Home Unknown facts దేవతా రూపంలో దర్శనమిచ్చే హనుమాన్ ఆలయం ఎక్కడ ఉందొ తెలుసా ?

దేవతా రూపంలో దర్శనమిచ్చే హనుమాన్ ఆలయం ఎక్కడ ఉందొ తెలుసా ?

0

ఎప్పుడైనా మనకు పీడ కలలు వస్తే హనుమాన్ చాలీసా చదుకోమని పెద్దలు చెబుతారు. భయం వేస్తే శ్రీఆంజనేయం, ప్రసన్నంజనేయం అని మన నోటికి రాకమానదు. హనుమంతుడిని భుజ బలానికి, వీరత్వానికి చిహ్నంగా భావిస్తాం. ఆజాను బాహుడై కండలు తిరిగిన దేహంతో ఆయన భక్తులకు దర్శనమిస్తాడు. ఇప్పటికీ చాలా వ్యాయామ శాలలు, జిమ్ లలో ఆంజనేయ స్వామి విగ్రహం లేదా ఫొటో ఉండాల్సిందే.

Hanuman Templeశ్రీ రాముడికి ప్రియ భక్తుడు, ఆ జన్మ బ్రహ్మ చారి అయిన ఆంజనేయుడు హిందువుల అందరికీ ఇష్ట దైవము. కోరిన కోర్కెలు తీర్చే హనుమంతుడు ని చూడగానే చిన్న, పెద్ద అందరిలో ఒక విధమైన ఉత్సాహం, ఉల్లాసం కలుగుతాయి. భక్తికి, సేవానిరతి కి మారు పేరుగా హనుమన్ ని వర్ణిస్తారు. అలాంటి ఆంజనేయుడికి ప్రతి ఊరు లోను దేవాలయాలు ఉన్నాయి. ఆజన్మాంతం శ్రీ రాముని సేవకుడిగా ఉన్న ఆంజనేయ స్వామిని ప్రతి హిందువు పూజిస్తాడు.

అయితే ప్రపంచంలో ఒకే ఒక చోటు మాత్రమే హనుమంతుడు స్త్రీ రూపంలో ఉంటాడు. ఆ ఆలయ విశేషాలు తెలుసుకుందాం.. చత్తీస్ ఘర్ రాష్ట్రంలో రతన్ పూర్ జిల్లాలో గిర్జబంద్ లోని ఓ ఆలయంలో హనుమంతుడిని దేవత రూపంలో పూజిస్తుంటారు. ఈ ఆలయంపై అపారమైన నమ్మకం ఉంది.ఇక్కడి ఆంజనేయ విగ్రహం రాముడు, సీతాదేవిలను తన భుజలపై మోస్తున్నట్లుగా కనిపిస్తుంటాడు. ఈ ఆలయంలో దేవత రూపంలో ఉన్న హనుమంతున్ని ఏదైనా కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందని విశ్వసిస్తారు.

ఈ దేవాలయంలో హనుమంతుడి విగ్రహం స్త్రీ రూపంలో ఉండటం వెనుక పురాణ కథనం ఉంది. ఇక్కడ ఒకానొక కాలంలో దేవరాజ్ అనే రాజు ఉండేవాడు. అతను హనుమంతుడికి మిక్కిలి భక్తుడు. ఇదిలా ఉండగా ఆ రాజు కుష్టు రోగం బారిన పడుతాడు. దీంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అదే రోజు రాత్రి కలలో హనుమంతుడు రాజు కలలో కనబడి తనకు మందిరం నిర్మించాలని చెబుతాడు. దీంతో రాజు తన ఆలోచనను విరమించుకుని హనుమంతుడికి దేవాలయం నిర్మిస్తాడు. ఈ ఆలయం ఎన్నో సంవత్సరాలుగా ఉంది. రతన్ పూర్ రాజు అయిన పృథ్వీ దేవ్ జు ఆ ఆలయాన్ని నిర్మించినట్లుగా అక్కడి శాసనాలు చెబుతున్నాయి.

ఆలయ నిర్మాణం పూర్తి కావడానికి కొన్ని రోజుల ముందు మళ్లీ ఆంజనేయుడు రాజు కలలో కనిపించి మహామాయ కుండ్ వద్ద ఓ విగ్రహం ఉంటుందని, దానిని తీసుకువచ్చి ఆలయంలో ప్రతిష్టించాలని ఆదేశించి అదృశ్యమవుతాడు. హనుమంతుడి సూచనల ప్రకారం ఆ మరుసటి రోజు ఆ ప్రదేశానికి వెళ్లి చూడగా అక్కడ హనుమాన్ విగ్రహం స్త్రీ రూపంలో ఉండడంతో ఆశ్చర్యపోతాడు.

ఆ తరువాత భగవంతుడు తనకిచ్చిన ఆదేశం మేరకే ఆ విగ్రహాన్ని తీసుకువచ్చి ఆలయం లోపల ప్రతిష్ట చేస్తాడు. వెంటనే రాజు తన అనారోగ్యం నుంచి విముక్తుడై ఆరోగ్యవంతుడిగా మారతాడు. ఈ ఆలయాన్ని సందర్శించడానికి శీతాకాలం అనువైనది. అక్టోబర్ నుంచి మార్చి మధ్య ఈ ఆలయాన్ని సందర్శించేందుకు సరైన సమయం.

రాయ్ పూర్ లోని స్వామి వివేకానంద ఎయిర్ పోర్ట్ నుంచి 140 కిలోమీటర్ల దూరంలో ఉండే బిలాస్ పూర్ కు నేరుగా క్యాబ్ లేదా బస్సు ద్వారా చేరుకోవచ్చు. అక్కడి నుంచి రతన్ పూర్ కు 28 కిలోమీటర్లు. ఎయిర్ పోర్ట్ నుంచి రతన్ పూర్ చేరుకోవడానికి దాదాపు 5 గంటల సమయం పడుతుంది.

 

Exit mobile version