Home Unknown facts సముద్రమట్టానికి 6191 మీటర్ల ఎత్తులో ఉన్న కైలాష్ పర్వతం గురించి తెలుసా?

సముద్రమట్టానికి 6191 మీటర్ల ఎత్తులో ఉన్న కైలాష్ పర్వతం గురించి తెలుసా?

0

హిమాలయాల్లోని మానస సరోవరం ఒడ్డున కైలాస పర్వతం ఉంది. టిబెట్ భూభాగంలో సముద్రమట్టానికి 22 వేల అడుగుల ఎత్తులో ఈ పర్వతం ఉంది. కైలాస పర్వతం సింహం, గుర్రం, ఏనుగు, నెమలి ఆకారంలో ఒక్కో వైపు ఒక్కో ఆకారంలో కనిపిస్తుంది. అంతేకాకుండా నాలుగు వైపులా నాలుగు రంగుల్లో బంగారు, తెలుపు, కాషాయం, నీలం రంగుల్లో కనిపిస్తుంటుంది. మరి ఓం ఆకారంలో కనిపించే కైలాష్ పర్వతం ఎక్కడ ఉంది? ఆ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Mount Kailashఉత్తరాఖండ్ రాష్ట్రంలో కుమావున్ ఉంది. కుమావున్ అంటే కూర్మావతారం అనే అర్ధం ఉంది. శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలలో రెండవ అవతారం కూర్మావతారం. ఇక్కడ సముద్రమట్టానికి 6191 మీటర్ల ఎత్తులో కైలాష్ పర్వతం ఉంది. ఈ పర్వతాన్ని బాబా కైలాష్ పర్వతం అని కూడా పిలుస్తారు. ఇక్కడ కైలాష్ పర్వతానికి దగ్గరలో సహజ సిద్దమైన ఒక శిఖరం ఉంది. ఈ మంచు పర్వతం ఓం ఆకారంలో ఉంటుంది. ఈవిధంగా ఈ పర్వతం ఇక్కడ ఓం ఆకారంలో సహజ సిద్ధంగా ఉండటంతో ఒక ప్రత్యేకతని సంతరించుకుంది.

ఈ ప్రదేశం కుమావొన్  దళం అనే ప్రఖ్యాత సైనికదల స్థావరంగా ప్రసిద్ధి చెందింది. అయితే నందిదేవి, మేళా, ఉత్తరాయని మేళా వంటి వివిధ ఉత్సవాలు ఇక్కడ చాలా గొప్పగా జరుగుతాయి. ఇది ఇలా ఉంటె, మానస సరోవరం విషయానికి వస్తే,  కైలాస పర్వతం మధ్యలో ఉండగా ఈ పర్వతం చూట్టు ఒక ఆరు పర్వతాలు ఉంటాయి. యాత్ర చేసే భక్తులు ఈ పర్వతాల చూట్టు మాత్రమే ప్రదక్షిణ అనేది చేస్తారు. ఇప్పటివరకు ఎవరు కూడా కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళలేదు. ఇక కైలాస పర్వతం చూట్టు ప్రదక్షిణ అనేది చేయాలంటే సరైన వాతావరణం ఉంటె మూడు నుండి నాలుగు రోజుల సమయం పడుతుంది. పౌర్ణమి రోజుల్లో కైలాస పర్వతం ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. శివుడు ఇక్కడ మానస సరోవరంలో స్నానం చేసేవాడని పురాణాలూ చెబుతున్నాయి.

 

Exit mobile version