Home Unknown facts Hanumanthudini mukkanti hanuman ani yendhuku antaroo thelusa?

Hanumanthudini mukkanti hanuman ani yendhuku antaroo thelusa?

0

హనుమంతుడు రాముని బంటు, రామాయణంలో రాముడు సీత కోసం వెతుకుచుండగా రామ భక్తితో హనుమంతుడు తన వానర సైన్యంతో ఎంతో సహాయపడతాడు. అయితే హనుమంతుడికి ముక్కంటి హనుమాన్ అనే పేరు ఎందుకు వచ్చినది? హనుమంతుడు వెలసిన ముక్కంటి హనుమాన్ ఆలయం ఎక్కడ ఉందనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. hanumanthuduతేత్రాయుగంలో విష్ణుమూర్తి రామావతారంలో రావణుడిని సంహరించిన తరువాత నారదుడు, స్వామి లంక నాశనముతో మీ యుద్ధము పూర్తికాలేదు. రావణుని వారసులు ఉన్నారు. తండ్రి మృతిపై ప్రతీకారం తీర్చుకునేందుకు వారు తప్పకుండా మీపై యుద్ధానికి వస్తారు. వారు ప్రస్తుతం సముద్ర అడుగు భాగంలో తపస్సు చేస్తున్నారు. వారి తపస్సు పూర్తి కాకముందే మీరు వారిని సంహరించాలని వేడుకున్నాడు. అప్పుడు రాముడు, నారదమహర్షి రామావతారంలో నా కర్తవ్యం పూర్తయినది. మరికొన్ని రోజుల్లో ఈ అవతారాన్ని చాలించనున్నాను. ఇందుకు ఇంకెవరినైనా ఎంపిక చేయుమని అన్నాడు. కాగా, రాక్షస వధకు హనుమంతుడిని పంపించాలని అందరూ నిర్ణయించారు. అప్పుడు యుద్ధంలో సహాయంగా ఉండేందుకు విష్ణుమూర్తి తన శంకు, చక్రాలను హనుమంతుడికి ప్రసాదించారు. బ్రహ్మదేవుడు తన కమండలాన్ని, పరమ శివుడు తన మూడో కంటిని ఆంజనేయుడికి ప్రసాదించారు. ఇలా వివిధ దేవతల నుంచి పది ఆయుధాలు పొందిన అంజనీపుత్రుడు దశభుజుడయ్యాడు. కైలాసనాధుని నుంచి మూడో కన్ను పొందడంతో ముక్కంటిగా మారాడు. వానర శ్రేష్టుడు రాక్షస వధ పూర్తిచేసి విజయంతో తిరిగి వచ్చాడు. ఈ రూపంలో ఆయన రాక్షసులను అంతమొందించి అక్కడ వెలిసినందున ఆ ప్రాంతంలో ఆలయాన్ని నిర్మించి భక్తులు పూజిస్తున్నారు. తమిళనాడు రాష్ట్రము, నాగపట్నం జిల్లాలోని అనంతమంగళంలో ముక్కంటి హనుమాన్ ఆలయం ఉంది. ఈ ఆలయంలోనే త్రినేత్ర దశభుజ వీరాంజనేయుడు భక్తుల పూజలందుకుంటున్నాడు. రాక్షస వధతో హనుమంతుడు ఇంకా అక్కడ ప్రజలు ఆనందంగా ఉన్నందున ఆ ప్రాంతానికి ఆనందమంగళమ్ అనే పేరు స్థిరపడిందని భక్తులు చెబుతుంటారు. ఇలా హనుమంతుడు రాక్షసవధలో భాగంగా పదిభుజాలు కలిగి దశభుజ వీరాంజనేయుడై, మూడు కన్నులు కలిగి ఉండి ముక్కంటిగా ఈ ఆలయంలో దర్శనమిస్తున్నాడు.

Exit mobile version