మైగ్రేన్ తలనొప్పి పోగ్గోటే ఇంటి చిట్కాలు ఏంటో తెలుసా ?

నేటి ఆధునికయుగంలో శారీరక, మానసిక ఒత్తిడి, అనిశ్చితి, ఆందోళనలు తలనొప్పికి ముఖ్యమైన కారణాలు. ఇంకా రక్తపోటు, మెదడు కణుతులు, మెదడు రక్తనాళాల్లో రక్తప్రసరణల్లో మార్పులు, సైనసైటిస్‌ మొదలైన వాటివల్ల తలనొప్పి వచ్చేందుకు ఆస్కారం ఉంది. తలనొప్పి ఏ రకానికి చెందినదో నిర్ధారణ తర్వాత ఖచ్చితమైన చికిత్స చేయడం సులువవుతుంది. కారణాలు, అది ఏరకమైనది అయినప్పటికీ తరచూ తలనొప్పి వస్తే ఏమాత్రం అశ్రద్ధ చేయకూడదు. మైగ్రేన్‌ తలనొప్పిని పార్శ్వపు తలనొప్పి అనికూడా అంటారు. మానసిక ఆందోళన, ఒత్తిడి, జరిగిపోయిన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం, డిప్రెషన్, నిద్రలేమి, అధికప్రయాణాలు, సూర్యరశ్మి, స్త్రీలలో హార్మోన్‌ సమస్యల వల్ల ఈ పార్శ్వపు తలనొప్పి వస్తుంటుంది. పురుషులతో పోలిస్తే ఇది స్త్రీలలోనే ఎక్కువ.

Headache Poggote home tipsలక్షణాలు :

సాధారణంగా మైగ్రేన్‌ వచ్చినప్పుడు 24 గంటల నుంచి 72 గంటలలోపు అదే తగ్గిపోతుంది. ఒకవేళ 72 గంటలకు పైనే ఉంటే దాన్ని స్టేటస్‌ మైగ్రేన్‌అంటారు. దీంతోపాటు వాంతులు కావడం, వెలుతురునూ, శబ్దాలను అస్సలు భరించలేకపోవడం వంటి లక్షణాలూ కనిపిస్తాయి.

Headache Poggote home tipsనివారణ:

మైగ్రేన్‌ రావడానికి కారణాలున్నాయి, ఉదాహరణకు మనం తినే ఆహారంలో మార్పులు, మనం ఆలోచించే విధానం, మానసిక ఒత్తిడి, వాతావారణ మార్పులు, నిద్రలేమి, మహిళల్లో రుతుసమస్యలు వంటి కారణాలతో వచ్చినప్పుడు జీవనశైలిలో మార్పులతో దీన్ని కొంతవరకు నివారించవచ్చు. ఇక మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు వ్యాయామం, యోగా, ప్రాణాయామం చేయాలి.వీటితో పాటు మరికొన్ని హోం రెమెడీస్.

జింజర్ జ్యూస్ :

Headache Poggote home tipsజింజర్ జ్యూస్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. తలనొప్పిని ఇన్ స్టాంట్ గా నివారించుకోవడంలో అల్లం కూడా గ్రేట్ రెమెడీ. ఇది, తలకు సంబంధించిన రక్తనాళాల్లో ఇన్ఫ్లమేషన్ తగ్గస్తుంది, దాంతో పెయిన్ తగ్గుతుంది. ఇంకా అల్లం జీర్ణక్రియను ఆక్టివేట్ చేస్తుంది. వికారం తగ్గిస్తుంది. మైగ్రేన్ కు గురికాకుండా ప్రారంభంలోనే నివారిస్తుంది. తలనొప్పిని వెంటనే తగ్గించుకోవాలంటే, ఒక టేబుల్ స్పూన్ అల్లం రసానికి , ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం మిక్స్ చేసి వాటర్ లో మిక్స్ చేసి, గోరువెచ్చగా చేసి, రోజులో ఒకటి రెండు సార్లు తాగాలి.

పిప్పర్మెంట్ ఆయిల్ :

పిప్పర్మెంట్ ఆయిల్ :తలనొప్పికి ఇన్ స్టాంట్ గా రిలీఫ్ ను ఇచ్చే మరో హోం రెమెడీ పిప్పర్ మింట్ ఆయిల్ . పుదీనా ఆయిల్లో ఉండే వాసన రక్త నాళాలను ప్రశాంత పరుస్తుంది. మైగ్రేన్ తలనొప్పికి గురి కాకుండా నివారిస్తుంది.

దాల్చిన చెక్క పేస్ట్ :

దాల్చిన చెక్క పేస్ట్తలనొప్పి నివారించడానికి మరో అద్భుతమైన రెమెడీ దాల్చిన చెక్క, కొద్దిగా దాల్చిన చెక్క ను పౌడర్ చేసి, అందులో కొద్దిగా నీరు మిక్స్ చేసి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను తలకు , కణతలు, మెడకు పూర్తిగా అప్లై చేయాలి.అరగంట తర్వాత గోరువెచ్చనీ లేదా చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే చాలా మంచి ఫలితం , తలనొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.

థైమ్ :

రోజ్మెర్రీ ఎసెన్షియల్ ఆయిల్తలనొప్పికి ఇన్ స్టాంట్ గా రిలీఫ్ కలిగించే వాటిలో బెస్ట్ హోం రెమెడీ థైమ్ . తలనొప్పిగా ఉన్నప్పుడు రెండు మూడు చుక్కల థైమ్ లేదా రోజ్మెర్రీ ఎసెన్షియల్ ఆయిల్ ను మెడకు, నుదుటికి అప్లై చేసి మసాజ్ చేయాలి. రోజులో రెండు మూడు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ హోం రెమెడీ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

సింపుల్ గా స్ట్రెచ్ చేయడం :

సింపుల్ గా స్ట్రెచ్ చేయడంమరో సింపుల్ హోం రెమెడీ. కొన్ని బేసిక్ స్ట్రెచెస్ చేయడం వల్ల తలనొప్పి తగ్గించుకోవచ్చు. తలను క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ గా తిప్పాలి. ఇలా చేయడం వల్ల మెడ, భుజాల యొక్క కండరాలు రిలాక్స్ అవుతాయి. అలాగే గడ్డం కూడా పక్కలకు, పైకి క్రిందికి కదిలించాలి.

లవంగాలు :

లవంగాలు :నేచురల్ రిలీఫ్ కలిగించే మరో రెమెడీ లవంగాలు. ఇందులో కూలింగ్ మరియు పెయిన్ రిలీవింగ్ లక్షణాలున్నాయి.

తులసి:

తులసి:తలనొప్పి నివారించడంలో మరో గ్రేట్ హెర్బల్ రెమెడీ తులసి, ఇది మజిల్స్ ను రిలాక్స్ చేస్తుంది. తలనొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. కొన్ని తులసి ఆకులను వేడి నీటిలో వేసి మరిగించాలి. అలాగే కొద్దిగా తేనె మిక్స్ చేసి, తాగితే తలనొప్పి తగ్గడంతో పాటు, ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. అలాగే కొన్ని తులసి ఆకులను నమలడం వల్ల కూ కూడా రిఫ్రెషింగ్ ఫీలింగ్ కలుగుతుంది.

ఆపిల్ స్లైస్:

ఆపిల్ స్లైస్తలనొప్పి నుండి ఇన్ స్టాంట్ రిలీఫ్ ఇచ్చే మరో రెమెడీ ఆపిల్ స్లైస్ , ఇది శరీరంలో ఆల్కలైన్ ఈక్వెలిబ్రియంన్ ను రీస్టోర్ చేస్తుంది. ఆపిల్ ముక్కల మీద కొద్దిగా సాల్ట్ చిలకరించి తినాలి. తర్వాత కొద్దిగా వేడి నీళ్ళు తాగాలి.

ఐస్ ప్యాక్ :

ఐస్ ప్యాక్మరో సింపుల్ రెమెడీ మెడ, భుజాలు, నుదిటి మీద ఐస్ ప్యాక్ తో కోల్డ్ కంప్రెసర్ లేదా హాట్ కంప్రెసర్ వల్ల కూడా తలనొప్పి తగ్గించుకోవచ్చు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR