ఆంధ్ర మాత గోంగూర. గోంగూరతో చేసే పచ్చడి ప్రతి ఒక్కరికీ ఇష్టం. ఆ పచ్చడిని ఇంటి దగ్గరే ఎంతో రుచిగా చేసుకోవచ్చు. పచ్చడి తయారీకి కావాల్సిన పదార్ధాలు..

1.గోంగూర : మూడు కట్టలు (500 గ్రాములు)
2.నూనె : 3 టేబుల్ స్పూన్లు
3.జీలకర్ర : 25 గ్రాములు
4.ధనియాలు : 100 గ్రాములు
5.ఎండు మిరపకాయలు : 15
6.వెల్లుల్లి రెబ్బలు : 10
7.ఆవాలు : ఒక టీ స్పూన్
8.పచ్చిశనగ పప్పు : ఒక టేబుల్ స్పూన్
9.మినపపప్పు : ఒక టీ స్పూన్
10.ఇంగువ : ఒక టీ స్పూన్
11.ఉప్పు : తగినంత
12.కరివేపాకు : రెండు రెమ్మలు
తయారు చేసే పద్ధతి :
గోంగూర ఆకుల్ని శుభ్రంగా కడగాలి. బాణలిలో ఒక టీ స్పూన్ నూనె వేసి గోంగూర ఆకుల్ని ఉడికించుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. తర్వాత అదే బాణలిలో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ధనియాలు, ఎండు మిరపకాయలు, వెల్లుల్లి, వేయించి చల్లారాక రుబ్బుకోవాలి. గోంగూర ఆకుల్ని, ఉప్పు కూడా వేసి రుబ్బుకోవాలి. బాణలిలో నూనె వేడిచేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపపప్పు, ఎండు మిరపకాయలు, ఇంగువ, కరివేపాకు వేసి తాలింపుపెట్టి గోంగూర మిశ్రమంలో కలపాలి.
గోంగూరలో ఐరన్, విటమిన్స్ తో పాటు యాంటీయాక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. సో వారంలో ఒకసారైనా గోంగూర పచ్చడి తప్పకుండా తినండి.