ఏ రాశి వారికి ఎటువంటి ఉద్యోగాలు మంచి ఫలితాలను ఇస్తాయి? 

మనందరం మన వ్యక్తిత్వాల గురించి, కొన్ని సందర్భాల్లో మనం ఎలా ప్రవర్తిస్తామనే దాని గురించి కొంతలో కొంతైనా తెలుసుకోగలుగుతున్నామంటే దానికి కారణం మన పూర్వీకులు మనకి ఇచ్చిన జ్యోతిశ్శాస్త్ర విజ్ఞానమే. ప్రతి రాశికీ ఒక సూచిక ఉంటుంది. ఈ సూచిక ఆ రాశి లో జన్మించిన వారి లక్షణాలను కొన్నైనా తెలియపరిచేటట్లుగా ఉంటుంది. జన్మ రాశిని బట్టి ఏ వృత్తిలో రాణిస్తారో తెలుసుకొని ముందు అడుగు వేస్తె మంచి ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం…
  • మేషరాశి :

ఈ రాశిలో జన్మించిన వారు చాలా హుషారుగా, చురుకుగా ఉండటమే కాకూండా పట్టుదల ఎక్కువగా ఉంటుంది. వీరు చేసే పనిలో ఛాలెంజ్ ఉండాలని కోరుకుంటారు. అందువల్ల ఈ రాశివారు రాజకీయాలు, మిలట్రీ, పోలీస్, పారిశ్రామిక వేత్తలుగా బాగా సక్సెస్ అవుతారు. ఈ రాశి లో జన్మించిన వారు కష్టపడే తత్వం మరియు విలాసవంతమైన జీవితం గడుపుతారు. అంతే కాదు వీరు అందంగా ఉంటారు.
1
  • వృషభ రాశి :

ఈ రాశికి సూచిక ఎద్దు. ఈ రాశి వారికి పట్టుదల ఎక్కువ. బాగా ఆవేశపూరితంగా ఉంటారు. వీరితో జాగ్రత్తగా ఉండాలని మిగిలిన వారు అనుకుంటూ ఉంటారు. వీరు మానసికంగా కూడా చాలా బలమైన వారు, ఎలాంటి కష్టమైన పనినైనా తేలికగా చేసేయగల సామర్థ్యం ఉన్నవారు. ఎద్దుని సంతానోత్పత్తి సామర్ధ్యానికి కూడా ప్రతీక చెబుతారు. వీరు ఇంటీరియర్ డిజైనర్స్‌, చెఫ్‌, ఫ్యాషన్‌ డిజైనర్స్‌ లాంటి వాటిల్లో బాగా రాణింపు మరియు గుర్తింపు ఉంటుంది.
2
  • మిధున రాశి :

ఈ రాశివారు చాలా స్నేహపూర్వకంగా అందరితో బాగా కలిసిపోతారు. వీరిలో చాలా టాలెంట్,తెలివి ఉండటం వల్ల వీరి మనస్తత్వాన్ని బట్టి టెక్నికల్‌, మార్కెటింగ్‌, సేల్స్‌ జాబ్స్‌ లో బాగా రాణించగలరు. ఎందుకంటే వీరు అందరితో స్నేహంగా ఉండటం వల్ల ఈ రంగాలలో బాగా రాణిస్తారు.
3
  • కర్కాటక రాశి :

ఈ రాశికి సూచిక పీత. వీరి మనస్తత్వం కూడా అలాగే ఉంటుంది. పీతకి పైన గట్టి పెంకులా ఉంటుంది, అలాగే ఈ రాశిలో జన్మించిన వారు కుడా ఎవరినీ అంత త్వరగా వారి జీవితం లోకి ఆహ్వానించరు, రానివ్వరు. వీరు అవతలి వారిని ఎంతో జాగ్రత్తగా విశ్లేషిస్తారు. వీరికి దగ్గరైతే కానీ వీరు ఎంత మృదు హృదయులో ఎవరికీ అర్ధం కాదు.  ఈ రాశివారు జాగ్రత్త మరియు ఎమోషనల్ గా ఉంటారు. ఏ సమస్య వచ్చిన నైపుణ్యంతో సాధిస్తారు. అందువల్ల ఈ రాశివారు టీచింగ్‌ ఫీల్డ్‌, సైకాలజిస్ట్‌, సామాజిక కార్యకర్తలుగా బాగా సక్సెస్ అవుతారు. అంతేకాక ఈ రంగాలలో మంచి పేరు సంపాదిస్తారు.
4
  • సింహరాశి :

సింహరాశి లో జన్మించిన వారు మంచి పర్సనాలిటీ కలిగి ఉంటారు. వీళ్ళ పర్సనాలిటీకి తగ్గట్టుగానే కెరీర్‌ కూడా చక్కగా ఉంటుంది. వీళ్ళ మనస్తత్వాన్ని బట్టి సీఈవో, మేనేజర్స్‌, గవర్నమెంట్‌ అడ్మినిస్ట్రేటర్స్‌ లాంటి విభాగాలలో మంచి గుర్తింపు వస్తుంది. అందుకే ఇలాంటి రంగాలలో జాబ్స్‌ ట్రై చేయండి.
5
  • కన్యారాశి :

ఈ రాశిలో జన్మించిన వారు చాలా లాజికల్‌ గా ఆలోచిస్తారు. అందువల్ల ఈ కన్యారాశి వాళ్ళకు  ఎడిటింగ్‌, రైటింగ్‌, పరిశోధన, లెక్కల విభాగాలకు సంబంధించిన జాబ్స్‌ బాగా సెట్ అవుతాయి. ఎందుకంటే వీళ్ళు ఏ విషయాన్ని అయినా డీప్‌ గా ఆలోచించి అర్ధం చేసుకుంటారు. అందుకే ఈ రంగాలలో వీరికి చాలా మంచి భవిషత్తు ఉంటుంది.
6
  • తులారాశి :

తుల రాశిలో జన్మించిన వారు ఎవరు ఏమి చెప్పిన విసుగు లేకుండా వినటమే కాకుండా ఎదుటి వారి ఆలోచనలను పసిగట్టే తెలివి కలిగి ఉంటారు.
అందువల్ల ఈ రాశి వారు లాయర్స్‌ గా సెటిల్‌ అయితే మంచి భవిష్యత్తు ఉంటుంది. విలేకరులుగా కూడా మంచిగా రాణించగలరు.
7
  • వృశ్చికరాశి :

వృశ్చికరాశి వాళ్ళు ప్రతి విషయాన్ని చాలా డీప్‌ గా ఆలోచిస్తారు. వీళ్ళు చాలా స్వతంత్రంగా మరియు స్మార్ట్ గా ఉంటారు. అలాగే నిజాయితిగా ఉంటారు.
వీళ్ళ మనస్తత్వం బట్టి వీళ్ళు సిఐడి, డిటెక్టివ్‌, సర్జన్‌, డాక్టర్‌ వంటి రంగాలను ఎంచుకుంటే మంచి విజయం సాధిస్తారు.
8
  • ధనస్సు రాశి :

ధనస్సు రాశిలో జన్మించిన వారు చాలా ప్రశాంతంగా మరియు ఆధ్యాత్మిక విషయాలమీదే ఆలోచనలు ఉంటాయి. వీరు ఎక్కువగా ప్రయాణాలు చేయటానికి ఇష్టపడతారు. వీళ్ళు ఇతరులను బాగా ప్రేరేపించగలరు అందువల్ల కోచింగ్‌ ఇవ్వడానికి, మంత్రులుగా, ఫిలాసఫర్లుగా, టీచర్స్‌ ఇలాంటి రంగాలలో విజయం సాధించగలరు.
9
  • మకర రాశి :

ఈ రాశికి సూచిక కొమ్ములున్న మేక. వీరు అంత క్రియాశీలకంగా ఉండరు కానీ దృఢ నిర్మాణం కలవారు. వీరి లక్ష్య సాధన కోసం వీరు ఎంతో శ్రమిస్తారు, అందుకు ఎంత సమయం పట్టినా నిరాశ చెందరు, వెనుకడుగు వేయరు. వారి విజయానికి దారి చూపే ప్రక్రియలందు విశ్వాసం కలవారు. ఈ రాశి వారు సవాళ్ళను ఎదుర్కొని వాటిని సాల్వ్ చేస్తే చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. విభిన్నమైన మనస్తత్వం కలిగి ఉంటారు.
వీరు చాలా తెలివిగా అలోచించి దేనిని అయినా విభిన్నంగా మార్చుకుంటారు. అందువల్ల ఈ రాశి వారు  ఐటి, బ్యాకింగ్‌, మెడిసన్‌ రంగాలను ఎంచుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది.
10
  • కుంభ రాశి :

ఈ రాశికి సూచిక నీరు తీసుకు వస్తున్న వ్యక్తి. ఈ ప్రతీక స్వచ్చతని సూచిస్తుంది. అలాగే గతం లో బతకడం మంచిది కాదనీ, ఎప్పుడూ ముందడుగు వేయాలనీ కూడా ఈ సూచిక చెబుతుంది. ఈ రాశిలో జన్మించినవారు అలాగే ఉంటారు. వీరు ప్రగతిశీల ఆలోచనలు కలవారు. ఈ రాశి వారు ప్రతి విషయాన్నీ చాలా లోతుగా అలోచించి అసలు విషయాన్ని రాబట్టటంలో సిద్దహస్తులు. అందువల్ల ఈ రాశి వారు సైంటిస్ట్ అయితే బాగా రాణిస్తారు. అదే విధంగా ఏరోనాటిక్స్‌, ఆస్ట్రానమీ, ఆర్గానిక్‌ వంటి రంగాలలో మంచి ఫలితాలను చవిచూస్తారు.
11
  • మీనరాశి :

మీనరాశి లో జన్మించిన వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడూ ఎదుటి వాళ్ళకు సహాయపడాలనే ఆలోచిస్తుంటారు. వీళ్ళు చాలా క్రియేటివిటీ కలిగి, స్టైలిష్‌ గా ఉంటారు. వీళ్ళు యాక్టర్స్‌ గా సెటిల్‌ అయితే జీవితం బాగుంటుంది.
12

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,750,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR