పూజించిన పుష్ప ప్రసాదాలను ఏ ప్రదేశాలలో ఉంచకూడదు తెలుసా

ప్రకృతిలో అందమైనవి ఏమిటంటే పువ్వులు అని వెంటనే చెప్పేస్తాం. పువ్వులు అని చెబితేనే వాటి సువాసన, మృదుత్వం, రంగులు సృష్టి యొక్క అత్యద్భుతాలు గుర్తుకు వస్తాయి. ప్రస్తుతం మానవసమాజంలో పవిత్రత ఎంత వెతికినా కనిపించని వస్తువుగా ఉంటుంది. అయితే పువ్వులు పవిత్రవనాలుగా, పరిశుద్ధతను కలిగి విశ్వమంతటా మెరుస్తున్నాయి. పువ్వులన్నీ త్యాగ దీపాలే. ఏ పూల మొక్క కూడా తన కోసం పువ్వులను పుష్పించడం లేదు. అన్నీ ఇతర జీవుల కోసమే ఉంటున్నాయి. ఎవరూ కోయకున్నప్పటికీ పువ్వులు నేలరాలినా అవీ భూమిలో ఎరువుగా మారుతాయి. తన సువాసనలతో పుడమిని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతాయి.

పూజించిన పుష్పాలుమంత్రాలవల్ల, మాయల వల్ల, తాంత్రిక శక్తుల ద్వారా సాధించలేనివాటిని పువ్వులతో సులువుగా సాధించగలం. ఎంతోమంది సిద్ధపురుషులు పువ్వులకు సంబంధించిన దైవీక రహస్యాలెన్నింటినో మనకు అందించారు. దైవానుగ్రహం పొందడానికి రెండు మార్గాలు ఉన్నాయి. దైవానుగ్రహం పొందడానికి భక్తి, జ్ఞాన, కర్మ, యోగ మార్గాలంటూ పలు మార్గాలున్నాయి. తపస్సులు చేసి, వ్రతాలు చేసి నామసంకీర్తనలు, ఆలయపనులు నిర్వహించి కూడా దైవానుగ్రహం పొందవచ్చు. ఈ రెండో మార్గంలో సులువుగా దైవానుగ్రహం పొందగలం. ఈ భూలోకంలో పరలోకంలోను పలు కార్యాలను సాధించటానికి పువ్వులు తోడ్పడతాయి.

పూజించిన పుష్పాలుపువ్వుల సువాసనలు తరచూ మంచి తలంపులను, భావాలను ప్రేరేపిస్తాయి. కాబట్టి పువ్వుల మధ్య జీవించడం చాలా మంచిది. ఈ కలియుగంలో మన దృష్టికి చెడుగా అనిపించేవన్నీ చెడుగా ఉండటం లేదు. మంచివిగా ఉన్నవని నిజానికి మంచివి కావు. కాబట్టి ఈ విషయంలో ఏవి మంచో ఏవి చెడో నిర్ధారించుకోవడానికి సైతం ఈ పూల సువాసనలే సాయపడతాయి. అందుచేత ఎల్లప్పుడూ చేతిలో, సంచిలో, ఆలయంలో, ఇంటిలో పూజించిన పుష్ప ప్రసాదాలను ఎల్లవేళలా ఉంచుకుంటే మంచింది.

పూజించిన పుష్పాలుఆలయ పుష్ప ప్రసాదం చేతిలో ఉంటే చెడు శక్తులు సమీపించవు. ఇవి రక్షణ కవచంగా ఉంటాయి. ఎందుకంటే పువ్వులు పవిత్రమైనవి. పరిమళ భరితమైనవి. అలాంటి పువ్వులను దైవానికి సమర్పించి తిరిగి ప్రసాదంగా పొందడాన్ని భక్తులు శుభప్రదంగా భావిస్తుంటారు. అయితే దేవుడి దగ్గర పూలు తలలో పెట్టుకున్న తరువాత కొంత సేపటికి వాటిని తీసి పవిత్రమైన ప్రదేశాల్లో వదిలేయాలి. వివాహితులు ఆ పువ్వులను ధరించి ఎలాంటి పరిస్థితుల్లోను పడక గదిలోకి అడుగు పెట్టరాదని చెబుతోంది శాస్త్రం. కొంతమంది తెలియక ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటారు. నిర్లక్షంగా వ్యవహరిస్తుంటారు. ఇందుకు సంబంధించిన కథ ఒకటి మనకి పురాణాల్లో కనిపిస్తుంది.

పూజించిన పుష్పాలు

పూర్వం దూర్వాస మహర్షి తపస్సుకి మెచ్చిన అమ్మవారు తన మెడలోని పూల హారాన్ని అతనికి బహుమానంగా ఇస్తుంది. ఆ పూలమాల వెదజల్లుతున్న పరిమళానికి ముగ్ధుడైన దక్ష ప్రజాపతి దానిని తనకి ఇవ్వవలసిందిగా దూర్వాసుడిని కోరాడు. అమ్మవారి ప్రసాదంగా తనకి లభించిన ఆ పూలమాలను అత్యంత పవిత్రంగా చూసుకోమంటూ ఆయన ఆ మాలను దక్ష ప్రజాపతికి ఇచ్చాడు. అజ్ఞానంతో ఆ రాత్రి దక్ష ప్రజాపతి ఆ పూలమాలను తన పడక గదిలోని మంచానికి అలంకరించాడు.

పూజించిన పుష్పాలు ఆ విధంగా చేసిన దోషమే ఆయన్ని శివ ద్వేషిగా మార్చింది. శివుడికి, తన కూతురుగా పుట్టిన శక్తికి కూడా ఆయన్ని శత్రువును చేసింది. సాక్షాత్తు ముల్లోకాలు పూజించే పరమేశ్వరుడిని అవమానించి ధూషించేలా చేసింది. కళ్ళముందే కూతురు మంటల్లో సజీవంగా దహనం అవుతున్నా మనసు చలించకుండా చేసింది. అల్లుడి కోపానికి గురై శివుడి కారణంగానే శిరస్సును కోల్పోవలసి వచ్చింది. కాబట్టి దైవానికి భక్తితో సమర్పించిన పువ్వులు తిరిగి ప్రసాదంగా స్వీకరించినప్పుడు వాటిని పవిత్రంగా చూసుకోవాలి. పవిత్రమైన ప్రదేశాల్లో మాత్రమే ఉంచాలని శాస్త్రం చెబుతోంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR