These Short Stories By Gunnam Gangaraju About ‘Amrutham & Anji’s Character’ Is The Best Thing You’ll Read Today

Little Soldiers nundi Amrutham…ippudu Amrutham Dvithiyam tho mana 90’s kids nostalgia venaka munna person Gunnam Gangaraju garu. Ivi matrame kakunda Aithe, Anukokunda Oka Roju, Amma Cheppindi lanti movies produce chesina versatile producer iyana. Amrutham tho patu Nanna, Ammamma.com lanti some noted serials Just Yellow banner paina produce chesaru.

Aithe only producer gane kakunda ‘https://theuncommonman.org/’ ane blog dwara tana anubavalau, alochanalu, ideologies anni ee blog dwara share chesukuntaru. Amrutham 2 serial reviews gurinchi twitter lo search chestunna naku Gangaraju ee blog dwara ‘Amrutham’ and Amrutham lo Anji gari gurinchi raasina konni short stories chadivaka chala manchiga anipinchindi.

Mari ‘Amrutham’ serial andulo characters nacchinana vallu definite ga ee short stories chadalsindhe.

1. గుండు — ఎప్పటికీ తెలుగు గుండెల్లో !

1 Gunnam Gangaraju2001 లో హనుమంత రావు గారు ఒక మరపురాని పాత్రకు ప్రాణం పోసారు.
అంజి గా ఖచ్చితంగా ఆయనే బాగుంటాడని చందు (యేలేటి) చెప్పాడు. నేను ఊహించలేదు అప్పుడు, అది ఎంత గొప్ప ఎంపికో! గుండు హనుమంత రావు గారు అంజి గా చేసిన తీరు మా అందరికీ మరింత ఉత్సాహం ప్రేరణ ఇచ్చింది — వారం వారం ఒక కొత్త కథ వ్రాయటానికి. ఆ ఇంధనం మమ్మల్ని మూడు వందల వారాలు నడిపింది.

కొన్ని నికృష్టమైన కారణాల వల్ల అమృత రావు పాత్ర లేకుండా ఎపిసోడ్లు చెయ్యాల్సివచ్చింది. ఆ సమయం లో మూడు నెలలు అంజి పాత్రే సీరియల్ ని మోసింది.
పేరు అమృతమైనా కధ అంజి గురించే — ఆంజనేలు వేసే పథకాలు, చేసే ప్రయోగాలు, పడే ప్రయాసలు. ఎన్ని సార్లు క్రింద పడ్డా ఆకాశానికి నిచ్చెనలు వేస్తూనే వుండేవాడు. ఇప్పుడు అకస్మాత్తుగా ఆ నిచ్చెనెక్కి ఆకాశం లొకి వెళ్ళిపోయాడు. అంజి అమృతం తాగకపోయినా, అందించిన అమరుడు.

– Gunnam Gangaraju

2. అమృతం మళ్ళీ చిలుకుతున్నాం

2 Amruthamఇన్నాళ్ళెందుకు పట్టింది? ‘అమృతం’ మళ్ళీ వార్చటానికి? పలు కారణాలు: అలసట, ఆలోచనలు అడుగంటటం, అనుమానం (మునుపటిలా ప్రేక్షకులని మెప్పించగలమా). ఇవ న్నీ అధిగమించినా, ఆచరణలొ పెట్టడానికి అవసరమైన, లేని, పెట్టుబడి కొండంత కనిపించింది..ఎలాగైతేనేం, ఇన్నాళ్ళకి అన్నీ సమకూరాయి, అందరూ కలిసి వచ్చారు; మనందరికీ దూరమైపోయిన గుండు హనుమంత రావు గారు, దేవదాసు కనకాల గారు తప్ప. అది తీరని లోటే. ఐనా సాహసించి, వారి జ్ఞాపకాలతో, మీ అందరి ఆదరణ తో ముందడుగు వేస్తున్నాం — ద్వితీయం లోకి — అమృతం ద్వితీయం !

3. అమృతం ద్వితీయం పాట

ఫిబ్రవరి 2001 లో మొదలైంది, అమృతం పాట కాగితం మీద పెట్టే పని. ఎన్ని సార్లు ఎన్ని ఆలోచనలు, అమరికలు రాసి-కొట్టేసి-రాసిందో సీతారామ శాస్త్రి కలం. అరేబిఅయా బావి లో చమురు లాగ ఆ కలం లో సిరా బోలుడంత, కాని సంతృప్తి ఎడారి లో నీటి బొట్టంత. ఎలాగైతే, అక్టోబర్ చివర్లో ఆ కర్కస కలానికి కనికరం, తృప్తి కలిగాయి. కాని చదవటానికి నేను ఊళ్ళో లేను. సీతారామ శాస్త్రి కి ఉత్సాహం ఆగలేదు. హిమాచల్ లో వున్న నాకు ఫోన్ చేసి పొగలు కక్కే పాట వినిపించాడు.
పంతొమ్మిది సంవత్సరాల తర్వాత, నేను ఊళ్ళోనే వున్నా, నాకు మళ్ళీ ఫోన్ చేసాడు. మార్చ్ 16 అర్ధరాత్రి, అదే ఉత్సాహం తో. అమృతం ద్వితీయం పాట పాడి వినిపించాడు.

మంచి పాటలు చేవిలోకే కాదు, గుండెలోకి వెళ్తాయి. సీతారాముడి పాట డైరెక్ట్ గా శంఖం లోకి పారుతుంది

4. About Mahanti Movie !

3 Mahanati‘మహానటి’. ‘ఓ సీత కథ నుంచి ఒకే వొక సావిత్రి కథ వరకు కూర్చిన ‘వైజయంతి’మాల లో ఇది ఎప్పటికీ మెరిసే ఆణిముత్యం.
ఇలాంటి అనుభూతి అపూర్వం. తెలుగు సినిమాకు తరతరాలు తరగని సంపద అందించిన ఎందరో దిగ్గజాల తో మూడు గంటలు సన్నిహితంగా గడిపాం. కె.వి. రెడ్డి, ఎల్.వి. ప్రసాద్, చక్రపాణి, బి.నాగి రెడ్డి, సింగీతం, పింగళి, ఎన్.టి.ఆర్., ఏ.ఎన్.ఆర్., ఎస్.వి.ఆర్ — వీరి మధ్య అన్ని దిక్కులు మిరిమిట్లు గొలిచేలా వెలిగిన అపురూపమైన తార; సావిత్రి.

తెరపై సావిత్రి అందరికీ తెలుసు; తెరవెనుక సావిత్రి మనకి పరిచయభాగ్యం లేదు. ఇన్నాళ్ళకి, ఈ మహా మనిషి తో ఆమె పసితనం నుంచి ప్రయాణించాం… చివరి దశ వరకు. ఈ కనిపించని జీవితానికి కీర్తి సురేష్ రూపం ఇచ్చింది. కేవలం బాహ్య రూపం కాదు. ఒక గొప్ప శిల్పి శిల్పం చెక్కితే ఏది ప్రతిమ, ఏది నిజ స్వరూపం తెలియదంటారు. కీర్తి, సావిత్రి గా తన ఆత్మను చెక్కుకుంది.
సావిత్రి పాత్ర పరిచయం తోనే ఆకట్టుకోబడతాం. ఒక కంటినుంచి మాత్రమే మూడు కన్నీటి బొట్లు రాల్చడం. అక్కడ విస్తుపోయి చూసి చప్పట్లు కొట్టిన యూనిట్ లాగే మనకీ తియేటర్ లో నించుని తప్పట్లు కొట్టాలనిపిస్తుంది. కాని, ఆ కథ ముగింపు వరకు ఎన్నో సంధర్భాల్లో గుండె లో పొంగివచ్చే వరద బయటకు పారటానికి రెండు కళ్ళూ చాలవనిపిస్తుంది. ఒక హాలీవుడ్ తార (సూసన్ హేవర్డ్) సావిత్రి కి ప్రగాఢ అభిమానై, ఆమె ప్రతిభ ప్రపంచం లోనే అసామనమని పొగుడుతూ లేఖలు రాసిన సంఘటన కూడా చేర్చి వుంటే ఇంకెంతో ఉత్తేజంగా వుండేదేమో. పారే కన్నీటి లో ఆనంద భాష్పాలు సంగమించేవేమో.

సూటి గానే, కాని సరళంగా చిన్న మాటలతోనే పెద్ద అర్ధాలు పలికించిన సాయి మాధవ్, 1980’స్ కాదు, 1950-60’స్ ఈ కథ హీరో అని చూపించిన ఛాయాగ్రహకుడు, దుస్తులు, మొత్తంగా నిర్మాణ రూపకల్పన — అన్నీ, అందరూ అలనాటి ప్రపంచాన్ని సృష్టించారు. సినిమా ఐపోయాకా, ఇంటర్వెల్ లో కూడా, ఆ వాహిని లోంచి బయటకు రావాలనిపించలేదు.
ఇలాంటి ఊహ రావటం, ఆ ఊహను ఊహాతీతంగా తీయగల ప్రతిభ దర్శకుడికి వుండటం, ఆ కలని ఎన్ని రోజులు పట్టినా, ఎంత ఖర్చైనా, ‘హీరో’ లేకపోయినా వెనకంజ వెయ్యకుండా సాకారం చెయ్యగల నిర్మాత వుండటం — అద్భుతం. ఇలాంటి దర్శక-నిర్మాత యుగళ గీతం సాగినన్నాళ్ళూ సినిమాల్లో మేజిక్ వుంటూనే వుంటుంది.
‘మహానటి’ మొన్నటి వరకు సావిత్రి కి బిరుదు; ఇప్పటినుంచి అశ్విన్ కి కిరీటం కూడా.

5. About C/o Kancharapalem Movie !

4 Care Of Kanchrapalemకంచరపాలెం, కేర్ ఆఫ్ మహా మహిమ
ఈ స్వచ్చమైన తెలుగు మట్టి లొని మాణిక్యం గురించి ఎంతైనా చెప్పొచ్చు. కాని ఏమి రాసినా చూడబోయే వాళ్ళ అనుభవం, ఆనందం, ఆశ్చర్యం పాడుచేసినట్టవుతుంది. కొన్నేళ్ళ క్రితం, ‘అ వెన్స్ డే’ హిందీ సినిమా చూసినప్పుడు అనిపించింది, ‘ఆహా, ఇలాంటి ఐడియా నాకు తట్టుంటే గాలి లో తేలేవాడిని’ అని. ఇన్నాళ్ళకు, ఈ సినిమా చూసాకా మళ్ళీ అలా అనిపించింది. ఈ ఆణి ముత్యాన్ని అందించి, గుండెనుప్పొంగించిన అందరికీ నా ధన్యవాదాలు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,730,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR