క్యాన్సర్ ముప్పు తప్పించే వేరుశనగ వల్ల కలిగి ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా ?

0
219

వేరుశనగ సహజంగానే చాలా బలమైన ఆహారము. వీటిలో నూనె శాతం ఎక్కువ. ఇది ‘లెగుమినస్’ జాతికి చెందిన మొక్క.. ప్రధానంగా వంటనూనె ఆధారిత పంట.. చౌకగా దొరికే మాంసకత్తులు ఉన్నశాకాహారము వేరు శెనగ. ఒక కిలో మాంసములో లబించే మాంసకృత్తులు ఒక కిలో వేరుశెనగలో లభిస్తాయి. ఒక కోడి గుడ్డుకి సమానము వేరుశెనగ పప్పును తీసుకొని అంచనవేస్తే .. గుడ్డులో కంటే రెండున్నర రెట్లు ఎక్కువగాగానే మాంసకృత్తులు ఉంటాయి. భూమి లోపల కాస్తాయి కాబట్టి వీటిని గ్రౌండ్‌నట్స్‌ అనీ అంటారు. ఇందులో కొవ్వు పదార్ధము ఎక్కువ.. 70% సాచ్యురేటెడ్ , 15% పోలి అన్సాచ్యురేటెడ్, 15% మోనో ఆన్సాచ్యురేటెడ్ కొవ్వులు కలిగి ఉంటాయి.. వీటిలో ఉండే మోనో ఆన్ సాచ్యురేటెడ్ కొవ్వులు శరీరానికి మేలు చేస్తాయి. వేరు శనగకి ఎలర్జీని కలిగించే గుణం ఉన్నందున తినే ముందు ఆలోచించి తినాలి. పడని వారు ఇవి తిన్న వెంటనే ఎలర్జీ లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి వారికి వేరుశెనగ నూనె కుడా పడదు. రిఫైన్‌ చేసిన వేరుశనగ నూనెతో పోలిస్తే ముడి నూనె ఎక్కువగా అలర్జీలకు కారణమవుతుంది.

1 Cancerవీటిని మరీ ఎక్కువగా తింటే శరీరంలో ఆమ్లగుణం పెరుగుతుంది. ముఖ్యంగా ఆస్తమా ఉన్నవాళ్లు తక్కువగా తినాలి. వీరు ఉప్పునీళ్లలో ఉడికించి తింటే అంత సమస్య ఉండదు. అలాగే గ్యాస్త్ట్రెటిస్‌, కామెర్లు ఉన్నవాళ్లు కూడా వేరుశనగ ఎక్కువ వాడకూడదు. అజీర్తికీ హైపర్‌ఎసిడిటీకీ కారణమవుతాయి. ఈ వేరుశనగ పెరిగేదశలో లేదా నిల్వచేసే సమయంలో గింజలకి యాస్పర్‌జిలస్‌ ఫ్లేవస్‌ అనే ఫంగస్‌ సోకే అవకాశం ఉంది. ఇది ఎఫ్లోటాక్సిన్‌ అనే విషరసాయనాన్ని ఉత్పత్తిచేస్తుంది. ఇది రకరకాల క్యాన్సర్లకు దారితీస్తుంది. అందుకే వీటిని కొనేటప్పుడూ నిల్వచేసేటప్పుడూ చాలా జాగ్రత్త వహించాలి. ఏమాత్రం ఫంగస్‌ సోకినట్లున్నా వాడకూడదు. వేరుశనగ విత్తనాలు బలమైన ఆహారం. వీటిల్లో ప్రోటీన్లు, విటమిన్లు అధికంగా ఉంటాయి. మరి వీటి వల్ల కలిగి ఆరోగ్య ప్రయోజనాలేంటో మనం ఇపుడు తెల్సుకుందాం..

healh benfits of peanutవేరుశనగలో ఉన్న అధిక ప్రోటీన్స్, మినిరల్స్, యాంటి ఆక్సిడెంట్ మరియు విటమిన్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి శరీరానికి కావల్సిన శక్తిని అందిస్తాయి. ఇవి శరీరం పెరుగుదలకు, అభివృద్ధికి సహాయపడుతాయి.

healh benfits of peanutవేరుశెనగలను తినడం వల్ల అతి ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనం ఏంటంటే స్టొమక్ క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. ఇందులో ఫ్యాలీ ఫినోల్ యాక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది.

ఇందులో విటమిన్ ఇ అధిక శాతంలో ఉంటుంటి. ఇది చర్మ ఆరోగ్యాన్ని రక్షించడమే కాకుండ ఆక్సిజన్ ప్రీరాడికల్స్ నుండి కాపాడుతుంది. అలాగే వేరుశెనగలో బి కాంప్సెక్స్ విటమిన్స్ అధికం. ఇందులో రిబోఫ్లెవిన్, థైమిన్, విటమిన్ బి మరియు ఫాంటోథెనిక్ యాసిడ్స్ అధికంగా ఉంటాయి ఇవి మెదడును చురుకుగా ఉంచడంతో పాటు, రక్తప్రసరణ బాగా జరిగేలా చేస్థాయి… వేరుశనగ ఎముకల నిర్మాణానికి కావల్సిన క్యాల్షియం, ఐరన్ ను అందిస్తుంది.

healh benfits of peanutదీనిలో ఉండే రెస్వెరప్రాల్‌ అనే యాంటీ ఆక్సిడెంట్ గుండెజబ్బుల బారినుంచి కాపాడుతుంది. క్యాన్సర్‌ రిస్క్‌నూ తగ్గిస్తుంది. వృద్ధాప్య ఛాయలనూ దరిచేరనివ్వదు. గుండెజబ్బుల్ని నివారించే కొన్నిరకాల మందుల్లో వేరుశెనగ వాడతారు… శరీరానికి మంచి చేసే మోనోఅన్‌శాచురేటెడ్‌ ఫ్యాట్స్‌ 50 శాతం మేరకు కలిగి ఉండే వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకోవటంవల్ల క్యాన్సర్ ముప్పు తొలగుతుంది, అంతేగాకుండా శరీరంలో కొలస్ట్రాల్ శాతం అదుపులో ఉంటుంది.

SHARE