాలతో ఎలర్జీ ఉండే వారు మేక పాలను తీసుకోవచ్చు. వీటితో ఎలర్జీ సమస్య ఉండదు. మేక పాలలో ఉండే తక్కువ లాక్టోస్ శాతం దీనికి కారణం అని చెప్పవచ్చు. మేక పాలలో విటమిన్ A,E అధికంగా ఉండటం వల్ల చర్మ సమస్యలు తొలగి చర్మంపై కొత్త కణాలు వచ్చేలా చేస్తాయి. మేక పాలను కొబ్బరిపాలతో కలిపి ముఖాన్ని శుభ్రం చేసుకుంటే పాలలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ముఖంపై మచ్చలు, మొటిమలను పోగొడతాయి. అంతే కాకుండా మేక పాలను స్కిన్ కేర్ ఉత్పత్తులు, బాత్ సబ్బులు, క్రీములు, లోషన్లలో వాడుతున్నారు.

soft skinఅయితే మేకపాలవల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ, ఈ పాలు కొన్ని దుష్ప్రభావాలను కూడా కలిగిస్తాయి. ముఖ్యంగా పచ్చి మేకపాలను సేవిస్తే విరేచనాలు, వికారం, కడుపు తిమ్మిరి లాంటివి సంభవిస్తాయి. మేక పాలను వేడి చేయకుండా అలాగే పచ్చిపాలు తాగడంవల్ల నష్టాలు వాటిల్లి ఆసుపత్రిలో చేరడానికి కారణం కావచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పచ్చి మేకపాలు వాడకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR