గూగుల్ వెంకటేశ్వర స్వామి ఆలయం!!!

భక్తులు కోరిన కోరికలు తీర్చే కొండంత దేవుడు ఆ వెంకన్న స్వామి. ఈ స్వామిని ఏడుకొండలవాడని, గోవింధుడని, బాలాజీ అని, తిరుమలప్ప అని, వెంకటరమణుడని, మలయప్ప అని ఇలా ఎన్నో పేర్లతో ఆప్యాయంగా పిలుచుకుంటారు. అయితే శ్రీవేంకటేశ్వరస్వామి కుబేరుని దగ్గర తీసుకున్న అప్పు తీర్చలేక ఇక్కడ కొండపైన కొన్ని రోజులు ఉన్నాడని స్థల పురాణం. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ స్థలపురాణం ఏంటనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

gubulu venkateshwara swamyప్రస్తుత కాలంలో అప్పులు లేని వారు ఎవరూ ఉండరు. ఈ విధంగా అప్పులతో ఎంతో మంది ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు.

తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల కారణంగానే చాలామంది అప్పులు చేస్తుంటారు. మరి మన ఆర్థిక ఇబ్బందులను తొలగించే మనకు అప్పులు తీర్చమని చాలామంది ఆ దేవతలను వేడుకుంటారు.

ఈ విధంగా అప్పులు సమస్యతో బాధపడేవారు గుబులు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శిస్తే వారి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పవచ్చు. హైదరాబాద్ వరంగల్ హైవే చిల్పూరు గుట్టలో వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది.

gubulu venkateshwara swamyఈ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని గూగుల్ వెంకటేశ్వర స్వామి ఆలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో స్వామివారిని దర్శిస్తే వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు.

ఈ ఆలయంలో ఉన్నటువంటి అఖండ దీపంలో నూనే వేసి దీపం వెలిగిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగి పోయి రుణబాధలు తీరుతాయని భావిస్తారు. అసలు ఈ ఆలయాన్ని సందర్శిస్తే అప్పులు ఏవిధంగా తీరుతాయనే విషయానికి వస్తే. పురాణాల ప్రకారం వెంకటేశ్వర స్వామి తన వివాహాన్ని అంగరంగ వైభవంగా జరుపుకోవడం కోసం కుబేరుని వద్ద తీసుకున్న విషయం మనకు తెలిసిందే.

gubulu venkateshwara swamyఅయితే ఆ అప్పులు తీర్చలేక వెంకటేశ్వరస్వామి ఎంతో గుబులుగా చింత చేస్తూ చిల్పూరు గుట్టకి వచ్చి అక్కడ గుహలో కుబేరుడి అప్పు తీర్చలేకపోయానన్న బాధతో తపస్సు చేశారని పురాణాలు చెబుతున్నాయి. ఈ విధంగా స్వామివారు అప్పు తీర్చలేక గుబులుతో ఇక్కడ ఉండటం వల్ల ఇక్కడ వెలిసిన ఎటువంటి స్వామివారిని గుబులు వెంకటేశ్వర స్వామి అని పిలుస్తారు.

gubulu venkateshwara swamyఈ కొండకు స్వామివారు వచ్చినప్పుడు కొండ కింద భాగంలో స్వామివారి పాదాల గుర్తులు ఏర్పడ్డాయి. ఈ విధంగా స్వామివారి పాదాలు ఉన్నచోటును పాదాల గుండు అనే పేరుతో పిలుస్తారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,590,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR