Gudilo Bhuthu bommalu undatam venuka kaaranam enti?

0
7710

దేవాలయం అంటే పవిత్రమైనది మరి దేవాలయం గాలిగోపురం మీద వివిధ భంగిమల్లో శృంగార శిల్పాలు ఉండటం ఏమిటి? చూసే వారికి అసభ్యంగా ఉండదా? అని అనుమానం మనకందరికీ ఎప్పుడొకసారి కచ్చితంగా వచ్చే ఉంటుంది. మరి దేవాలయాల్లో ఆ భూతు బొమ్మలు అలా ఉండటం వెనుక కారణాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.templeప్రస్తుతం కొత్తగా నిర్మించే దేవాలయాలకి భూతు బొమ్మలు అనేవి ఏం ఉండవు. పురాతన కాలంలో నిర్మించిన ఆలయాలలోనే ఈవిధంగా ఉంటాయి. అయితే ఆ కాలంలో ఆలా నిర్మించడానికి కొన్ని అప్పటి కారణాలు అనేవి ఉన్నాయని కొన్ని పురాణాలూ చెబుతున్నాయి. ఆ విషయాలను ఇప్పుడు చూద్దాం. templeపురుషుడైన ప్రతివాడు ధర్మ- అర్ధ – కామ- మోక్ష అనే చతుర్విధ పురుషార్దలను తప్పక సాధించుకోవాలని ఖచ్చిత నియమం ఉండేది. మొదటిదిగా ధర్మసాధన చెయ్యాలి అంటే చదువుకోవడంకాని, వృత్తి విద్య నేర్చుకోవడం కానీ చెయ్యాలి. రెండోవది ధనాన్ని సంపాదించాలి. మూడవది వివాహం చేసుకొని ఎక్కువ మంది పిల్లల్ని కనాలి. పూర్వకాలం లో సంతానమే సంపదగా ఉండేది. ఎక్కువ సంతానం ఉన్నవారికి సమాజంలో ఎక్కువ గౌరవం ఉండేది. templeనాల్గవది చివరిగా మోక్షమార్గం అనుసరించి జీవితం ముగించాలి. ఈ నాల్గింటిని పుణ్య పురుషార్దాలు అంటారు. మనిషికి ఈ నాలుగు పురుషార్దాలు అవసరమే అని అప్పటిలో గట్టిగా విశ్వసించి జీవించేవారు.templeమన పూర్వికుల జీవితం మన జీవితంలాగా అతివేగంగా ఉండేది కాదు. నిశ్చలంగా, నిర్మలంగా ఉండేవారు. చాలామంది కి ప్రతిరోజూ దేవాలయాలకి వెళ్ళి రావడం వాళ్ళ దినచర్య గా ఉండేది. పెద్దవాళ్ళతో పాటుగా యుక్త వయస్సు ఉన్నవారు కూడా దేవాలయాలకు ప్రతిరోజూ వెళ్లి రావడం పరిపాటిగా ఉండేది. 5 gudilo bhuthu bommalendhukuశృంగారం పాపకార్యం కాదు. సృష్టి కి మూలం శృంగారమే. భార్యతో కూడిన సృష్టి కార్యం పవిత్ర ధర్మం. అప్పట్లో పెళ్ళైన వారికి లైంగిక జీవితం గురించి తెలుసుకోవడానికి ఏ మార్గము ఉండేవి కావు అందుకే దేవాలయంలో ఉండే బొమ్మలను చూపించేవారు. వాత్స్యాన గ్రంధాల గురించి చెప్పేవారు. ఆనాటి లైంగిక బంధాలు సంతానోత్పత్తి కోసం పవిత్రంగా ఉండేవి. 6 gudilo bhuthu bommalendhukuఈ విధంగా దేవాలయాల మీద బూతు బొమ్మలు శృంగారం పాపవృత్తి కాదని పవిత్రమైనదని తెలియచెప్పడం దీని ఉద్దేశం.7 gudilo bhuthu bommalendhuku