బాదం పాలను తాగడం వల్ల ఎలాంటి లాభాలున్నాయో తెలుసా

ఆరోగ్యానికి మేలు చేసే డ్రై ఫ్రూప్ట్స్ లో బాదం పప్పు ముందుంటుంది. ఆరోగ్యానికి మంచిదని చాలా మంది వీటిని ఎక్కువగా తింటుంటారు. కొందరు రాత్రి నానబెట్టిన బాదంలను ఉదయాన్నే తింటారు. ఇంకొందరు స్నాక్స్ టైంలో వీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అయితే వీటిని పొడి చేసి తయారు చేసే బాదం పాలు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయట. బాదం పాలు రంగు, రుచితో పాటు మంచి సువాసన కలిగి ఉంటాయి. అందుకే వీటిని చాలా మంది ఇష్టంగా తాగుతుంటారు. మరి అలాంటి బాదం పాలను తాగడం వల్ల ఎలాంటి లాభాలున్నాయో తెలుసుకుందామా.

Health benefits of Badam milkబాదం పప్పు నానబెట్టి తొక్క తీసి మెత్తగా రుబ్బి నీళ్లు పోసి పాలల్ల చిక్కగా కనబడే వరకు కలపాలి. ఇలా చేసిన దానిని తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వీటిలో విటమిన్-ఈ, రిబోప్లేవిన్, విటమిన్-డి, కాపర్, జింక్, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ లాంటి చాలా రకాల విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. కాబట్టి బాదం పాలు పెద్దలతో పాటు పిల్లలకు కూడా చాలా మంచిది. ముఖ్యంగా డైట్ లో ఉన్నవారికి బాదం పాలు బాగా ఉపయోగపడతాయట.

Health benefits of Badam milkఎముకల గట్టిపడడానికి బాదం పాలు మేలు చేస్తాయి. ఆవు పాల కంటే బాదం పాలలో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల ఆర్థరైటిస్, ఆస్టియో పోరోసిస్ సమస్యలు కూడా రావు.

Health benefits of Badam milkబాదం పాలు తీసుకోవడం వల్ల రక్తం లో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుకోవచ్చు. అలానే ఇది రక్తహీనతను కూడా పోగొడుతుంది.

Health benefits of Badam milkదీనిలో సోడియం తక్కువగా ఉంటుంది. హెల్తీ ఫ్యాట్ కూడా ఉండటం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. అలానే గుండె సమస్యల్ని తగ్గిస్తుంది.

Health benefits of Badam milkబాదం తీసుకోవడం వల్ల సెక్స్ హార్మోన్లను విడుదల చేసేలా ఉపయోగపడుతుంది. అలానే ఇది మహిళల్లో కోరికలు పెంచడానికి కూడా ఉపయోగ పడుతుంది అని నిపుణులు అంటున్నారు.

Health benefits of Badam milkబాదం పాలు తాగడం వల్ల మెమరీ పవర్ ను కూడా పెంచుకోవచ్చు. మెదడుకి కావాల్సిన శక్తి బాదం పాలు ద్వారా చేరుతుంది. కాబట్టి పడుకునే ముందు ఒక గ్లాసు బాదం పాలు తాగండి. దీనితో జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR