పెరుగు పుల్లబడిందా? వేస్ట్ చేయడం ఎందుకు, ఇలా ఫేస్ ప్యాక్ వేసుకోండి

0
176

ఆరోగ్యం కోసమైనా అందం కోసమైనా మన వంటింటికి మించిన ఔషధాలు ఎక్కడా లేవు. ఎలాంటి సమస్యకైనా వంటింటి చిట్కాలు ప్రభావంతంగా పని చేస్తాయి. అందులో ఒకటే పెరుగు. ఆరోగ్యానికి, జీర్ణక్రియకు పెరుగు చక్కగా పని చేస్తుంది. కానీ పెరుగు పుల్లబడితే మాత్రం తినడానికి ఇష్టపడరు. అలాంటప్పుడు దాన్ని వేస్ట్ చేయకుండా ఇలా ఫేస్ ప్యాక్ లా ఉపయోగించి చుడండి. మంచి ఫలితాలను చూడొచ్చు.

Health & Beauty Benfits Of Curdపెరుగుని కొన్ని నేచురల్ ఐటమ్స్ తో కలిపి స్కిన్ కేర్ కై వాడితే రిజల్ట్స్ అద్భుతంగా ఉంటాయి. స్కిన్ గ్లో అవుతుంది. బ్లడ్ సర్కులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. స్కిన్ టెక్స్చర్ కూడా మెరుగవుతుంది. ముఖ్యంగా పెరుగు, తేనె, నిమ్మరసం. రెండు టేబుల్ స్పూన్స్ పెరుగు, ఒక టేబుల్ స్పూన్ తేనె అలాగే ఒక టీస్పూన్ నిమ్మరసాన్ని తీసుకోండి. వీటిని పేస్ట్ లా చేసుకుని ముఖం అలాగే మెడపై మసాజ్ చేసుకోండి. పదిహేను నిమిషాల తరువాత వాష్ చేసుకోండి. రిసల్ట్ ఆశ్ఛర్య కరంగా ఉంటుంది. ఈ ఫేస్ ప్యాక్ ను రెగ్యులర్ గా వాడితే మార్కెట్ లో లభించే కెమికల్ బేస్డ్ ప్రోడక్ట్స్ పై ఫోకస్ పెట్టాల్సిన పనే ఉండదు.

Health & Beauty Benfits Of Curdపెరుగులో అరటి పండును వేసి కూడా న్యాచురల్ గా ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. రెండు టేబుల్ స్పూన్స్ పెరుగు, మ్యాష్ చేసిన అరటిపండు అలాగే రెండు టేబుల్ స్పూన్స్ రోజ్ వాటర్ ను తీసుకోండి. ఈ ఫేస్ ప్యాక్ ను ముఖం అలాగే మెడపై అప్లై చేయండి. ఇలా రెగ్యులర్ గా చేస్తే ముఖం నేచురల్ గా గ్లో అవుతుంది.

Health & Beauty Benfits Of Curdఅవి ఇవి ఏమి కలపకపోయినా పుల్లటి పెరుగును నేరుగా ఫేస్ కు అప్లై చేసుకున్నా ప్రయోజనం ఉంటుంది. రెండు లేదా మూడు స్పూన్ల పెరుగును ముఖంపై, మెడపై కూడా అప్లై చేయాలి.

Health & Beauty Benfits Of Curdఇందులో ఉన్న క్లీన్సింగ్ ప్రాపర్టీ స్కిన్ ను నరిష్ చేస్తుంది. డెడ్ సెల్స్ ను తొలగిస్తుంది. ఇలా చేయడం వల్ల ముడతలు, యాక్నే వంటి సమస్యలు తగ్గిపోతాయి. స్కిన్ బాగా గ్లో అవుతుంది.

SHARE