గురివింద గింజలు లక్ష్మీదేవి స్వరూపాలని తెలుసా?

సాధారణంగా గురివింద గింజల గురించి సామెత విని ఉంటాం.. గురువింద గింజ తన కింద నలుపు ఎరుగదని శాస్త్రం.  ఎవరైనా గొప్పలు చెప్పుకొని ఎదుటి వాళ్ళను అవమానించే వాళ్ళను గురువింద గింజలతో పోలుస్తారు. అయితే ఈ గురివింద గింజలని లక్ష్మి స్వరూపాలుగా చెప్తున్నారు పండితులు.. మరి ఎందుకా ప్రాముఖ్యత మనం ఇపుడు తెల్సుకుందామ్..

Guravinda Ginjaaగురువింద గింజలను గౌడియ వైష్ణవులు  సాలగ్రామ పూజలో తప్పనిసరిగా ఉపయోగించేవారు. . వీరు ఈ గింజలను రాధా రాణి యొక్క  పాద ముద్రలుగా పూజించేవారు. ఇక తమిళ సిద్ధులు గురువింద గింజలను పాలల్లో మరగబెట్టిన తరువాత అధిక ఉష్ణోగ్రతలో ఉంచినప్పుడు దానిలో ఉన్న విష లక్షణాలు  కోల్పోయే విధంగా చేసి ఉపయోగించేవారు.  పూర్వ కాలంలో గురువింద గింజలను బంగారం తూకం వేయటానికి ఉపయోగించేవారు. బంగారం తూచి ఇన్ని గురువింద గింజల ఎత్తు అనేవారు. గురువింద గింజ ఆకులను కొంత సేపు నోట్లో వేసుకొని నమిలిన తరువాత ఒకచిన్న రాయిని నోట్లో వేసుకొని నమిలితే ఆశ్చర్యంగా ఆ రాయి సునాయసంగా నలిగి పిండి అయిపోతుందని పెద్దల చెప్తుంటారు… గురివింద ఆకుల పసరు తీయగా ఉంటుందని చెప్తారు.. ఆయుర్వేదం లో ఈ గింజలలోని పప్పును కొన్ని రకాల మానసిక రుగ్మతలకు వాడుతున్నారు. గురువింద గింజలు ఆరావళి పర్వత ప్రాంతాల యందు, భారతదేశంలోని కొన్ని ముఖ్యమైన అడవులలోను విరివిగా లభిస్తాయి.

Guravinda Ginjaaగురువింద గింజలను లక్ష్మీదేవి స్వరూపంగా కొలుస్తారు. ఈ గింజలను 8 లేక 11 చొప్పున తీసుకుని దీపావళి మరియు అక్షయతృతీయ పర్వదినాలలో ప్రత్యేకంగా పూజించి ఎరుపు గుడ్డలో కుంకుమతో పాటు ఉంచి బీరువాలోగాని, గళ్ళాపెట్టెలో గాని ఉంచినట్లయితే  ధనాభివృద్ధి, లక్ష్మీ కటాక్షంతో పాటు సుఖసౌఖ్యాలు కలుగుతాయి. ఈ గింజలు నరదృష్టి వలన కలిగే చెడు ప్రభావాలను తొలగిస్తాయని నమ్ముతారు… ఈగింజలు ఆకుపచ్చ, తెలుపు, ఎరుపు, నలుపు, పసుపు రంగులలో లభ్యమవుతాయి. వీటిలో ఎరుపు, నలుపు తప్ప మిగతా రంగులు బహు అరుదుగా లభిస్తాయి. తెలుపు రంగు గింజలు “శుక్రగ్రహ”దోష నివారణకు, ఎరుపు రంగు గింజలు “కుజగ్రహ” దోష నివారణకు, నలుపు రంగు గింజలు “శనిగ్రహ”దోష నివారణకు, పసుపు రంగు గింజలు “గురుగ్రహ దోష నివారణకు, ఆకుపచ్చ గింజలు బుధగ్రహ దోష నివారణకు ఉపయోగ పడతాయి. ఆయా గ్రహ దోషాలు ఉన్నవారు ఆయా రంగు గింజలను చేతికి “కంకణాలు” గాను, కాళ్ళకు “కడియాలు” గాను చేపించుకొని వాడిన గ్రహ దోషాలు నివారింపపడతాయని చెప్తారు. ఇలా దరించటం వలన గ్రహదోషాలే కాకుండా నరదృష్టి కూడా తొలగిపోతుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR