This Guy’s Experience Of Watching Gabbar Singh Benefit Show Will Take Back Us To Those Euphoric Days

0
430

Written By “Jayanth Deepala”

వైజాగ్ , May 2 , 2012

నేను ఇంటర్మీడియట్ చదువుతున్న రోజులు. ఎలాగో సెలవులు ఉండవు కాబట్టి రోజూ కాలేజ్ కి ఆటోలో వెళ్ళేవాడిని.

అప్పటికే ఆడియో రిలీజ్ ఫంక్షన్ అయ్యి పదిహేను రోజులు అయ్యింది అయినా సరే ఎక్కడ చూసినా , ఎవరితో మాట కలిపినా బండ్ల గణేష్ స్పీచు దానివల్ల పవన్ కళ్యాణ్ నవ్వుల గురించే మాటలు.

ట్రైలర్ చూస్తే మాత్రం పవన్ కళ్యాణ్ తన భక్తుడి చేత తన భక్తుల కోసం చించేసాడేమో అనిపించింది.

ఇక పాటల గురించి మాట్లాడేదే లేదు. అసలు చెవులు ఉన్నది ఆ పాటలు వినడానికి అన్నట్టే మా కార్ నుంచి మొదలు పెడితే , గాజువాక – కూర్మన్నపాలెం మధ్యలో వెళ్ళే ప్రతి ఆటోలో అవే పాటలు. అసలు ఒక ఆటో లో ” ఆకాశం అమ్మాయి అయితే ” పాట వినే లోపు పక్కన వెళ్ళే ఆటో లో ” పిల్లా నువ్వు లేని జీవితం ” , ఆ పక్కన టైటిల్ సాంగ్ వినడానికే ఆటోలో వూఫర్ సెట్ పెట్టించిన ఆటో అన్న. ఇలా ఆల్బమ్ అంతా యమ హిట్టు.

ఆ హెచ్.డి స్టిల్స్ వొచ్చిన దగ్గర నుంచి ప్రతి ఆటో ఆ కటౌట్లతోనే ముస్తాబు అయ్యాయి.

ఎంటన్నా ఇంత హంగామా అని నేను అంటే

” ఇది గబ్బర్ సింగ్ నెల తమ్ముడు ” అన్నాడు ఆటో అన్న.

ఇలా ప్రతి ఆటోలో , ప్రతి ఇంట్లో , ప్రతి ఫంక్షన్లో విడుదల అయిన రోజు నుంచి ఒక సంవత్సరం మొత్తం ఈ పాటల మోతే.

అలా నెల కాస్త ” గబ్బర్ సింగ్ సంవత్సరం ” అయ్యింది.

కొన్ని రోజుల్లో రిలీజ్ డేట్ రానే వచ్చింది , గాజువాక రోడ్డు , ప్రతి థియేటర్ దగ్గర అంతా ఇదే హంగామా. రిలీజ్ రోజు ప్రభంజనం అంటే ఏంటో చూసా నేను.

క్రేజ్ ఇలా ఉండగా , అది కూడా వైజాగ్ లో , అది కూడా పవన్ కళ్యాణ్ సినిమా , ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్లు సంపాయించాడంటే వాడు అదృష్టవంతుడనే చెప్పాలి.

వారం ముందు నుంచే అడ్వాన్స్ బుకింగ్ మొదలైతే మూడో వారం దాకా అన్ని షోల టిక్కెట్లు అయిపోయాయి. నా జీవితంలో అలాంటి అడ్వాన్స్ బుకింగ్ మోత చూడనేలేదు. టికెట్ కొంటే దాని మీద డేటు చూస్కోవాల్సిన పరిస్థితి అప్పుడు.

పరిస్థితి ఇలా ఉండగా , మాకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ ఫ్యాన్స్ ని బతిమిలాడి రెండో సారి సినిమా చూస్తున్న అంటే బెనిఫిట్ షో అయిపోయి అసలు మార్నింగ్ షో చూసే వాళ్ళ టిక్కెట్లు తీసుకొని మరీ మాకు అతికష్టం మీద మూడు టిక్కెట్లు ఇప్పించాడు.

అవును మరి , మా మమ్మీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ , నేనూ పంజా తో మొదలయ్యా , కాబట్టి మా ఇద్దరి డామినేషన్ వల్ల డాడీ కూడా ఆఫీస్ పోకుండా మార్నింగ్ షో కి మాతో వచ్చాడు అది కూడా ఆయనకి పాటలూ , ట్రైలరూ నచ్చి.

షో స్టార్ట్ అవ్వబోతుంది , లోపలికి వెళ్ళాం.

ఫుల్ హౌస్ అనడం కంటే ఫుల్ క్రౌడ్ అనడం కరెక్టేమో ఎందుకంటే మెట్ల మీద , దొరికిన సందుల్లో కుర్చీలు వేసుకొని మరీ ఉన్నారు జనం.

బొమ్మ పడింది. అప్పటికి నాకు తెలీదు ఈ బొమ్మ ఎప్పటికీ నిలిచిపోయ్యే బొమ్మ అవ్వుదని.

7 Gabbar Singhఅసలు రకరకాల గన్నుల బుల్లెట్ల లో నుంచి Pawan Kalyan’s గబ్బర్ సింగ్ అని టైటిల్ పడగానే దాని వెనక వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వినపడలేదు అంటే మీరు నమ్ముతారు అని నాకు తెలుసు.

తన అభిమాన హీరో కి గన్లు అంటే ఇష్టం అని తెలిసిన ప్రతీ ఫ్యాన్ తీరుకో గన్ చూపెడుతూ పడే టైటిల్స్ కి రచ్చ రచ్చ చేశాడు.

తరవాత వచ్చే షోలే సీన్ , ఫ్యామిలీ ఇంట్రో దక్షన్ అంతా బాగానే ఉన్నా పీక్స్ లో థియేటర్ మొత్తానికి ఎనర్జీ ఇచ్చింది మాత్రం పసి గబ్బర్ సింగ్ తన మెడ మీద చెయ్యి వేసినప్పుడే. ఆ బి.జి.ఎం ఇప్పటికీ నరాలలోకి కరెంట్ ఎక్కించేస్తుంది.

స్క్రీన్ మీద ” పసివాడు… పవన్ కళ్యాణ్ అయ్యాడు ” అని చూడగానే అసలు పండగ మొదలైంది థియేటర్ లో.

పేపర్ల బస్తాలతో రెడీ అయ్యారు భక్తులు.

ఆ కాళ్ళు కనపడగానే ఓ బస్తా అయిపోగొట్టేసారు.

ఇక స్క్రీన్ మీద వచ్చే ఆ గుర్రపు డెక్కల చప్పుడు ప్రతి ఫ్యాన్ గుండెల్లో మోగింది.

2 Gabbar Singhఆయన కనపడగానే , కనిపించాడు రా దేవుడు అన్నంతగా థియేటర్ మొత్తం ఒక్కసారి లేచింది , గోల గోల ఆ ఇంట్రోదక్షన్ కి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ లో నుంచి ఆ బుల్లెట్ బయటకి రావడం అసలు కేక.

ఆ గెటప్ కే జనాలకు పిచ్చి లేస్తుంటే ” పేరు గోత్రం చెప్పడానికి నేనేమన్నా గుడి కొచ్చానెంట్రా ” అంటూ పవర్ హౌజ్ దగ్గర గబ్బర్ సింగ్ కుమ్ముడు కుమ్ముతుంటే థియేటర్ మొత్తం షేక్ అయ్యింది.

తరవాత , ” తపస్సు చేసేస్తే ప్రత్యక్షం అవ్వడానికి నేను దేవుడిని కాదు , తప్పు చేస్తే మట్టుకు ఆటోమాటిక్ గా మన దర్శనం అయిపొద్ది రోయి ” అంటుంటే ఆ క్యారెక్టర్ కన్నా నిజంగా పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టే చూశారు అందరూ.

ఇంక టైటిల్ సాంగ్ తో పాటు థియేటర్ లో ఓ జాతర కూడా మొదలైంది , ఆ పాటకి పవన్ కళ్యాణ్ తో పాటు థియేటర్ మొత్తం డాన్స్ వేసింది. అలా తన దేవుడితో స్టెప్లు వేయించిన కొరియోగ్రఫర్ ఇంకో వందేళ్లు బతకాలని ప్రేక్షకులు మొక్కారు కూడా. గన్ను , నడుమూ తిప్పుతుంటే ఆహా.. అదో రకమైన పిచ్చి పట్టింది జనాలకి.

పోలీస్ స్టేషన్ను గబ్బర్ సింగ్ స్టేషన్ గా మార్చడం , చిట్టి తల్లి , మహా లక్ష్మీ అని గన్నులకు పేర్లు పెట్టడం , గన్ కి రేంజ్ లేదని కామెడీలు చేస్తూ ” నా కొంచెం తిక్కుంది కానీ దానికో లెక్కుంది ” అంటూ తన తిక్కను ప్రేక్షకులకు పరిచయం చేసే సీన్లు నిజంగా అరిపించాయి.

సిద్ధప్ప నాయుడు వచ్చి కలిసే సీన్లో ” ఆడు నా ఫ్యాన్ , నేను చెప్పిన ఒకటే నా ఫ్యాన్స్ చెప్పిన ఒకటే ” అన్నప్పుడు విజిల్స్ పడ్డ ,

” నాకు నేనే పోటీ , నాతోటి నాకే పోటీ “

” నేను ఆకాశం లాంటోడిని , ఉరుమొచ్చిన , మెరుపొచ్చినా , పిడుగొచ్చినా , నేనెప్పుడు ఒకేలా ఉంటా ” అన్నప్పుడే అసలు మజా వచ్చింది

ఇక ” యే మేరా జహా ” పాట అయితే పిచ్చి పీక్స్ కి తీసుకెళ్ళింది.

ఫ్లో బాగా పొంగిపోతుంది అని సాంబ ని ” రాస్కో రా సాంబ ” అన్నప్పుడు సాంబడు ఆ బుక్ ఏయించే అణిముత్యాలతో పాటు రికార్డులు కూడా గబ్బర్ సింగ్ పేరిట రాసేశాడు.

హీరోయిన్ ఇంట్రో దక్షన్ , షాప్ లో ” రతి , హా..రతి ” ఎపిసోడ్స్ బాగానే నవ్వించాయి.

6 Gabbar Singhఆ నవ్వులు అయ్యేలోపు , ప్రేమలో పడేసాలా ” ఆకాశం అమ్మాయి అయితే ” పాట హాయిగా సాగింది , మధ్యలో పవన్ కళ్యాణ్ వేసే ఆ సర్ ప్రైజ్ స్టెప్ ఓ గమ్మత్తైన నవ్వు తెప్పించింది.

రికవరీ రంజిత్ కుమార్ ఆయుధాలతో కాకుండా వాయిదాలతో చంపడం నవ్వు తెప్పించినా , అసలు హై మాత్రం ” కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు ” ఇచ్చింది.

మార్కెట్ బంద్ అయినప్పుడు ” హోయి రబ్బ హోయి రబ్బా ” అనుకుంటూ రిక్షా మీద వచ్చి , ఇమిటేషన్ చేసే రౌడీల క్రీడ స్ఫూర్తి నచ్చి , ” చొక్కా ఉంచి కొట్టనా తీసి కొట్టనా ” అంటూ వాళ్ళ తో కబడ్డీ ఆడుతుంటే ఉంటది నా సామిరంగా….. ఒక్కో బాడీ ఔట్ ఆఫ్ కోర్టే.

సిద్ధప్ప నాయుడు , మినిస్టర్ ని కలిసినప్పుడు ఆయన ఇచ్చే బిల్డ్ అప్ ఇంకా హై ఇచ్చింది.

దానికి సిద్ధప్ప నాయుడు రివెంజ్ తీర్చుకోవాలనుకుంటే దాన్ని కూడా రివర్స్ చేసి తన గబ్బర్ సింగ్ ఫౌజీ తో నడుస్తుంటే ఆహా కిక్కో కిక్కు.

కోట గారి పరిచయం ,
” మాయ్యా , నువ్వు మందు తాగుతావా మాయ్యా , ఏ బ్రాండ్ మాయ్యా ? ” అంటూ పవన్ కళ్యాణ్ క్యూట్ మాటలతో మందు బాబులం పాట థియేటర్ లో మాయని స్టార్ట్ చేసినా దాన్ని పదింతల పండగలా చేసింది మాత్రం ” పిల్లా నువ్వు లేని జీవితం ” పాట అందులో పవన్ డాన్స్.

5 Gabbar Singhఆ తరవాత వచ్చే పెళ్లి చూపుల సీన్ , పవన్ కళ్యాణ్ ” పట్టు పంచె ” డైలాగు అసలు నవ్వులే నవ్వులు. అందులో కూడా

” మా అమ్మకు నువ్వు ఓకే , మీ నాన్న నాకు ఓకే , నువ్వు ఊ అంటే కేకే ” లాంటి చురకలు పిచ్చి అంతే.

గబ్బర్ సింగ్ అమ్మ గారు చనిపోవడం , అంత్య క్రియలు బాధను కలిగిస్తాయి. ముఖ్యంగా చిన్నప్పటి స్మృతులు గుర్తు తెచ్చుకొని పవన్ కళ్యాణ్ బాధ చూడలేము.

ఈ బాధలో ఉన్నప్పుడే ముసేయబోతున్న ఎగ్జిబిషన్ లో జరిగే ఫైట్ గబ్బర్ సింగ్ ను కెలికితే ఏం అవ్వుదో చూపించింది.

గేటు బడలు కొట్టుకు రన్నింగ్ జీప్ లో నుంచి దిగి ” అప్పుడే అయిపోయింది అనుకోకు ఇప్పుడే మొదలైంది , ఇప్పుడే మొదలైంది ” అనే వార్నింగ్ మాస్ మేనియా ఇంటర్వెల్ ఇచ్చింది. ” నేనేంటో వాళ్ళకి తెలుసు ” అనడం హైలైట్.

ఇంటర్వెల్ టైం అయ్యేలోపు ఫ్యాన్స్ ఇంకొన్ని పేపర్ బస్తాలు తెచ్చుకున్నారు సినిమా పరిస్థితి అర్థం అయ్యి , ప్రతి పది నిమిషాలకు బస్తాలు బస్తాలు అయిపోతున్నాయి అక్కడ.

ఇంటర్వెల్ తరవాత సిద్ధప్ప నాయుడు ఏడుపు జనాలకి మాంచి కామెడీ ఇచ్చింది.

” నేను ట్రెండ్ ఫాలో అవ్వను , ట్రెండ్ సెట్ చేస్తా ” లారీ ఎపిసోడ్ నుంచి మినిస్టర్ దగ్గర పవన్ పవర్ ఫుల్ మాటలు , హీరోయిన్ తో మాటల తరవాత జల్సా లోని ” గాల్లో తేలినట్టుందే ” పాట వరకు అలా వెళ్ళిపోతూ ఉంటుంది.

తరవాత , నాయుడు గారి దగ్గర , మార్కెట్లో కోట గారి వల్ల , గబ్బర్ సింగ్ మాట నడవకపోవడం కొంచెం బాధనిస్తుంది.

ఇవిలా జరుగుతుంటే , గబ్బర్ సింగ్ తమ్ముడిని రెచ్చగొట్టి తప్పు చేయించి ఆ తప్పు కి తన డ్యూటీ సరిగ్గా చేసేలా తన తమ్ముడిని తన చేత్తో కొట్టేలా సిద్ధప్ప నాయుడు చేసి జనాలకి , గబ్బర్ సింగ్ కి కోపాన్ని తెప్పిస్తాడు.

4 Gabbar Singhఆఫీసర్ తో మాటల తరవాత సారీ చెబుతూ మళ్లీ తమ్ముడిని కొట్టడం ప్రేక్షకులకు నవ్వుని తెప్పిస్తాయి.

దీని తరవాత సిద్ధప్ప నాయుడు చేసిన ఛాలెంజ్ వల్ల మన తెలుగు ఇండస్ట్రీకి ఒక బెస్ట్ కామెడీ ఎపిసోడ్ వచ్చింది.

పవన్ కళ్యాణ్ , పాటలూ కాకుండా , ఈ ఎపిసోడ్ కోసం కూడా రిపీట్ ఆడియన్స్ వచ్చారు.

సిద్ధప్ప నాయుడు రౌడీలతో తన శాడిజం వాడుతూ గబ్బర్ సింగ్ స్టూడియో లో గబ్బర్ సింగ్ ఆడించే ” అంత్యాక్షరి ” అసలు మాములుగా ఉండదు.

ఒక్కో పాట , ఒక్కో రౌడీ , ఒక్కో ఎక్స్ప్రెషన్ వాళ్ళ కామెడీ హహహ పొట్ట చెక్కలే.

ఇమిటేషన్స్ కేక పుట్టించాయి.

” నన్ను కొట్టకురో తిట్టకురో ” పాట కి పవన్ డాన్స్ పీక్స్.

ప్రతి పాట నవ్వులే పుట్టించింది.

ప్రేక్షకులు అందరు ” ఏం సేస్త్రి ఏం సేస్త్రి ” అన్నారు.

విషయం తెలిసిన తరవాత

హీరోయిన్ తో మాట్లాడి ” మూడు ముళ్ళా ముపై గుండ్లా ” అని పెళ్లి కొడుకుని బెదిరించి తన పెళ్లి చేసుకొని ” నువ్వు సుఖంగా ఉండి నన్ను సుఖంగా ఉంచు ” అనేసి సిద్ధప్ప తో ” నేను టైం ని నమ్మను నా టైమింగ్ ని నమ్ముతా ” అన్నప్పుడు పిచ్చ హై.

ఆ హైలో పవన్ కళ్యాణ్ వేసే సింపుల్ స్టేప్స్ తో ” దిల్ సే ” పాట సూపర్ గా ఉంటుంది.

గబ్బర్ సింగ్ కట్ ఔట్ చూపించి బండ్ల తాళాల గుత్తి తీసుకునే బ్రహ్మీ కూడా పిచ్చేకిస్తాడు.

డబ్బిచ్చి ఎం.ఎల్.ఏ టికెట్ కొనేసిన సిద్ధప్ప ” కెవ్వు కేక ” అంటూ ఎంజాయ్ చేస్తుంటే గబ్బర్ సింగ్ ఎంట్రీ , ఆ డాన్స్ ఫ్యాన్స్ కీ , ప్రేక్షకులకు పిచ్చేకించింది.

దెబ్బ మీద దెబ్బ ఇస్తున్న గబ్బర్ సింగ్ ని దెబ్బ కొట్టాలని తన తమ్ముడి తో ఆ మినిస్టర్ ని చంపిపించి , గబ్బర్ సింగ్ కి సస్పెన్షన్ , కోపం రెండూ తెప్పిస్తాడు , ఆ కోపం నాయుడు గారిని హాస్పటల్ పాలు చేస్తది. అది బాధ కలిగించినా

ఈ గొడవ , నాయుడు గారిని , గబ్బర్ సింగ్ ని కలుపుతుంది. ఆయన గుండెతో మాట్లాడటం సెంటిమెంటల్ గా బాగుంటది.

ఈ తప్పు గబ్బర్ సింగ్ తమ్ముడిని భయపెట్టి గబ్బర్ సింగ్ నే చంపడానికి పంపిస్తది.

వాడిని మార్చి ఐ.జి దగ్గరికి తీసుకెళుతుంటే వచ్చిన ఆ రౌడీలను జీపు డ్రైవింగ్ మాయతో బుల్లెట్ల వర్షం కురిపిస్తూ చంపేస్తాడు. ఆ ఫైట్ ప్రేక్షకులని రెప్ప వెయ్యనివ్వలేదు.

ఈలోపు అసలు నిజం చెప్పి తన చావుని తానే రెచ్చగొట్టి ఇంటికి పిలిపించుకుంటాడు సిద్ధప్ప.

ఒక ప్రళయంలా వచ్చి జీపు తో గుద్ది , కొట్టి మరీ సిద్ధప్ప ను చంపడం మాస్ హిస్టీరియా.

ఇలా సినిమా సుఖాంతం అయ్యాక

ఆ రౌడీలకు ఎంప్లాయిమెంట్ లేదని పోలీస్ ట్రైనింగ్ ఇప్పించడం హహహ గబ్బర్ సింగ్ చేసిన న్యాయం.

3 Gabbar Singh” నేను , నా పైత్యం ” బుక్ ప్రింటింగ్ కి వెళ్ళింది అని తెల్సుకోవడం హైలైట్.

మాకు సినిమా ఎంత నచ్చింది అంటే మేము ఫ్యామిలీగా అయిదు సార్లు చూసిన ఏకైక సినిమా ఇది.

ఇలాంటి సెలబ్రేషన్ సినిమాని జనాలు పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేశారు.

థియేటర్ మొహం చూడని వారిని కూడా రిపీట్ ఆడియెన్స్ గా మార్చిన సినిమా ఇది.

పరువు పేరుతో పడుకున్న ప్రతి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని థియేటర్ వైపు పరిగెత్తించిన సినిమా ఇది.

మన జనాభాలో పవన్ కళ్యాణ్ భక్తులే ఎక్కువ ఉన్నారు అని రుజువు చేసిన సినిమా ఇది.

యాభై రోజులు అయినా సరే హౌజ్ ఫూల్స్ చేసిన సినిమా ఇది.

థియేటర్లను వంద రోజులు ఆపై దాకా కిట కిటలాడేలా చేసిన సినిమా ఇది.

ఇలాంటి సినిమాని ఎనిమిది ఏళ్లు కాదు ఇంకో ఎనిమిది వందల ఏళ్లకు కూడా ఫ్యాన్స్ మర్చిపోరు.

” ఆకలి తో ఉన్న అభిమాని కి భుక్తాయాసం ఇచ్చే సినిమా ఇది ” అని ఆడియో రిలీజ్ ఫంక్షన్లో ఇచ్చిన మాటను Harish Shankar గారు నిలబెట్టుకొని మాకు ఈ పండగను ఇచ్చినందుకు ఈ సినిమా మీద ప్రేమ కంటే ఇంకేం ఇవ్వలేము సర్.

మీ రెండో కాంబినేషన్ కోసం కోట్ల కళ్ళతో ఎదురు చూస్తూ ఉండే…

ఓ హరీష్ – పవన్ అభిమాని.

నోట్ : ఇదేంట్రా ఈడు ఇంత రాశాడు అనిపించిందా , ప్రతీ సీనూ ఒక సెన్సేషన్ అయితే ఇలాగే ఉండిద్ది మరి.

SHARE