గోదావరి నది ఉత్తర దిశకు ప్రవహించే అద్భుతం ఎక్కడో తెలుసా ?

0
7497

గోదావరి నది తీరమున వెలసిన ఈ ప్రాచీన ఆలయాన్ని ఉత్తర వాహిని తీరం అని కూడా పిలుస్తుంటారు. ఎందుకంటే గోదావరి నది జన్మస్థలం నుండి సముద్ర తీరంలో కలిసే వరకు ఈ ఒక్క చోటనే ఉత్తర దిశకు ప్రవహిస్తుంది. అందుకే చాలా మంది భక్తులు ఈ ఆలయానికి వచ్చి ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఇంతకీ ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఎందుకు ఈ ఆలయం వద్ద గోదావరి ఉత్తర దిక్కునకు ప్రవహిస్తుంది అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

godavariతెలంగాణ రాష్ట్రంలోని, ఆదిలాబాద్ జిల్లా, మంచిర్యాల నుండి 30 కీ.మీ. దూరంలో చెన్నూరు గ్రామం కలదు. ఈ గ్రామంలో శ్రీ అగస్తేశ్వరాలయం ఉంది. ఇది చాలా పురాతనమైన ఆలయంగా ప్రసిది గాంచింది. దీనినే ఉత్తర వాహిని తీరం అని కూడా పిలుస్తుంటారు. ప్రాచీన అగస్తేశ్వరాలయాలలో ఇది కూడా ఒకటిగా చెబుతారు.

godavariద్వాపరయుగంలో అగస్త్య మహాముని ఈ ప్రాంతంలో తపస్సు చేయడానికి వచ్చి ఇక్కడి ప్రకృతి సౌదర్యానికి ముగ్దుడై ఇక్కడ ఒక భారీ శివలింగాన్ని ప్రతిష్టించాడు. అందుకే ఈ ఆలయానికి అగస్తేశ్వరాలయం అని పేరు వచ్చినది. ఆ తరువాత 1289 లో కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు ఈ ఆలయాన్ని పునర్నిర్మించినట్లు స్థల పురాణం.

godavariఆలయంలోని ఒక శాసనం ప్రకారం. అల్లాఉద్దీన్ ఖిల్జీ కాలంలో సేనాని మాలిక్ కపూర్ ఈ ఆలయం పైన దాడిచేసి గోపురాన్ని ధ్వసం చేయగా, శ్రీ కృష్ణదేవరాయలు ఈ ప్రాంతానికి వచ్చిన సమయంలో ఆలయాన్ని మరోసారి పునర్నిర్మించినట్లు తెలుస్తుంది.
ఇది ఇలా ఉంటె, సాధారణంగా నదులన్నీ పశ్చిమదిశ నుండి తూర్పునకు ప్రవహిస్తాయి. కానీ ఇచట ఉన్న గోదావరి నదికి ఒక ప్రత్యేకత ఉంది. కాశీలో గంగానది ఉత్తరదిశగా 6 కీ.మీ. ప్రవహిస్తుండగా చెన్నూరు ప్రాంతంలో పక్కూర్ గ్రామం నుండి కోటపల్లి మండలంలో పదుపల్లి గుట్టలవరకు గోదావరి నది ఉత్తరదిశగా 15 కీ.మీ. ప్రవహిస్తుంది.

godavariఅయితే పారుపల్లి గుట్టలపై దిగంబరంగా ఉన్న భైరవుడి విగ్రహ రూపాన్ని చూడలేకే గోదావరి నది ఉత్తరంగా ప్రవహిస్తుందని కొందరు చెబుతుంటారు. గోదావరి నది జన్మస్థలం నుండి సముద్ర తీరంలో కలిసే వరకు ఈవిధంగా ఉత్తర దిశ ప్రవహించడం మరెక్కడా లేదు. అందుకే ఈ ప్రాంతంలో పుణ్య స్నానాలు ఆచరించడానికి, తల్లితండ్రుల అస్థికలు నిమర్జనం చేయడానికి భక్తులు ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి తరలివస్తుంటారు. అయితే గోదావరి ప్రత్యేక ప్రవాహం వలనే ఈ ప్రాంతానికి ఉత్తరవాహిని తీరం అనే పేరు కూడా వచ్చింది. ఇంత గొప్ప విశిష్టత కలిగిన ఈ నదిలో ఆంజనేయుడి తల్లి అంజనాదేవి స్నానమాచరించిందని స్థల పురాణం తెలియచేస్తుంది.

godavariఈ ఆలయంలో మరో విశేషం ఏంటంటే అఖండజ్యోతి. ఇది సుమారుగా 410 సంవత్సరాల నుండి నిరంతరం వెలుగుతూనే ఉంది. పూర్వము దీన్ని జక్కేపల్లి సదాశివయ్య అనే బ్రాహ్మణా భక్తుడు ఈ అఖండ దీపని వెలిగించాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు జ్యోతి దేదీప్యమానంగా నిరంతరం వెలుగుతూనే ఉంది.

godavariఇక గోదావరి పుష్కారాల సమయంలో తెలుగు రాష్ట్రాల నుండి మాత్రమే కాకుండా మహారాష్ట్ర నుండి కూడా లక్షలాది మంది భక్తులు ఈ తీరంలో పుణ్యస్నానాలు చేస్తారు. శివరాత్రి రోజున ఇక్కడ అఖండ జ్యోతి పూజలు నిర్వహించి, శివపార్వతుల కళ్యాణం చేస్తారు.

8 godhavari okka e alayam vaddane uttara dishaku enduku pravahisthundhi