హనుమంతుడు ఆవహించి ఊగిన విగ్రహం గురించి కొన్ని నిజాలు

0
2270

ఆంజనేయుడిని బజరంగబలి, మారుతి, అంజనిసుతుడు, హనుమంతుడు అని అనేక పేర్లతో కొలుస్తుంటారు. అయితే అంజనాదేవి కుమారుడు కాబట్టి ఆంజనేయుడు అనీ, వాయుదేవుని ద్వారా పుట్టినవాడు కాబట్టి పవనకుమారుడు అనీ పిలుచుకుంటారు. ఇంకా అంజనాదేవి భర్త పేరు కేసరి కాబట్టి, కేసరీనందనుడు అని పిలుస్తారు. ధర్మ రక్షణ కోసం రాముడు జన్మిస్తే అయన నమ్మిన బంటు హనుమంతుడు ధర్మ సేవ కోసం అవతరించాడు. ఇది ఇలా ఉంటె, ఈ ఆలయంలో ఆంజనేయస్వామి మీసాలతో దర్శనమిచ్చే అరుదైన విగ్రహం అనేది ఉంది. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

hanumanగుజరాత్ రాష్ట్రం, సారంగపూర్ అనే ప్రాంతంలో ఆంజనేయస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం స్వామి నారాయణ్ ఆలయంగా ప్రసిద్ధి చెందగా ఆంజనేయస్వామి వారికీ ఈ ఆలయాన్ని అంకితం చేసారు. ఇక్కడ కొలువై ఉన్న స్వామివారిని స్థానిక భక్తులు కస్త్ భంజన్ దేవ్ గా పూజిస్తారు.

mesala hanumanఈ ఆలయ గర్భగుడిలో ఉన్న హనుమంతుడి విగ్రహానికి ఒక విశేషం ఉంది. ఇక్కడ హనుమంతుడు మీసాలతో దర్శనమిస్తూ, కాలి కింద ఆడ రాక్షసిని తొక్కుతున్న దృశ్యం, హనుమంతుడి విగ్రహం వెనుకాల కోతులు పండ్లని పట్టుకున్న దృశ్యం భక్తులకి దర్శనమిస్తుంటాయి. ఇక్కడ హనుమంతుడి విగ్రహాన్ని సద్గురు గోపాలనంద్ స్వామి వారు ప్రతిష్టించగా, విగ్రహాన్ని ప్రతిష్టించే సమయంలో హనుమంతుడు విగ్రహంలోకి ఆవహించి చాల సేపు ఉగిపోయాడని, అప్పటి ఆ దృశ్యం ఒక అద్భుతం అని చెబుతుంటారు.

mesala hanumanఇక ఈ ఆలయాన్ని దయ్యం పట్టినవారు ఎక్కువగా దర్శిస్తుంటారు. దయ్యం పెట్టినవారు ఈ ఆలయంలో ఒక మూడు రోజులు నిద్రిస్తే విముక్తి పొందుతారని భక్తుల నమ్మకం. ఈ ఆలయ ఆవరణలో ఒక బావి ఉండగా, ఆ బావిలోని నీటిని భక్తులు పవిత్రంగా భావిస్తారు. ఈ ఆలయానికి శని, ఆదివారాలలో భక్తులు ఎక్కువగా వస్తుంటారు. ఈ ఆలయంలో దాదాపుగా రోజుకి 5 వేల మందికి అన్నదానం కార్యక్రమంలో భాగంగా ప్రసాదాన్ని ఇస్తారు. ఇంతటి మహిమ గల ఈ ఆలయానికి శనివారాలలో దాదాపుగా 10 వేలకి పైగా భక్తులు వచ్చి స్వామివారిని దర్శనంచేసుకుంటారు.

SHARE