తమిళనాడులోని ఈ 10 ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు తప్పకుండ వెళ్ళాలి

మన దేశం మొత్తంలో అతి పురాతన ఆలయాలు, ప్రసిద్ధ దేవాలయాలు, ఎక్కువగా ఆలయాలు ఉన్న ప్రాంతం తమిళనాడు అని చెప్పవచ్చు.  అందుకే తమిళనాడు ప్రాంతాన్ని దేవాలయ భూమి అని పిలుస్తారు. ఇక్కడ దాదాపుగా 33000 అతి పురాతన ఆలయాలు ఉండగా ఆ దేవాలయాలు అన్ని కూడా 800 నుండి 3500 సంవత్సరాల క్రితం నాటివిగా చెబుతారు. మరి తమిళనాడు రాష్ట్రంలో ఉన్న కొన్ని ప్రసిద్ధ దేవాలయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

అరుణాచల దేవాలయం:

tamilnaduతమిళనాడు రాష్ట్రం, తిరువణ్ణామలై జిల్లాలో అన్నామలై కొండ దిగువన ఉన్న ప్రాంతంలో అరుణాచల దేవాలయం ఉంది. శివుడి యొక్క పంచభూత లింగాలలో ఈ ఆలయంలోని శివలింగం అగ్నిని సూచిస్తుంది. ఇక్కడి శివలింగాన్ని తేజోలింగం అని కూడా అంటారు. ఈ ఆలయానికి వెనుక భాగంలో ఉన్న కొండనే అరుణాచలం అని అంటారు. ఈ ఆలయంలో గిరి ప్రదక్షణికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ ఉన్న అరుణాచలం కొండ చుట్టూ ప్రదక్షిణ చేయాలంటే దాదాపుగా 12 కి.మీ. నడవాల్సి ఉంటుంది. ఇలా ప్రదక్షిణ చేస్తుండగా మార్గమధ్యంలో మొత్తం ఎనిమిది శివాలయాలు ఉంటాయి. ఇలా ఒక్కో ఆలయాన్ని దర్శిస్తూ మార్గమధ్యంలో అరుణాచల శిఖరాన్ని చూస్తూ భక్తులు ప్రదక్షిణం ముగిస్తారు. ఇలా గిరి ప్రదక్షిణ చేస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని నమ్మకం.

సుబ్రమణ్యస్వామి ఆలయాలు: 

tamilnaduతమినాడులో శ్రీ సుబ్రమణ్యస్వామిని త్రిమూర్థులకంటే ఎక్కువగా ఆరాధిస్తుంటారు. ఆ స్వామి వెలసిన ఆ ఆరు పుణ్యక్షేత్రాలను పడైవీడులు అని పిలుస్తారు అంటే యుద్ధ క్షేత్రాలు అని అర్ధం. ఆ ఆరు ఆలయాలు ఏంటంటే, శ్రీ కుమారస్వామి ఆలయం – పళని,  తిరుచ్చెందురు ఆలయం, తిరుత్తణి ఆలయం, స్వామిమలై ఆలయం, తిరుపరన్కుండ్రం,  పలముదిర్ చోళై. ఇలా వెలసిన ఆ సుబ్రహమణ్యస్వామి 6 పుణ్యక్షేత్రాలు భక్తులని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

శ్రీ జంబుకేశ్వరాలయం: 

tamilnaduతమిళనాడు రాష్ట్రం, తిరుచిరాపల్లి జిల్లాలో, తిరువనక్కవాల్ అనే గ్రామంలో శ్రీ జంబుకేశ్వరాలయం ఉంది. ఇక్కడ శివుడూ జలరూపంలో వెలిశాడని చెబుతారు.  పంచభూత లింగాల్లో ఒకటైన జలలింగం ఇక్కడ భక్తులకి దర్శనం ఇస్తుంది. అతి ప్రాచీన ఆలయంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో ఐదు గొప్ప ప్రాకారాలు ఉన్నాయి. అయితే ఐదవ ప్రాకారాన్ని ఒక సిద్ధుడు కట్టినట్లుగా చెబుతారు. ఇతడి కట్టిన ప్రాకారానికి పనిచేసినవారికి రోజు కొంత విబూది ఇచేవాడంట. పనిచేసి విభూధిని తీసుకెళ్లిన వారికీ ఇంటికి వెళ్ళగానే ఈ విబూది బంగారం లాగ మరెందట. దీంతో ఆ ప్రాకారాన్ని నిర్మించడానికి స్వయంగా ఆ శివుడే సిద్ధుడి రూపంలో వచ్చాడని స్థానిక భక్తుల నమ్మకం.

మధురై:

tamilnaduతమిళనాడు రాష్ట్రంలోని మధురై లో శ్రీ మధుర మీనాక్షి దేవాలయం ఉంది. భారతదేశంలోని అతి ప్రాచీన దేవాలయలో ఈ ఆలయం ఒకటి. ఈ ఆలయం 283 గజాల పొడవు, 243 గజాల వెడల్పుతో ఒక పెద్ద కోట లాంటి ఆవరణలో ఉంది. ఈ ఆలయ గోపురం 160 అడుగుల ఎత్తులో ఉంటుంది. తమిళ పురాణాల ప్రకారం శివుడికి, మీనాక్షి దేవికి వివాహం ఇక్కడే జరిగిందని చెబుతారు. ఆ ఆలయంలో ఉన్నంత శిల్ప కళ నైపుణ్యం మరెక్కడా కూడా లేదనే చెప్పవచ్చు. దక్షిణ భారతదేశంలో ఎక్కువమంది దర్శించే ఆలయాల్లో మీనాక్షి దేవి ఆలయం ఒకటి. ఇక ఈ ఆలయ ప్రత్యేకత ఏంటంటే, నాలుగు దిక్కుల నాలుగు ఎత్తైన రాజగోపురాలతో గంబీరంగా కనబడుతుంది. ఈ ఆలయం దాదాపుగా 2500 సంవత్సరాల క్రితం నిర్మించిందని చెబుతారు.

నరముఖ గణపతి:

tamilnaduతమిళనాడు రాష్ట్రంలో, తిలతర్పణపురి అనే గ్రామంలో స్వర్నవల్లి సమేత ముక్తీశ్వారర్ ఆలయం ఉన్నది.ఇక్కడ వెలసిన వినాయకుడు తొండం లేకుండా మానవ రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. ఈవిధంగా వెలసిన గణపతిని నరముఖ గణపతి లేదా ఆది వినాయకర్ గణపతి అని చాలా ప్రసిద్ధి చెందినది. ఈవిధంగా వినాయకుడు మానవ రూపంలో దర్శనమిచ్చే ఏకైక ఆలయం ఇదేనని చెప్పవచ్చు.

రామేశ్వరం:

tamilnaduతమిళనాడు రాష్ట్రంలోని రామనాథపురం జిల్లాలోని రామేశ్వరంలో ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన రామేశ్వర లింగం ఇక్కడ ఉంది. ఈ ఆలయంలో రెండు శివలింగాలు ఉండగా, రామసేతు సైన్యం ఇక్కడే ప్రారంభం అయిందని స్థలం పురాణం చెబుతుంది. రామేశ్వరం శైవులకు, వైష్ణవులకు పుణ్యక్షేత్రం. రామేశ్వరం ద్వీపంలో అనేక తీర్థాలున్నాయి. రామనాథస్వామి ఆలయంలోనే 22 తీర్థాలున్నాయి. వీటిలో స్నానం చేయడం ఎంతో పుణ్యదాయకమని ఆలయచరిత్ర పేర్కొంటుంది. ఈ తీర్థాలు చిన్న చిన్న బావుల్లాగా వుండటం విశేషం. ఈ జలాలతో పుణ్యస్నానం చేస్తే తపస్సు చేసిన ఫలం వస్తుంది. అయితే ఈ బావుల్లో నీరు అనేది ఎప్పుడు ఉండటం విశేషం. ఈ ఆలయం బయట నుంచి కొంతదూరంలోనే సముద్రతీరం కనిపిస్తుంది. ఇక్కడ అలలు లేకుండా ప్రశాంతంగా వుండటం విశేషం. కాశీ యాత్రకు వెళ్లి అక్కడి గంగాజలాలను తీసుకువచ్చి రామేశ్వరంలోని సముద్రంలో కలిపితే కానీ కాశీయాత్ర పూర్తిచేసినట్టు అని పెద్దలు పేర్కొంటారు.

శనిగ్రహ దేవాలయం:

tamilnaduతమిళనాడు రాష్ట్రం, తంజావూరు జిల్లా, తిరునల్లూరు అనే గ్రామంలో శనిగ్రహ దేవాలయం ఉంది. ఈ ఆలయం చాలా పురాతనమైన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడే నలమహారాజుకు శని పట్టుకొని పీడించడం ప్రారంభించాడని పురాణం. ఇక్కడకి నల తీర్థంలో స్నానం చేస్తే సర్వపాపాలు హరించుకుపోతాయని భక్తుల నమ్మకం. ఇక్కడ దేవాలయాన్ని దర్శించినప్పుడు భక్తులు దర్భల కొసలు ముడివేస్తారు. ఇలా ముడివేస్తే తమ కష్టాలన్నీ గట్టెక్కుతాయని భక్తుల నమ్మకం.

మహాబలిపురం:

tamilnaduతమిళనాడు రాష్ట్రం, కాంచీపురం జిల్లాలో మహాబలిపురం కలదు. అయితే 7 వ శతాబ్దంలో నిర్మించిన ఏకశిలా రథాలు పాండవుల రథలంటారు. ఈ ఐదు రథాల్లో నాలుగు ఏకశిలలతో నిర్మించబడినవి. పల్లవుల కళా నైపుణ్యానికి వీటిని ప్రతీకలుగా చెబుతారు. దక్షిణభారతదేశంలోనే పురాతనమైన ఆలయం షోర్ టెంపుల్. ఇది 8 వ శతాబ్దంలో ద్రావిడులు శైలిలో నిర్మించబడింది. ఇక్కడ గణేశుడి గుడి కూడా చక్రాలతో కూడిన రాతి రథంగా మలచబడి ఉంటుంది.

శ్రీ వరదరాజస్వామి ఆలయం :

తమిళనాడు

తమిళనాడు రాష్ట్రంలోని, కాంచీపురం జిల్లా, విష్ణుకంచి ప్రాంత మందలి కరిగిరి అను ఎత్తైన గుట్ట మీద శ్రీ వరదరాజస్వామి ఆలయం ఉంది. 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో ఇది ఒకటి. సిద్ధాంతకర్త రామానుజులు ఈ ఆలయంలోని నివసించారని చెబుతారు. ఈ దేవాలయం 23 ఎకరాల సముదాయంలో ఉంది. ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ బంగారు, వెండి బల్లులు కలవు. ఈ దేవాలయంలో వెయ్యి స్థంబాల మండపం ఉంది. ఇక్కడ ఆనంద సరోవరం మధ్యలో ఉన్న మండపంలో నీటిలోపల అత్తి చెక్కతో చేయబడిన అత్తి దేవత మూర్తి విగ్రహం ఉంది. ప్రతి 40 సంవత్సరాలకు ఒకసారి కోనేరులో నుంచి తీసి 48 రోజులు దర్శనానికి అనుమతి ఇస్తారు.

బృహదీశ్వరాలయం – తంజావూరు:

tamilnaduతమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు లో ఈ బృహదీశ్వరాలయం ఉంది. ఇక గర్బాలయంలో ఉన్న శివలింగం అధ్భూతంగా పూర్తిగా నల్ల రాయితో చేయబడిన పదహారడుగుల ఎత్తు 21 అడుగుల కైవారం కలిగి చూడటానికి ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. ఈ స్వామికి అభిషేకం చేయడానికి విగ్రహం పక్కనే ఎత్తుగా కట్టబడిన మెట్లు ఉన్నాయి. ఈ శివలింగ విగ్రహాన్ని చెక్కిన శిలకోసం ఎన్నో చోట్ల వెతికి చివరకు నర్మదానదీ గర్భములో నుండి సంపాదించినట్లు తెలుస్తుంది. ఈ శిలను వెలికి తీసి శివలింగంగా చెక్కి తీసుకురావడానికి రాజరాజ చక్రవర్తి తానే స్వయంగా దగ్గర ఉండి 64 మంది శిల్పులతో ఆ శిలని శివలింగంగా మలిచి ఏనుగుల చేత మోయించుకొని వచ్చాడంటా. ఇంకా తమిళనాడు రాష్ట్రంలో ఎన్నో అతి పురాతన ఎన్నో విశేషాలు గల అద్భుత ఆలయాలు ఉన్నాయి.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR