ఆపిల్ టీ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా ?

0
195

An apple a Day keeps The doctor away అంటే రోజుకో ఆపిల్ తీసుకోవడం ద్వారా డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన పని వుండదని అర్థం. ఒక ఆపిల్ తింటేనే ఇంత ఆరోగ్యం అంటే ఆపిల్ టీ తాగితే ఇంకెంత మేలు! మనం ఇప్పటి వరకు బ్లాక్ టీ, గ్రీన్ టీ, ఆఖరికి బ్లూ టీ గురించి కూడా విన్నాం. మరి ఈ ఆపిల్ టీ విశేషాలేంటి, దీనివల్ల కలిగే లాభాలేంటి తెలుసుకుందాం.

Health Benefits of Apple Teaఆపిల్ టీ తాగడం వల్ల శరీర బరువును అదుపులో ఉంచుకోవడమే కాదు… రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. శరీరంలోని ఇన్ ఫెక్షన్లను కూడా నివారించవచ్చు. ఆపిల్ టీని తాగడం వల్ల పొట్టలో పేరుకుపోయే ఎన్నో రకాల వ్యర్థాలను బయటికి పంపించొచ్చు. ఉదర సంబంధ సమస్యలన్నింటికీ.. ఆపిల్ టీ చక్కని ఔషధమని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.

Health Benefits of Apple Teaఅలాగే కీళ్ల నొప్పులతో బాధపడుతున్నా కూడా ఆపిల్ టీ తాగితే చక్కటి ఉపశమనం కలుగుతుంది. ఆపిల్ టీ వల్ల ఆరోగ్య ప్రయోజనాలే కాదు.. అందం కూడా పెరుగుతుంది. ఆపిల్ టీతో చర్మం కాంతివంతం అవుతుంది. రెగ్యులర్ గా ఆపిల్ టీ తాగేవారిలో చర్మం మెరుస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

Health Benefits of Apple Teaఆపిల్ ఎక్కువ ధర ఉండడం వలన అందరూ కొనలేకపోవచ్చు కానీ ఆరోగ్యానికి బాగా మేలు చేస్తుంది. అయితే ఆపిల్ లో ఆల్కహాల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అమితంగా తీసుకోవడం మంచిది కాదు. మితంగా తీసుకున్నంత వరకూ చాల లాభాలు ఉంటాయి.

 

SHARE