వేసవిలో బార్లీ నీళ్లతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా ?

గతంలో నీళ్లు, పాలు, మజ్జిగ వంటివి వాడుతూ వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేవారు. నేటి ఆధునిక కాలంలో చాలావరకూ పాతకాలం ఆహారపు అలవాట్లు కనుమరుగై అంతా ఇన్‌స్టెంట్ ఆహార పదార్థాలకే మొగ్గు చూపుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో కూడా బార్లీ, సగ్గుబియ్యం, సబ్జా గింజలకు ఆదరణ తగ్గకపోవడానికి వాటిలోని ఔషధ గుణాలే ప్రధాన కారణం.

health benefits of barley water in summerప్రస్తుతం ఎండ వేడి నుంచి త‌ప్పించుకునేందుకు, శ‌రీరాన్ని చల్లబ‌రుచుకునేందుకు ర‌కర‌కాల శీత‌ల పానీయాల‌ను తాగుతున్నారు. అందులో స‌హ‌జ‌సిద్ధంగా త‌యారు చేసుకునే బార్లీ నీటి పానీయం మ‌న‌కు వేస‌వి తాపం నుంచి ఉప‌శ‌మ‌నాన్ని అందిస్తుంది. మ‌రి బార్లీ నీళ్లను ఎలా త‌యారు చేసుకోవాలో.. వాటితో మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

health benefits of barley water in summerఒక పాత్రలో 1 లీటర్‌ మంచినీటిని తీసుకుని ఆ నీటిలో గుప్పెడు బార్లీ గింజలను వేయాలి. 20 నిమిషాలపాటు ఈ నీటిని బాగా మరిగించాలి. దీంతో బార్లీ గింజలు మెత్తగా మారి, వాటిలోని పోషకాలన్నీ నీటిలోకి చేరతాయి. తర్వాత ఆ నీటిని చల్లార్చి వ‌డ‌పోసి అందులో కొద్దిగా నిమ్మరసం లేదా తేనె కలుపుకోవాలి. ఈ నీటిని రోజూ ఉదయాన్నే పరిగడుపున తాగాలి. లేదా మ‌ధ్యాహ్నం ఎండ‌కు బ‌య‌ట‌కు వెళ్లివ‌చ్చిన వారు కూడా తాగ‌వ‌చ్చు. ఫ్రిజ్‌లో ఉంచి తాగితే శ‌రీరానికి చ‌ల్లదనం క‌లుగుతుంది.

health benefits of cactus juiceవేసవిలో తిన్నది అరగక పోవడం సాధారణ సమస్య. అలాంటప్పుడు బార్లీ నీళ్లు తాగితే చాలా మంచిది. జీర్ణాశయం కూడా చాలా శుభ్రపడుతుంది. అజీర్తి దూరమవుతుంది. బార్లీ నీటిని తాగితే శరీరంలోని వ్యర్థ, విష పదార్థాలన్నీ మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతాయి. మూత్రాశ‌యం శుభ్రంగా మారుతుంది. కిడ్నీ స్టోన్లు క‌రుగుతాయి. ముఖ్యంగా వేస‌విలో మూత్ర సమస్యలతో బాధ‌ప‌డే వారికి బార్లీ నీళ్లు చక్కని ఔష‌ధం అని చెప్పవచ్చు.

health benefits of barley water in summerపిల్లలకు బార్లీ నీళ్లు తాగిస్తే మంచి ఫలితం ఉంటుంది. మలబద్దకం వంటి సమస్యలు దరి చేరవు. ఎండల ప్రభావం పడకుండా ఉండాలన్న, వడదెబ్బ తగలకుండా ఉండాలన్న ఈ నీళ్లు తాగాల్సిందే.

health benefits of barley water in summerబార్లీ నీటిని తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఉన్న వేడి బ‌య‌ట‌కు పోయి శ‌రీరం చల్లగా మారుతుంది. అలాగే జీర్ణ సమస్యలైన గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బద్దకం ఉండ‌వు. కీళ్లు, మోకాళ్ల నొప్పులు త‌గ్గుతాయి. విరేచ‌నాలు అయిన వారు బార్లీ నీటిని తాగితే మంచిది.

health benefits of barley water in summerబ‌రువు త‌గ్గాల‌నుకునే వారు బార్లీ నీటిని తాగాలి. బార్లీ నీటిని తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ క‌రుగుతుంది. ర‌క్త స‌రఫ‌రా మెరుగు ప‌డుతుంది. వ‌డ‌దెబ్బ తాకకుండా ఉండాలన్నా ఎండ‌లో తిరిగి వ‌చ్చిన వారు అనారోగ్యం బారిన ప‌డ‌కుండా ఉండాల‌న్నా.. బార్లీ నీటిని తాగాలి.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR