బిళ్ళ గన్నేరు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మనం సరిగా తెలుసుకోలేకపోతున్నాం కానీ మన చుట్టూ ఉండే పదార్థాలు, మొక్కలు మనకు ఎన్నో రకాలుగా సహాయపడుతూ ఉంటాయి. కానీ మనకు వాటి ఉపయోగాలు గురించి తెలియక నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. అందులో ఒకటి బిళ్ళ గన్నేరు చెట్టు. ఎక్కడైనా ఈ మొక్క కొంచెం మట్టి ఉంటే చాలు పెరుగుతూ ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా పెరిగే ఈ మొక్క అందమైన పూలతో ఆకర్షణీయంగా ఉంటుంది.

బిళ్ళ గన్నేరుబిళ్ళ గన్నేరు 365 రోజులు జీవితకాలం అంతా ప్రతిరోజూ పువ్వులు పూస్తుంది కాబట్టి దీనిని నిత్య పుష్పి, సదా పుష్పి, సదా బహార్, అనే పేర్లు వున్నాయి. అయితే ఈ మొక్క పూలను ఎక్కువగా అలంకరణలో వాడటం వలన చాలా మందికి బిళ్ళ గన్నేరు అలంకరణ మొక్కగానే తెలుసు. ఈ మొక్కలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ మొక్క ఆకులు, పువ్వులు, వేర్లు అన్నీ కూడా మనకు ఎంతగానో ఉపయోగపడతాయి.

బిళ్ళ గన్నేరుక్యాన్సర్, మధుమేహం వంటి వ్యాధుల‌కు ఈ మొక్క చెక్ పెట్ట‌గ‌ల‌దు. హైబీపీ ఉన్న వాళ్ళు కు కూడా ఈ మొక్క వలన అనేక లాభాలు ఉన్నాయి. బిళ్ళ గన్నేరు మొక్క ఆకులూ 5 తీసుకోని వాటి నుండి రసం తీసుకోవాలి. ఆ రసాన్ని 2-3 ఎం ఎల్ మోతాదులో తీసుకోని ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి. అదే విధంగా రాత్రి నిద్రపోయే ముందు కూడా తీసుకుంటే మంచిది. దీని వలన హైబీపీ నియంత్రణలో ఉంటుంది.

బిళ్ళ గన్నేరుమహిళల్లో ఎక్కువగా కనిపించే రుతుక్రమం సమస్యను నివారించటానికి బిళ్ళ గన్నేరు మొక్కలు బాగా ఉపయోగపడుతాయి. బిళ్ళ గన్నేరు ఆకులను 8 తీసుకోని శుభ్రంగా కడిగి వాటిని 2 కప్పుల నీటిలో మరిగించాలి. అరకప్పు నీరు అయ్యే వరకు కషాయం కాయాలి. రోజు పరగడుపున 3 నెలలు తీసుకోవాలి. ఇలా చేయటం వలన హార్మోన్స్ సమస్యలు తగ్గి, రుతు సమయంలో రక్త స్రావం తగ్గటమే కాకుండా, నొప్పులు తగ్గుతాయి.

బిళ్ళ గన్నేరుఇక కొంతమందిలో వేడి ఎక్కువైనప్పుడు ముక్కు నుండి కానీ, నోటి నుండి కానీ రక్త స్రావం అవుతూ ఉంటుంది. దానిని నివారించదానికి బిళ్ళ గన్నేరు పువ్వులు చక్కగా ఉపయోగపడుతాయి. బిళ్ళ గన్నేరు పువ్వులు, దానిమ్మ పువ్వుల నుండి రసం తీసి, వాటిని కలిపి ముక్కులో, నోటిలోని చిగుళ్లు మీద ఆ మిశ్రమాన్ని వేస్తే సమస్య నుండి బయటపడవచ్చు. ఇలా చేస్తే నోట్లో పుండ్లు,పొక్కులు కూడా తగ్గుతాయి.

బిళ్ళ గన్నేరుతెల్లజుట్టును తగ్గించడంలో కూడా ఈ చెట్టు ఆకులు ప్రభావవంతంగా పని చేస్తాయి. దానికోసం ఒక కప్పు ఈ ఆకులను తీసుకొని మిక్సీలో మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. తరువాత దీనిని వడకట్టి రసాన్ని తీసుకోవాలి. దీనిలో ఒక స్పూన్ కొబ్బరి నూనె, ఒక అరచెక్క నిమ్మరసం కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి కుదుళ్లకు పట్టించాలి. ఒక దూది ఉండను ఈ మిశ్రమంలో ముంచి కుదుళ్లకు పట్టేలా అప్లై చేయాలి. ఒక గంట ఆరనిచ్చి మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా కనీసం వారానికి రెండు సార్లు చేయడం వల్ల జుట్టు కుదుళ్లు బలంగా మారడంతోపాటు, తెల్లజుట్టు సమస్య తగ్గిపోతుంది. ఇప్పుడిప్పుడే తెల్లజుట్టు వస్తున్న వారికి జుట్టు నల్లగా మారుతుంది.

బిళ్ళ గన్నేరుఅలాగే ఈ బిళ్ళ గన్నేరు చెట్టు జిడ్డు చర్మం గలవారికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. ఈ ఆకులు, పువ్వులను సమాన భాగాలుగా తీసుకొని మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి. వీటి నుండి రసాన్ని వడకట్టి దానిలో ఒక స్పూన్ అలోవెరా జెల్ ,1 విటమిన్ ఈ క్యాప్సిల్ వేసుకోవాలి. విటమిన్ ఈ అందుబాటులో లేకపోతే ఆలివ్ ఆయిల్ రెండు, మూడు చుక్కలు వేసుకోవాలి.

బిళ్ళ గన్నేరుఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి చర్మంలో ఇంకిపోయేలా మసాజ్ చేయాలి. ఇది ఆరేంతవరకు ఉంచి మామూలు నీటితో కడిగేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల ముఖం పై మొటిమలు మచ్చలు తొలగి పోవడంతో పాటు జిడ్డు సమస్య తగ్గుతుంది. ఓపెన్ ఫోర్స్ సమస్య కూడా చాలా బాగా తగ్గుతుంది. బిళ్ళ గన్నేరు ఆకుల పేస్ట్, పసుపు, వేపాకుల పేస్ట్ రాసుకుంటే మొటిమలు మచ్చలు కూడా తగ్గుతాయి. బిళ్ళ గన్నేరు ఆకుల పేస్ట్ కీటకాలు, పురుగులు కుట్టిన చోట కూడా రాసుకోవచ్చు.

బిళ్ళ గన్నేరుఅయితే ఈ మొక్కల వలన ఎన్ని లాభాలు ఉన్నాయో, అదే విధంగా నష్టాలు కూడా వున్నాయి, పైన చెప్పిన చిట్కాలు అన్ని మనకున్న వ్యాధి తీవ్రతను బట్టి దానికి తగ్గ మోతాదులో మాత్రమే తీసుకోవాలి. ఎక్కువ మోతాదులో తీసుకుంటే ప్రాణానికి అపాయం కలిగే అవకాశం ఉంది. వీటిని ఉపయోగించే ముందు దానికి సంబంధించిన డాక్టర్ ను సంప్రదించటం ఉత్తమం. ముఖ్యంగా గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, అల్సర్లు ఉన్నవాళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ వీటిని తీసుకోకూడదు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR