నల్ల జీలకర్ర నూనె వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఆధునిక సమయంలో ఎక్కువ మంది ప్రజలను వేధిస్తున్న సమస్య జుట్టు రాలడం. శరీరంలో హార్మోన్స్ సమస్య, సరైన పోషకాహరం తీసుకోకపోవడం వలన జుట్టు రాలడం.. సన్నగా మారిపోవడమే కాకుండా.. కుదుళ్ళ చివరన చిట్లిపోవడం జరుగుతుంటుంది. ఈ సమస్యను తగ్గించుకోవడానికి అనేక రకాల ప్రయోగాలు చేస్తుంటారు. ఏవేవో మందులు, షాంపూలు వాడుతుంటారు. టీవీలో వచ్చే ప్రతి కెమికల్ ప్రొడక్ట్ కొనేసి ఉపయోగిస్తుంటారు. ఫలితంగా మరిన్ని జుట్టు సమస్యలతోపాటు చర్మ సమస్యలు ఎదుర్కోనే అవకాశం కూడా ఉంది.

నల్ల జీలకర్ర నూనెఅయితే మన వంటగదిలో ఉండే కొన్ని పదార్థాలు జుట్టు సమస్యలను తగ్గించడానికి ఎంతగానో సహయపడతాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నల్ల జీలకర్ర. నల్ల జీలకర్ర నూనె జుట్టు రాలడాన్ని ఎదుర్కుంటుంది. మరియు జుట్టు ఆరోగ్యంగా, బలంగా, పొడవుగా పెరగడానికి సహాయపడుతుంది. ఈ నూనెలో థైమోక్వినోన్ అనే సమ్మేళనం ఉంటుంది, ఇది యాంటిహిస్టామైన్. ఇది జుట్టు తిరిగి పెరగడానికి జుట్టు ఒత్తుగా ఉండటానికి సహాయపడుతుంది.

నల్ల జీలకర్ర నూనెనల్ల జీలకర్ర సీడ్ నూనెలో పొటాషియం, సోడియం, భాస్వరం, కాల్షియం, ఇనుము, మాంగనీస్, రాగి, జింక్, నికెల్, సెలీనియం మరియు ఇతర స్థూల- మరియు మైక్రోలెమెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే ఇందులో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి సహయపడతాయి. అలాగే చుండ్రు, సోరియాసిస్, తామర వంటి చర్మ సమస్యలను నయం చేస్తుంది. ఇందులో శక్తివంతమైన యాంటి హిస్టామైన్లు నిగెలాన్, థైమోక్వినోన్ ఉన్నాయి.

నల్ల జీలకర్ర నూనెఇది లినోలెయిక్ ఆమ్లాన్ని కలిగి ఉండడం వలన అకాల తెల్లజుట్టును నిరోధిస్తుంది. లినోలెయిక్ ఆమ్లం జుట్టులోని వర్ణద్రవ్య కణాల క్షీణతను నిరోధిస్తుంది. సాధారణంగా తలమీద ఉత్పత్తి అయ్యే సెబమ్ అనే సహజ నూనె మీ జుట్టుకు తేమ అందిస్తుంది. మరియు పోషిననిస్తుంది. అయితే ప్రతి ఒక్కరికీ వారి తలలో ఒకే రకమైన సెబమ్ ఉండదు. కానీ నల్ల జీలకర్ర మీ నెత్తిలో నూనె ఉత్పత్తిని నియంత్రిస్తుంది. ఇది మీ జుట్టు ఎక్కువ ఆయిలీగా లేకుండా చక్కగా ఉండేలా చేస్తుంది.

నల్ల జీలకర్ర నూనెనల్ల జీలకర్ర నూనెలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి జుట్టుపై ఫ్రీ రాడికల్స్ ప్రభావాలను తటస్తం చేస్తాయి. దీనివల్ల జుట్టు దెబ్బతినకుండా ఉంటుంది. అలాగే నల్ల జీలకర్ర నూనెలో ఒమేగా -3 మరియు 6 సేంద్రీయ అణువులు ఉంటాయి. ఇది తలలో రక్త ప్రసరణను ప్రోత్సహిస్తుంది. తద్వారా వారాల్లో జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఆరోగ్యమైన జుట్టు కోసం నల్ల జీలకర్ర నూనెను నేరుగా ఉపయోగించవచ్చు. లేదంటే ఇతర పదార్థాలతో కలిపి ఉపయోగించవచ్చు.

నల్ల జీలకర్ర నూనెను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం

ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ నల్ల జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ కలిపి తలకు అప్లై చేయాలి. 30 నిమిషాల తర్వాత షాంపూతో తలను శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి 2-3 సార్లు చేయడం వలన జుట్టు మృదువుగా మారుతుంది.

నల్ల జీలకర్ర నూనె, కాస్టర్ ఆయిల్ సమాన మొత్తంలో తీసుకోని రాత్రి పూట తలపై మసాజ్ చేయాలి. మరునాడు ఉదయాన్నే షాంపూతో శుభ్రం చేసుకోవాలి.

నల్ల జీలకర్ర నూనెనల్లజీలకర్రను కొంచెం కొబ్బరి నూనెలో కలిపి తలకు అప్లై చేయాలి. ఇలా కొన్ని వారాల పాటు చేయడం వలన జుట్టు రాలడం ఆగిపోతుంది. కొత్త జుట్టు పెరగడానికి సహాయపడుతుంది.

1 నిమ్మరసం, 2 టేబుల్ స్పూన్ల నల్లజీలకర్ర నూనెను కలిపి తలకు అప్లై చేసి 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి 2-3 సార్లు చేయడం వలన జుట్టు రాలడం ఆగిపోతుంది.

నల్ల జీలకర్ర నూనెనల్ల జీలకర్ర నేరుగా కూడా తలకు అప్లై చేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ల నల్ల జీలకర్ర నూనె తీసుకొని, తలమీద మర్దనా చేయండి. జుట్టు రాలడం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బాగా మసాజ్ చేయండి. నూనెను మూలాల నుండి చివర వరకు జుట్టుకు రాయండి. తరువాత 30 నిమిషాల నుండి గంట వరకు ఆరబెట్టండి, ఆపై షాంపూతో జుట్టును కడగండి. ఇలా వారానికి 2-3 సార్లు చేయడం జుట్టు పెరుగుతుంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR